మనస్సు - శక్తి పరివర్తనం. ~ దైవదర్శనం

మనస్సు - శక్తి పరివర్తనం.

మనసు కూడా ఒక శక్తి. ఆ శక్తి  సానుకూలంగా  ఉంటే అది అర్థవంతమైన పనిని చేయిస్తుంది. ప్రతికూలంగా (negative)  ఉంటే, అది అనర్థాలకు దారి తీస్తుంది.  కొన్ని శక్తులను, కొన్ని ప్రకంపనల frequency లను, కొన్ని తరంగాలను (wave lengths) మారుస్తూ..... అంటే  బీజ మంత్ర ఉచ్ఛారణ చేస్తూ.... చేస్తూ.... మన నడవడిని ఒక సక్రమ మార్గానికి తీసుకురావచ్చు. పూర్వకాలంలో ఋషులు మునులు కూడా ఈసాధనలతోనే, (ధ్వని తరంగాల మార్పులతోనే) ఒక మానసిక సంతులన తీసుకువచ్చి, ఇంద్రియాలను నియంత్రణ చేశారు. మనకు, ఒక్కొక్క ప్రదేశం నుంచి ఒక్కొక్క విధంగా ధ్వని తరంగాలు వస్తూంటాయి. ఆ ధ్వని తరంగాలకు ఒక స్థాయి ఉంటుంది.  ధ్వని దాని యొక్క తరంగాన్ని బట్టి (wave lengths-frequencies), ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా శరీరంలోని ఒక భాగం నుండి వస్తూంటుంది.  ఉదాహరణకి  "ఓ" అనే అక్షరం  నాభి స్థానం నుండి,  "హ" అనే అక్షరం  కంఠము నుండి,  "శ" అనే అక్షరం నాలుక నుండి,   "య" అనే అక్షరం హృదయ స్థానం నుండి వస్తూ ఉంటాయి.  శక్తి "ఐం"అంటే ఒక విధంగానూ, "క్లీం" అంటే మరొక విధంగానూ,  "శ్రీం" అంటే మరొక విధంగానూ ఉంటుంది ఈ రకరకాలైన ధ్వని తరంగాలను తీసుకువచ్చే క్రియ, మనలో చేతనత్వాన్ని అనుసంధానాన్ని తీసుకు రావడానికి కారణమవుతుంది.

      కేవలం ఒక ఆలోచనా శక్తికి కారణమవుతున్నది. ఒక పాజిటివ్ ఆలోచనా ప్రశాంతతను చేకూర్చే ఒక నెగిటివ్ ఆలోచన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. పాజిటివ్ ఆలోచనా ఆనందం అడుగులు వేయిస్తూ......  నెగిటివ్ ఆలోచన ఆందోళన కలిగిస్తుంది. వీటికి మూలం శక్తి. శ్వాసకోశ వ్యవస్థలో ప్రాణశక్తి,విసర్జక వ్యవస్థలో అపాన శక్తి, జీర్ణవ్యవస్థలో సమాన శక్తి, నాడీ వ్యవస్థలో వ్యాన శక్తి, రక్త ప్రసరణ వ్యవస్థలోఉదాన శక్తి సంచరిస్తూ... సక్రమంగా జరిపిస్తూ ఉంటాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List