కాశీ ఖండం –25 ~ దైవదర్శనం

కాశీ ఖండం –25

మణి కర్ణికాఖ్యానం... అగస్త్యుడు కుమార స్వామిని అవి ముక్త క్షేత్ర మైన కాశి ఎప్పటి నుంచి ఉన్నది ,మోక్ష కారణం ఎలా అయింది ,అంతకు ముందు అక్కదేముంది గంగా నది లేనప్పుడు కూడా కాశి ఉన్నదా ,రుద్ర నివాసం అనే పెరేట్లా వచ్చిందో వివ రించమని వేడాడు .అప్పుడు స్కందుడు ఇలా చెప్పాడు .ప్రళయ కాలం లో స్తావర ,జంగమా లన్ని నశించి సూర్యుడు ,గ్రహ నక్షత్రాలు లేక సమస్త బ్రహ్మాండం చీకటి గా ఉండేది .శూన్య మైన ఆకాశం ఇతర తేజస్సు చేత వృద్ధి పొందేది .ద్రష్ట లెవరూ లేని సమయం లో శబ్ద స్పర్శ రస గందాదులు లేని కాలం లో దిక్కులు కూడా తెలియని స్తితి ఉండేది .అప్పుడు‘’తత్వత్ బ్రహ్మ ‘’అని వేదం ఎవరి గురించి చెప్పిందో ,నామ రూపాలు ఎవరికి లేవో, స్తూల సూక్ష్మ రూపాలు ఎవరికి లేవో, ఆనంద స్వరూపుడేవ్వడో ,నిర్వికల్పం ,మాయా రహితం ,అది అసం విత్తు అని పిలువ బడుతుంది .ఈ అద్వితీయుడు సృష్టి చేయాలని సంకల్పించాడు .దీని నిర్వహణకు ఇంకోరు తోడు కావాలని అనుకొన్నాడు .

            అప్పుడు ‘’మాయా శక్తి ‘’ని సృష్టించాడు .అది సర్వైజ్ఞాత్వం ,సర్వ జ్ఞానం కలది .అంతట  నిండి ఉండేది ,అన్నిటిని చూసేది అన్నిటిని సృష్టించేది అది .దానినే ‘’పర ‘’అన్నారు .ఆ తర్వాతా బ్రహ్మ ను సృష్టించాడు . సృష్టికి ఆద్యుడను .మాయ ఆయననేప్పుడు  విడిచి ఉండదు .ఆ  మాయనే ప్రకృతి అంటారు .మాయ కాల స్వరూపిణి .ఈశ్వర శక్తి యేప్రకృతి .ఆ పరాశక్తిని ఈశ్వరుడు రమించాడు .వారి ఆనంద ఫలితమే ఈ కాశి పట్టణం .ప్రళయ కాల మందు కూడా శివా శివులు దీన్ని వదలి పెట్టరు .మహా ప్రళయం లో సముద్రాలు ,భూమి వికలం అయి నప్పుడు తాను విహరించటానికి ఈశ్వరుడు కాశి ని నిర్మించాడు .ఆనందాన్నిస్తుంది కనుక ఇది ఆనంద వనం అనే పేరు తెచ్చు కొన్నది .

              పార్వతీ పరమేశ్వరులకు ఇంకా ఏమి సృష్టించాలి అన్న ఆలోచన వచ్చింది .పార్వతి దేవి వైపు సాభి ప్రాయం గా చూశాడు .వెంటనే ఆమె శరీరం నుండి సత్వ గుణో పెతుడైన అచ్యుతుడుద్భ వించాడు .అప్పుడు శివుడు అతని తొ‘’నువ్వు విష్ణువు అనే పేరు తొ పిలువబడుతావు .నా ఉచ్చ్వాస నిస్శ్వాసాల వల్ల వేదాలు ఉద్భవిస్తాయి అని చెప్పి విష్ణువుకు బుద్ధిత్వానికి అది పతిని చేశాడు .శివుడు ఆనంద కాననానికి పార్వతి తొ సహా వెళ్లి పోయాడు .

     విష్ణువు శివుని గురించి తపస్సు చేయ సంకల్పించాడు .సుదర్శన చక్రం తొ భూమిని త్రవ్వి ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .అందులో ఆయన చెమట బిందువులు పడి నీటి తొ నిండిపోయింది .దాని ఒడ్డున తీవ్ర తపస్సును కదలకుండా చేసి స్తాణువే అయ్యాడు .ఈశ్వరుడు సతీ సమేతం గా వచ్చి మెచ్చాడు ఎల్లప్పుడు శివ పార్వతులను దర్శించే భాగ్యం ప్రసాదించమని విష్ణువు వరం అడిగాడు .సరేనన్నాడు .విష్ణువు కఠోర తపస్సుకు ఇంకో వరం ఇచ్చాడు .విష్ణువు తపస్సు చూసి ఆనందం తొ శిరస్సు ఊపుతుంటే ఆయన మణి కర్ణిక అనే కర్ణ భూషణం ఒకటి జారి పుష్కరిణి లో పడింది .అది ఇక నుంచిఆ ప్రదేశం అంటే విష్ణువు తవ్విన పుష్కరిణి  మణి కర్ణికఅని పిలువబడుతుందని చెప్పాడు .

                 అప్పుడు విష్ణువు ‘’శివా !నీ వల్ల ఈ పుష్కరిణి మణి కర్ణిక అవటం ఆనందం గా ఉంది.ఇది ఉత్తమొత్తమమైనది అవాలి ఇక్కడ ఎప్పుడు మహోదయం కావాలి ‘అని కోరాడు సరే నన్నాడు భవుడు.శివుని పరి పరి విధాల స్తోత్రం చేశాడు .ఎక్కడ యముని భయం ఉండదో ,ఎక్కడ గర్భ నరకం ఉండదో అదే కాశి ..అని స్కందుడు అగస్త్య ర్శి కి చెప్పాడు .’’నేను యువకుడిని .నాకు మరణం చాలా దూరం ఉంది .మృత్యువు గురించి నాకు ఇప్పుడే విచారం ఎందుకు ?/అను కొనే వాడికి యముడి దున్న పోతు ఘంటా రావం విని పిస్తుంది .శరీరం మీద ఆసక్తి దూరం చేసుకొన్న వాడికి, శివుని పై దృఢ చిత్తం తొ ఉన్న వాడికి శివ పురి నివాసం కల్గుతుంది ..

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive