కాశీ ఖండం -35 ~ దైవదర్శనం

కాశీ ఖండం -35

దివోదాసు కైవల్య ప్రాప్తి..  పుణ్య కీర్తి ,వినయ కీర్తి ,విజ్ఞాన కౌముదులు కాశీ చేరి పంచ నదీ తీర్ధం లో స్నానం విశ్వనాధ దర్శనం చేశారు .వీరి రాక తొ గంగ పులకించింది .ఆకాశ గంగ కన్నా కాశీ గంగ గొప్పది అనుకొన్నారు వాళ్ళు .ఇంతలో అగ్ని బిందు అనే మహా ముని సాక్షాత్తుత్తు శ్రీ మహావిష్ణువే పుణ్య కీర్తి అని గుర్తించి సాగిల పడి నమస్కరించాడు . విష్ణువు సంతోషించి వరం కోరుకో మంటే ఈ పంచ నది క్షేత్రం లో వెలిసి ఉండమని కోరాడు .సరే నన్నాడు .విష్ణువు కాశీ మహాత్మ్యాన్ని మహర్షికి వివ రిస్తూ ‘’ప్రళయేనపి  నాశోస్యః –శివ శూలాగ్ర సుస్తితే ‘’అంటే ప్రళయ కాలం లో అన్నీ నశించినా ,కాసి శివుని శూలాగ్రం పై నిలిచి ఉంటుంది .’’అని చెప్పి తాను బిందు మాధవుని గా పంచ నదీ తీర్ధం లో వెలిశాడు .త్రేతాయుగం లో అనంత మాధవుడిగా ,ద్వాపరం లో శ్రీ మాధవుడిగా ,కలియుగం లో బిందు మాధవుడిగా ఇక్కడ ఉన్నాడు .

             దివో దాసు గంగ పశ్చిమ తీరం లో ఆలయం నిర్మించి ‘’దివోదాసేశ్వర లింగం ‘’ను ప్రతిష్టించి శివుడిని అర్చించాడు భార్యా సమేతం గా .పుణ్య కీర్తి చెప్పిన ఏడు రోజుల గడువు పూర్తవుతోంది .శివుని ‘’వందే శంభు ముమా పతిం సుర గురుం వందే జగాత్కారణం

వందే పన్నగ భూషణం ,మ్రుగధరం ,వందే పశూనాం పతిం –వందే సూర్య శశాంక వహ్ని నయనం ,వందే ముకుంద ప్రియం –వందే భక్త జనాశ్రయం చ వరదం ,వందే శివం శంకరం ‘’అని స్తోత్రం చేశాడు .అకార ,ఉకార ,మకార ,నాద ,బిందు అనే అయి దింటి కలయిక అయిన ఓంకార స్వరూపుడా ,అ కారం పురుష వాచకం ,ఉకార ,మకారములు ప్రకృతి స్వరూపమైన స్త్రీ వాచకం అయిన ఉమ గా ,అర్ధ నారీశ్వరుడ వైన శివా అని స్తుతించాడు .’’లీయతే గమ్యతే యాత్ర తల్లిన్గమితి గీయతే ‘’అంటే లీనం ,గమ్యం ఈ రెండు శక్తులను స్వంతం చేసుకొన్న మీ నిర్గుణత్వానికి ప్రతీక లింగం మైన వాడా ,తక్షక ,వాసుకి అనే సర్పాలను ఆభరణం గా ధరించి,వారి వల్ల జానికి భయం లేకుండా చేసిన వాడా  జింకను చేతిలో చిక్కిన్చుకొన్న స్వామీ నీ మహిమ వర్ణించ గలమా ?/

            ఒక సారి మీ సంకల్పం తొ మీ నుండి జన్మించి పంచముఖుడై ,అసత్య వాది యై ఒక శిరస్సును పోగొట్టుకొని చతుర్ముఖ బ్రహ్మ అయినా మళ్ళీ అజ్ఞానం లో చిక్కుకొని ,తన సంకల్పం తొ మహా సౌందర్య రాశిని సృష్టించి ఆమె అందానికి తానే ముగ్ధుడై వెంట పడితే ఆమె పారి పోతు లేడి పిల్ల గా మారి తానూ లేడి గా మారి తరుము తాడు .తనకు దిక్కెవ్వరు అని ఆ లేడి పిల్ల క్క్షోభ పడితే నీవు ఆ మగలేడిని చేతి తొ పట్టుకొని ఆమెను కాపాడి నీ చేతుల్లో, జిన్కగా ఉన్న బ్రహ్మను పట్టుకొని గిల గిల లాడేట్టు చేస్తే దాసోహం అని బ్రహ్మ అంటే,కనికరించి ఆ చేతిలోని లేడి రూపం తోనే సదా భక్తులకు సాక్షాత్కరించ మని వేడుకొంటే అలానే కని పిస్తున్న మృగ పాణీ నీ లీలలు ఎన్ని అని పొగడ గలను ?

               నువ్వు పశు పతివి .అంటే పశువులకు పతివి అనికాదు అర్ధం ‘’ఏతా వంతో వై పశవః ద్విపద శ్చతుష్పదః‘’అంటే సృష్టి లోనీ ప్రతి ప్రాణీ పశువే .వీటన్నిటికి నువ్వు నాదుడివి అని అర్ధం .భూమి ,నీరు ,అగ్ని ,జలం ,ఆకాశం గాలి అనే పంచ భూతాల ను కల్పించి రక రకాల ప్రాణులలో ఇమిడ్చి ఆ ప్రాణాలకు అన్గాలుగా ఈ పంచ భూతాలనే శక్తులు గా మార్చి పాంచ భౌతిక శరీరాన్ని ఏర్పరచి వీటికి కర్త గా ఉన్న పంచ ముఖేశ్వరా !సూర్య చంద్రులు కాలాన్ని శాసించి పగలు రాత్రులను పంచుకొని వెలుగుతున్నారు .నువ్వ్వు మహా కాలుడి గా మారి వారిని శాసిస్తున్నావు .నీ నేత్రాలు సూర్య ,చంద్ర శక్తికి ఆధారం .దయామయుడిగా నీ రెండు కళ్ళ తొ అమృత వర్షాన్ని కురిపిస్తూ ,మితి మీరినపుడు నీ నుదుట ఉన్న అగ్ని నేత్రమైన మూడవ కన్ను తెరిచి దుష్ట శిక్షణ చేస్తావు .అని దివోదాసు కీర్తించాడు .

         దివోదాసు భార్య లీలా వతి ‘’శాంతం ,పద్మా సనస్తం ,శశిధర మకుటం పంచ వక్త్రం త్రినేత్రం

       శూలం ,వజ్రం చ ,ఖడ్గం ,పరశు ,మభయదం ,దక్ష భాగే వహంతం

        నాగం ,పాశం చ ఘంటం ,ప్రళయ హుత వహం ,సామ్కుశం ,వామ భాగే

        నానాలంకార యుక్తం ,స్పటిక మణి నిభం ,పార్వతీశం నమామి ‘’అని స్తోత్రం చేసింది .వేద వేద్యుడివి .సద్యోజాత ,వామ దేవ ,అఘోర ,తత్పురుష ,ఈశాన అనే పేర్ల తొ పంచముఖుడు గా ప్రసిద్ధుడవు .శూలం ,వజ్రాయుధం ,కరవాలం ,గండ్ర గొడ్డలి నాగం ,పాశం ,ఘంటా ,ప్రళయాగ్ని అమ్కుశాలను చేతులతో ధరించి ,అభయ హస్తం తొ నిన్ను నమ్మిన వారికీ భయమేమీ లేదని తెలియ జెప్పుతూ దాక్షాయిణీ విరహ వేదనను మనస్సు లోనే అణచుకొని హిమాలయాలలో పద్మాసనం వేసుకొని నీలో నువ్వే రమిచే పరమేశా నమో నమః

  ‘’ప్రాతః కాళే శివం దృష్ట్యా –నిశి పాపం వినశ్యతి –ఆ జన్మ కృత మధ్యాహ్నే –సాయాహ్నే సప్త జన్మ సు –మెరొహ్ కాం చన దత్తానాం –గవాం కోటి శతైరపి –పంచ కోటి తురంగానాం –తత్ఫలం శివ దర్శనం ‘’అని నుతించింది

           ఇద్దరు కలిసి ‘’ఆత్మాత్వం .గిరిజా మథిహ్ సహచరః ప్రాణాహ్  ,శరీరం గృహం

           పూజాతే విషయోప భోగ రచనా ,నిద్రా సమాధిస్తిథిహ్

           సంచారః పదయొహ్ ప్రదక్షిణ విధిహ్ స్తోత్రాని సర్వా గిరాః

            యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో శివారాధానం ‘’

‘’కర చరణ కృతం వా ,కర్మ వాకక్కాయజం వా –శ్రవణ నయనజం వా ,మానసం వా పరాధం

  విహిత మహితం వా ,సర్వ మేతత్ క్షమస్వ –శివ !  శివ !కరుణాబ్దే ! శ్రీ మహాదేవ ! శంభో !’’

  ‘’కాయేన ,వాచా, మనసేంద్రియైర్వా ,బుద్ధ్యాత్మ నావా ప్రకృతే స్వభావాత్

   కరోమి యద్యత్ శకలం పరస్మై –నమః శివాయేతి సమర్ప యామి ‘’

              అని ఆర్తిగా అర్చించారు .తాము చేసిన వన్నీ శివుని పాదాల ముందు ధార పోశారు .ఆ భక్తీపార వశ్యం లో ప్రాణాలను వదిలారు .రెండు దివ్య జ్యోతులు వారి శరీరాల నుండి వెలువడి లింగ రూపం గా విరాజిల్లే దివోదాశేశ్వర లింగ భవ్య కాంతి లో లీనంయ్యాయి . 

ముప్పది మూడు కోట్ల దేవతలు మహా నంద భరితులయారు .అప్పుడు పార్వతీ సహిత పర మేశ్వరుడు కాశి లో ప్రత్యక్ష మై నాడు .దివోదాస దంపతులకు జన్మ రాహిత్యాన్ని అనుగ్రహించారు .దేవత లందరికి విముక్తి ప్రసాదించారు .దుండి వినాయకుడు తండ్రికోరిక పై ప్రత్యక్ష మయాడు .తమ కుమారుడు గణేశ్వరుని వల్ల కాశి లో ఒక మహాద్భుతం జరిగిందని తాము కాశి లో స్తిర నివాసమేర్పరచుకోవటానికి తగిన వాతా వరణాన్ని వినాయకుడు కల్పించి నందుకు అభి నందించారు .మణికర్ణికా, డుంది వినాయక విశ్వేశ్వర దర్శనం తొ జనులు చరితార్దులవుతారని అభయ మిచ్చారు .కాశీ లోనీ సర్వ తీర్ధాలు ముక్తినిస్తాయని వరదానం చేశారు .
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive