తంత్ర మార్గం - దశ మహా విద్యలు - కాళీ తత్త్వం ~ దైవదర్శనం

తంత్ర మార్గం - దశ మహా విద్యలు - కాళీ తత్త్వం

కాళీ ఉపాసన మన ఆంద్రదేశంలో అంతగా కనిపించదు. కాని బెంగాలు రాష్ట్రంలో కాళి ప్రతి ఇంటిలో ఇలవేలుపుగా ఆరాధించ బడుతూ ఉంటుంది.వారికి కాళి ముద్దులపట్టి. దసరా నవరాత్రులు వచ్చాయంటే  బెంగాలు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

ప్రతిఇంటిలో కాళిని సొంతకూతురు గా భావించి అల్లుని ఇంటినుంచి పండుగకు పుట్టింటికి వచ్చినట్లు భావించి ఉత్సవాలు చేస్తారు.దసరా తరువాత తిరిగి ఆమె అల్లుని ఇంటికి పోయేటపుడు ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం.నిజంగా బాధను తట్టుకోలేక భోరున ఏడిచేవాళ్లు ఎందఱో ఉన్నారు.అట్టి భక్తి ఉన్నది కనుకనే బెంగాలురాష్ట్రంలో కాళీసిద్ధులు ఎందఱో ఈనాటికీ మనకు కనిపిస్తారు.

కాళికాతత్వాన్ని తెలుసుకోవలేనంటే శ్రీరామకృష్ణుని మాటల్లోనే తెలుసుకో గలము.సాక్షాత్ అవతారమూర్తి చెప్పినమాటల కంటే అధికారిక వివరణ ఇంకొకటి ఉండబోదు.కాళీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీరామకృష్ణుడే. దక్షిణేశ్వర కాళికాలయంలో ఉన్న కాళీమూర్తి ఆయన మాటలకు స్పందించింది.నైవేద్యం పెడితే తిన్నది.సందేహాలకు తల్లిగా సమాధానం చెప్పింది.నిరాశలో ఓదార్చింది.సమస్త దివ్యానుభవాలను అలవోకగా ప్రసాదించింది.గొప్ప గురువులను రప్పించింది.ఆయా సాధనామర్మాలు తానే చెప్పి చేయించింది. సిద్ధిదాత్రియై అనుభూతులను ఇచ్చింది.

వివేకానందుడు కల్లోలస్థితిలో ఉన్నపుడు శ్రీ రామకృష్ణులు ఆయన్ను దేవాలయానికి పోయి కాళీమాతనే ఏమికావాలో అడుగమని చెబుతారు. నరేంద్రుడు ఆలయంలో ప్రవేశించి కాళీవిగ్రహం ఎదుట నిలువగానే ఆయనకు కాళీమాత సజీవంగా పీఠంపై నిలబడి దర్శనం ఇచ్చింది. ఆ ప్రేమమయ తెజోమూర్తిని చూచిన నరేంద్రుడు తన లౌకికసమస్యలను మరచి శుద్ధభక్తిని వైరాగ్యాన్ని మాత్రమె కోరి తిరిగి వెనుకకు వస్తాడు.

ఒకరోజు,  రాఖాల్ను కాళీమాతమందిరం ఎదురుగా ఉన్న నాట్యమంటపంలో ధ్యానం చేయమని శ్రీ రామకృష్ణులు రాత్రిపూట ఒంటరిగా పంపిస్తారు.రాఖాల్ ధ్యానానికి కూర్చోనగానే తనకు కలిగిన దివ్యానుభవానికి చకితుడై పోయాడు.గర్భగుడిలోనుంచి కళ్లు మిరమిట్లు గొలిపే తెజోరాశి బయలుదేరి లోకాన్నంతా తన తేజస్సులో ముంచుతూ రాఖాల్ వైపు వచ్చి అతన్ని కూడా ముంచెత్తుతుంది. ఆ అనుభవంలో తన వ్యక్తిత్వం అదృశ్యం అయి సమాధిస్థితిని అందుకొంటాడు రాఖాల్. తరువాతి కాలంలో ఈయనే బ్రహ్మానందస్వామిగా లోకపూజ్యుడైనాడు. రాఖాల్ మాకందరికీ రాజు అని వివేకానందస్వామి స్వయంగా అనేవారు.

రాఖాల్ మరియు నరేంద్ర ఇద్దరూ యువకులుగా ఉన్నపుడు బ్రహ్మసమాజ భావనలకు ప్రభావితులై విగ్రహారాధనను నిరసించేవారు.అదే వివేకానందుడు జ్ఞానమూర్తిగా అమెరికాలో పర్యటించినపుడు విగ్రహారాధనలోని రహస్యాలను చెప్పి పాశ్చాత్యులను చకితులను చేసాడు. తాను సాధించిన లోక ప్రసిద్ధిని విజయాలను కాళీమాత తన ద్వారా చేయించినదని తాను ఒక పనిముట్టును మాత్రమె అని ఆయన విశ్వసించేవాడు.


కలకత్తా కాళీఘాట్లో ఉన్న కాళీమాత మరియు దక్షినేశ్వర్లో ఉన్న కాళీమాత విగ్రహాలు సజీవమూర్తులు. అనగా జాగృత దేవతలు. ధ్యానములో కొంత సాధన ఉన్నవారికి ఇది అనుభవంలోకి వస్తుంది.

'Autobiography of a Yogi' అనే తన పుస్తకంలో పరమహంస యోగానందగారు దక్షినేశ్వరంలో తనకు కలిగిన కాళీమాత దర్శనాన్ని 'The heart of a stone image'  అనే అధ్యాయంలో అద్భుతంగా వర్ణించారు.

హలదారి అని ఒక భక్తుడు శ్రీ రామకృష్ణుల తో
ఉంటాడు.కాళి తామసిక దేవత ఆమెను పూజింపరాదు అని అతను అంటాడు.అది విని శ్రీరామకృష్ణులు ఏడుస్తూ అమ్మ ఎదురుగా కూలబడి 'ఏమిటమ్మా ఇది? ఈ విషయం నిజమేనా?నీవు తామసిక దేవతవా?' అని అడుగుతారు.

అప్పుడు అమ్మ సమస్త ప్రపంచాన్నీ మిరుమిట్లు గొలిపే తన దివ్యరూపంతో కనిపించి 'వాడి ముఖం.వాడొక అల్పుడు.నా నిజతత్త్వం వాడికేమి తెలుస్తుంది నాయనా?ఒక్క తామసిక గుణమేం ఖర్మ?రాజసికమూ నేనే.సాత్వికమూ నేనే.మూడు గుణాలూ నాలోనే ఉన్నాయి.అవి నేనే.వాటికి అతీతంగా కూడా నేనే ఉన్నాను.చూడు' అంటూ ఆ దర్శనాలను ప్రసాదిస్తుంది.

అప్పుడు శ్రీరామక్రిష్ణులు సంతోషంతో కాళికాలయం నుంచి బయటకు వస్తూ 'ఒరే మూర్ఖుడా!!నువ్వొక తెలివిలేని దద్దమ్మవని అమ్మ చెప్పింది. ఇంకెప్పుడూ కాళి తామసిక దేవత అని అనకు.' అని చీవాట్లు పెడతారు.

తెలియని వారికి కాళి ఒక భయంకర దేవత.

తెలిసిన వారికి ఆమె ప్రేమమయి.సమస్త జగత్తులకూ తల్లి.ఆపదలో రక్షించే దివ్యజనని.నవ్వుతూ వరాలిచ్చే దేవత.

కాళీ అనుగ్రహాన్ని పొందితే తంత్ర రహస్యాలన్నీ అరచేతిలో వచ్చి నిలుస్తాయి.కాళి అనగాఒక క్షుద్రదేవత అనితప్పుడుభావనప్రపంచంలోఉంది. దీనికిచాలావరకుమనకథలు, సినిమాలునమ్మకాలుకారణం. పాశ్చాత్యుల తప్పుడు ప్రచారం కూడాఒక కారణం. కాని అసలు నిజం అది కాదు.

కాళి గురించి తెల్సుసుకోవాలంటే తాన్త్రికులనుఅడగాలి. ఎందుకంటే ఆమె తాన్త్రికులకు ఇష్టదేవత. ఆమె గురించిన రహస్యములు అన్నీ తంత్రగ్రంథములలో నిక్షిప్తములై ఉన్నాయి.

నవీన కాలములో కాళీ ఉపాసన నుపునరుజ్జీవింప చేసిన వారు శ్రీ రామకృష్ణపరమహంస. ఆయన ఇచ్చిన వివరణలు వేద, వేదాంత, తంత్ర, పురాణములకు అనుగుణంగాఉన్నాయి. సర్వ ఆమోదయోగ్యం గా ఉన్నాయి.

ఒకరోజు హజరా అనేవాడు కాళి తామసిక దేవతఅని విమర్శిస్తాడు. అది విని శ్రీ రామకృష్ణుడుబాధ పడి కాళీ మాతనే అడుగుతాడు. అప్పుడుమాత ఆయనతో "వాడి మాటలు పట్టించుకోకునాయనా. వాడొక మూర్ఖుడు. వాడికేమి తెలుసు? అని ఓదారుస్తూ తామసిక, రాజసిక, సాత్వికగుణములూ తానేనని, అలాగే గుణాతీత నిరాకారనిశ్చల పరబ్రహ్మమూ తానె అన్న అనుభవాన్నిదర్శనాన్ని ఆయనకు కలిగిస్తుంది.

శ్రీ రామకృష్ణ పరమహంస కాళీ మాతగురించిఇలా చెప్పారు.

బ్రహ్మము నిశ్చలము. త్రిగుణాతీతము. శక్తి చలనశీలము మరియు త్రిగుణాత్మిక. బ్రహ్మము శక్తీఒకటే. ఒక కోణమున అదే బ్రహ్మము. ఇంకొకదృష్టిలో అదే శక్తి.

దీనికి ఆయన మూడు ఉదాహరణలు ఇచ్చారు.
మొదటి ఉదాహరణ: నిశ్చల సముద్రము. కల్లోలమైన అలలతో ఘోషిస్తున్న సముద్రము. మొదటిది బ్రహ్మము. రెండవది శక్తి.
రెండవ ఉదాహరణ: అగ్ని మరియు దాని కాల్చేశక్తి. అగ్ని బ్రహ్మము. దాని కాల్చే స్వభావముశక్తి.
మూడవ ఉదాహరణ: చుట్టగా చుట్టుకొని పడుకొనిఉన్న సర్పము. మరియు చర చరాకదులుతున్న సర్పము. మొదటిది బ్రహ్మము. రెండవది శక్తి.

వేదములు దేనిని బ్రహ్మము అంటున్నవో, తంత్రము దేనిని పరమశివుడు అంటున్నదో, పురాణము దేనిని భగవంతుడు అంటున్నదోదానినే ఆయన కాళి అని పిలిచారు. త్రిగుణములను ఆధారముగా చేసుకొనిలోకములను సృష్టి స్థితి లయములు చేస్తున్నదికనుక శక్తి అని పిలువబడుతున్నది. అదే శక్తి ఈపనులు చేయకుండా గుణములకు అతీత స్థితిలోనిశ్చల స్థితిలో ఉన్నపుడు పరబ్రహ్మము అనిఅంటున్నాము.

ఇంకొక విధముగా శక్తి మరియు శివుడు అనితంత్రము వీనినే పిలిచింది. అందుకనే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని స్తుతించటంజరిగింది. పార్వతీ పరమేశ్వరులు జగత్తుకు తల్లితండ్రులు అన్న అద్భుత భావనకు ఇది వివరణ. నిజమునకు కాళి, శివుని కంటే వేరు కాదు. స్థితిలోనే భేదము. తత్వ భేదము లేదు.
Share:

Related Posts:

1 comment:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive