భక్తి అంటే ఏమిటి.? ~ దైవదర్శనం

భక్తి అంటే ఏమిటి.?


భక్తి అంటే విభక్తము కానిది. నువ్వు వేరు నేను వేరు అంటే విభక్తము. భక్తి అంటే నీవు, నేను ఒకటే! కాని నీవు భగవంతునితో ఎలా ఉన్నావు? నీవు వేరు నేను వేరుగా ఉన్నావు. భక్తిని ఆచరించనప్పుడు విభక్తంలో ఉన్నావు. భక్తిని ఆచరించి నప్పుడు నీవు, నేను ఒక్కటే అయ్యావు. నీవు నేను ఒక్కటే అనేది నిశ్చలంగా ఉండాలి. అదే   భక్తి అంటే! 

*“జీవేశ్వరో భిన్నః ఇతి ప్రథమ భ్రమః”* జీవుడు అనే వాడికి అయిదు భ్రమలు ఉన్నాయి, ఆ అయిదు భ్రమల వలెనే నీకు జీవభావం నిలబడి ఉంటుంది,  నువ్వు నేను వేరు అనే భ్రమ మనలో ఎంతగా బలపడింది అంటే నీవు నేను ఒకటే రా అని ఆ భగవంతుడే దిగి వచ్చి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. భగవంతుడు శంకరుడు ఆదిశంకరుల రూపంలో నడయాడి ఆసేతు హిమాచలం అందరికి చెప్పారు, ఉన్నది ఒక్కటే! భగవంతుడు ఒక్కడే, మీరందరూ నడయాడే దైవమె, నీవు నేను ఒక్కటే!

 *“పునః సత్యం పశ్యత్ సత్యం ధృవ పునః సత్యం పునః సత్యం సత్యమేవచ”*

 నేను సత్యమే చెపుతున్నాను వెయ్యి సార్లు చెప్తున్నాను భగవంతుడే సాక్షాత్తు అవతార మూర్తిగా వచ్చి చెప్పినా నమ్మనంతగా భ్రాంతి భ్రమ బలపడింది. వీటి నుండి బయటపడి  ఉప్పు నీళ్ళల్లో ఎలా కలసిపోతుందో,  అలాగే నీవు భగవంతుడిలో కలసిపోవటమే భక్తి. కలిసి పోయానన్న ఉనికిని కూడా కోల్పోవటమే జ్ఞానం.  జ్ఞానాన్ని పొందాలంటే ముందు నిశ్చల మైన భక్తి కావాలి. 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List