దుర్గాదేవి..
”దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే” అని శృతి వాక్యం. సూర్యభగవానుని శివ, విష్ణు, బ్రహ్మరూపాలుగా చెప్పుకున్నాం. త్రిమూర్తి స్వరూపుడైన ఈ శివుడే ‘యజ్ఞరూపుడు’. యజ్ఞంతో మూడు లోకాలు అనగా మూడు భువనాలు నిర్మించబడతాయి. ఈ విధంగా మూడు భువనాలను సృష్టించి, రక్షించి, సంహరించే పరమాత్మ శక్తినే దుర్గాదేవి లేదా భువనేశ్వరీ అని అంటారు.
శుంభ, నిశుంభ అను రాక్షసులను సంహరించుటకు వచ్చిన దేవిని ‘దుర్గ’ అని అంటారు. శుంభుడు అనగా కామము, నిశుంభుడు అనగా క్రోధము. శరీరంలోని ప్రతీ భాగము కదిలించే శక్తి ‘శుం’ అనే దాన్ని ఉత్తేజపరిచేవాడు శుంభుడు. కామశక్తిని అణిచి పెట్టి ఉద్వేగాన్నిచ్చేది క్రోధము దీనిని ఉత్తేజపరిచేవాడు ‘నిశుంభుడు’. శుంభనిశుంభులు కూడా జగన్మాత సౌందర్యాన్ని చూసి మోహించారు. ఆమె మందలిస్తే కోపించిన వారివురిని సంహరించింది ‘దుర్గా’. ఈమెకు వాహనం వ్యాఘ్రం. వ్యాఘ్రము అనగా విశేషంగా ఆఘ్రాణించేది. మనకు కోరికలు, క్రోధము అనేవి పూర్వజన్మ వాసనను బట్టి వస్తాయి. ఆ వాసనను అధిష్టించి జీవుల కామక్రోధాలను నియంత్రించి పరమాత్మ యందు భక్తిని, మోక్షము నందు ఆనందాన్ని కలిగించేది దుర్గ. భాగవతంలో శ్రీకృష్ణావతార సమయంలో నారాయణుడు యోగమాయతో యశోదకు పుత్రికగా జన్మించి మధురకు వ చ్చి కంసుడికి బుద్ధి చెప్పి పన్నెండు నామాలతో అందరిచే పూజింపబడ్డాడు. అలా అవతరించిన యోగమాయనే దుర్గా, నారాయణి, కాత్యాయని, శివ, చండీ త్రయంబిక మొదలగు నామాలతో పూజింపబడే తల్లి దుర్గ. *”విద్యాందేహి శ్రియం దేహి జ్ఞానం దేహి’‘* అనగా క్రామక్రోధాలను, అహంకారాలని అణిచి జ్ఞానాన్ని ప్రకాశింప చేసేది దుర్గ.
”యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా
నమస్త స్యై నమస్త స్యై నమస్త స్యై నమో నమ:”
అని దుర్గా స్తుతి. ఈ అమ్మ దుర్గా అష్టమి నాడు అవతరించినది కావున ఆరోజు దుర్గాష్టమిగా ప్రసిద్ధి. దుర్గదేవి నక్షత్రం పూర్వాషాడతో కూడి ఉన్న ఉత్తరాషాడ కావున ఆ ఆమ్మను
ఆషాఢ ద్వయ సంభూతో వ్యాఘ్రవాహ మహేశ్వరీ
త్రిశూల ఖడ్గ హస్తాఛ దుర్గాదేవీ నమోస్తుతే ||
దుర్గాదేవినే భువనేశ్వరీ దేవిగా కూడా సేవించెదరు.
దుర్గాదేవికి ప్రియమైన నైవేద్యం : పాయసం.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment