వెదురుతో చేసినవి, రాయి, నేల, కొయ్యి, చిగురాకులు... వీటిని ఆసనాలకు వాడకూడదు. దర్భాసనం, కంబళి, చిత్రాసనం శ్రేష్ఠం. చంపకుండా, హింసించకుండా గ్రహించిన జింకచర్మం, పులిచర్మం కూడా ఆసనాలకు పనికివస్తాయి. దర్భాసనం పుష్టినీ, కంబళి దుఃఖవిమోచనాన్నీ, చిత్రాసనం అభిష్టసిద్ధినీ, జింకచర్మం జ్ఞానాన్నీ, పులిచర్మం మోక్షాన్నీ ప్రసాదిస్తాయని శాస్త్ర వచనం.
Home »
» జపం, ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి ఆసనాల మీద కూర్చోవాలో తెలియజేస్తారా?
No comments:
Post a Comment