108 సంఖ్య. ~ దైవదర్శనం

108 సంఖ్య.

కొన్ని సంఖ్యలకు విశేష ప్రాధాన్యం ఉంది. అందులో 108 ప్రధానమైనది. 9వ సంఖ్యకు కూడా ఎంతో క్రేజ్ ఉంది. అసలు వీటికి ఎందుకింత ప్రామఖ్యత ఉంది... మానవ జీవితానికి వీటికి ముడిపడ్డ అంశాలు ఏమిటనేవి చాలా ఆసక్తికరమైన విషయాలు.

చాలామంది ఆలయాల్లో 108 సార్లు ప్రదక్షిణలు చేస్తుంటారు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆలాయాల్లోని పూజారులు భక్తులకు 108 పూసలున్న జపమాలు ఇస్తుంటారు. ఆ పవిత్ర పూసలు గల జపమాలను 108 సార్లు గణిస్తూ దేవుడిని తలుచుకోమని చెబుతారు. దీంతో ఆనందం, శాంతి, సౌభాగ్యం ఆధ్యాత్మికత భావన కలుగుతాయంటుంటారు. అయితే వీటికి గల కారణాలు చాలా ఉన్నాయి.

#జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు, 9 గ్రహాలుంటాయి అందువల్ల 12 x 9 = 108. 108 అనే సంఖ్య 9చే భాగించబడుతుంది. అందువల్ల 9 అనే సంఖ్యకు కూడా ఎంతో విశిష్టత ఉంది. అలాగే 9వ గుణింతంలో కొన్ని గమనించాల్సిన అంశాలున్నాయి. 9 X 7 = 63 (6 + 3 = 9), 9 X 5 = 45 (4 +5 = 9), 9 X 16 = 144 (1+ 4+ 4 = 9) ఇలా పలురకాలుగా 9 గుణింతంలో అంతా 9 సంఖ్యనే కనబడుతుంది.

ప్రతి ఒక్కరు 9నెలలు (36 వారాలు) తల్లి గర్భంలో ఉంటారు. కేవలం మనుషులు మాత్రమే ఇలా తల్లి గర్భంలో9 నెలల పాటు ఉంటారు. అలాగే మన శరీరంలో కూడా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, తదితర వాటితో కలిపి మొత్తం నవరంధ్రాలుంటాయి.

మహాభారతంలో మొత్తం 18 అధ్యాయాలు వున్నాయి. మహాభారతంలో చివరకు జరిగే యుద్ధం 18 రోజులు. ఈ యుద్ధంలో పాల్గొన్న సైన్యాలు 18. కౌరవుల నుంచి 11కాగా పాండవుల నుంచి 7 సైన్యాలు పాల్గొన్నాయి. పాండవుల నుండి - ఈ యుద్ధంలో మొత్తం 18 సైన్యాలు ఉన్నాయి. జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి ఇచ్చిన మహాకానుక భగవద్గీత. ఈ పవిత్ర గ్రంథంలో మొత్తం #18 అధ్యాయాలు ఉన్నాయి.
పాండవులు (36 = 9) మహాభారతం యుద్ధం ముగిశాక 36 సంవత్సరాల పాటు హస్తినాపురాన్నిపాలించారు.

సంఖ్యాశాస్త్ర ప్రకారం 108 కి యజ అనే పేరు కలదు. దీనిని తిరగేస్తే జయ అనే అర్ధం వస్తుంది. అందువల్లనే 18 పర్వాలు,18 అధ్యాయాలు, కల మహాభారతానికి_జయ అని మొదటగా నామకరణం చేసారు.

ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలుంటాయట. 108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయి. ఇవి శరీరంలో ప్రధాన స్థానాలు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List