గర్వభంగం. ~ దైవదర్శనం

గర్వభంగం.

పూర్వం పరమేశ్వరుడి ఢమరుకంలో నుంచి సంగీతంజనించింది
ఆ సంగీతాన్ని ప్రజలందరికీ అందించాలని అనుకున్నాడు పరమేశ్వరుడు. తన ఢమరుక సంగీతాన్ని అందరికీ అందించగల సమర్ధులు ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాడు శంకరుడు. గతంలో తుంబురుడు నారదుడు పరమ శివుని దర్శనం కోసం ఒక్కసారే వచ్చారు. వాళ్లిద్దరినీ పరమేశ్వరుడు చూశాడు. ఇక తను ఆలోచించవలసిన పనిలేదనుకున్నాడు. వెంటనే వాళ్లిద్దరికీ ఈ సంగతి చెప్పేడు. అలాగే! మీరు మీ సంగీతాన్ని మాకు నేర్పండి. దానిని మేము ప్రపంచానికి అందిస్తాము, అన్నారు తుంబుర, నారదులు. పరమశివుడు తన ఢమరుక సంగీతాన్ని వారిద్దరికీ నేర్పించాడు. తుంబురుడు దేవలోకం వెళ్లి దేవతలందరికీ సంగీతం నేర్పాలి శివుడి సలహా ప్రకారం. తుంబురుడు దేవలోకంలో సంచారం చేస్తున్నాడు. నారదుడు భూలోకంలో సంచారం చేస్తున్నాడు. ఇలా కొద్దిరోజులు గడిచాయి. ఇంతలో తుంబురుడికీ, నారద మహామునికీ చిన్న గొడవ వచ్చింది. ఇద్దరిలో ఎవరు
గొప్ప అని.
సంగీతం తనకే బాగా వచ్చునంటాడు నారద మహాముని. కాదు, నాకే అంటాడు తుంబురుడు. ఈ ఇద్దరి గొడవ పెరిగి పెద్దదయింది. సరే, వాళ్ళిద్దరూ తర్జన భర్జన పడి తీర్పుకోసం సరస్వతీదేవి దగ్గరకు వెళ్లారు. ఆమె ఆ ఇద్దరి సంగీతమూ విని... ఇద్దరూ ప్రవీణులే అంది... ఉహు... ఇది కోమటి సాక్ష్యంలా ఉంది అనుకున్నారు. అంచేత, పరమేశ్వరుడి దగ్గరకే వెళ్లారు ఇద్దరూ. పరమశివుడు, మీరిద్దరూ సంగీత విద్వాంసులు అన్నాడు. శంకరుడు కూడా నిష్పక్షపాతంగా చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు అనుకున్నారు తుంబుర నారదులు. జగన్మాత శివుని అర్థాంగి అయిన పార్వతీ దేవి దగ్గరకు వెళ్లారు ఇద్దరూ. మీరు అనవసరంగా శ్రమపడుతున్నారు. కానీ మీ ఇద్దరూ సమాన ప్రవీణులే అన్నది పార్వతీదేవి. అది సరే తల్లీ, మా ఇద్దరిలోనూ ఎవరికి ఎక్కువ సంగీతం వచ్చునో సెలవియ్యండి, అన్నారు వాళ్లు అది మాత్రం నాకు తెలియదు కానీ... అంటూ సమయస్ఫూర్తి అష్టసిద్ది నవనిధులకూ ప్రతీక అయిన హనుమంతుణ్ణి నిర్ణేత గా పెట్టాలని సంకల్పించి
ఆంజనేయుడికి సంగీతం బాగా వచ్చునట. అతనిని అడిగితే తెలియవచ్చు అని చెప్పింది పార్వతీదేవి.
సరే. అని వింధ్య పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడి దగ్గరకు వెళ్లారు తుంబుర, నారదులు. ‘‘పవనపుత్రా! నీకు సంగీతం బాగా వచ్చునని తెలిసి వచ్చాం. నీవు మా ఇద్దరిని పరీక్షించి మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సంగీతం వచ్చునో చెప్పాలి అంటూ ఆంజనేయుడిని కోరారు తుంబుర, నారదులు... సరే. మీ వీణలు నా చేతికిచ్చి మీరిలా కూర్చోండి, అన్నాడు హనుమంతుడు.

 నారద మహాముని తన మహతిని తుంబురుడు తన కళావతినీ ఆంజనేయుడి చేతికిచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు. ఆంజనేయుడు మఠం వేసుక్కూర్చొని, వినండి... అంటూ కంఠం ఎత్తి పాడడం మొదలుపెట్టేడు. తుంబుర, నారదులు ఆ శ్రావ్యమైన కంఠం విని పరవశులయ్యారు. అక్కడ ఉన్న కొండరాళ్లన్నీ ద్రవించి ప్రవహించేయి. ఆంజనేయుడు తన చేతిలో ఉన్న రెండు వీణలను కొండరాళ్లు ప్రవహిస్తున్న ప్రవాహం లోకి విసిరేశాడు. నిర్ఘాంతపోయారు తుంబుర, నారదులు. ఆంజనేయుడు పాటపాడటం ఆపాడు. పాట ఆపగానే ద్రవించిన రాళ్లన్నీ తిరిగి గడ్డకట్టుకున్నాయి. వారిద్దరూ ఆంజనేయుడి దగ్గరికి పరుగెత్తుకు వచ్చి మా వీణలు! అని అడిగారు.

శిశుర్వెత్తి పశుర్వెత్తి వెత్తిగాన రసం ఫణి
శిశువైనా పశువైనా సంగీత మాధుర్యం లో ఓలలాడుతునే ఉంటారు అన్నట్లు

...ఇప్పుడు మీ ఇద్దరూ పాడండి. మళ్లీ ఆ రాళ్లన్నీ కరిగేలా పాడండి. రాళ్లన్నీ ద్రవించగానే మీ వీణలు మీరు తీసుకోండి, అంటూ లేచి ఠీవిగా నుంచున్నాడు ఆంజనేయుడు.🙏🙏🙏🙏🙏

ముందు నేను పాడతాను అన్నాడు తుంబురుడు. అలాగే అన్నాడు నారదుడు. ‘‘నువ్వుండు నేపాడతా.. అంటూ నారద మహాముని పాట పాడనారంభించేడు. కాని ప్రయోజనం ఏమీ లేదు. పెదవులు విరుచుకుంటూ ఆంజనేయుడివైపు దీనంగా చూశారు. ఆంజనేయుడు మళ్ళీ పాటపాడాడు. మళ్లీ రాళ్లన్నీ ద్రవించి ప్రవహించాయి. ఆ ప్రవాహంలో మహతి, కళావతి పైకి తేలాయ్. ఆంజనేయుడు ఆ రెంటినీ తెచ్చి ఎవరివి వాళ్లకిచ్చి వేశాడు. పరమేశ్వరుని సంగీతాన్ని అందరికీ అందించడమే మీ లక్ష్యం. అందులో మీ ఇద్దరూ సమానులే. అని హితవు చెప్పేడు ఆంజనేయుడు.
అందుకే సుందరకాండ లో జాంబవంతుడు ఒకమాట చెప్తాడు వానరాలతో

#జాంభవాన్_యత్ర_నేతాస్యాత్_అంగదశ్చ #_మహారధ
#హనుమాన్_చాప్యదిష్ఠాతో_నతస్య_గతిరన్యధా

జాంబవంతుడిని మంత్రి గా అంగదుడు ని సేనానాయకుడు గా

హనుమంతుడి ని కార్యనిర్వాహకునిగా పెట్టుకున్న కార్యమేదీ చెడిపోదని

గర్వం తెలకెక్కితే ఎంతటి వారైనా నేలకొరగక తప్పదని దీని అంతరార్థం.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive