మోఢేరా సూర్య దేవాలయం. ~ దైవదర్శనం

మోఢేరా సూర్య దేవాలయం.

గజనీ మహ్మద్ రహస్యం ఈ ఆలయంలో ఉంది ..
భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే ప్రధాన కేంద్రాలు మన ఆలయాలు ,క్షేత్రాలు ,తీర్దాలు . వేల సవ్త్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలను ,పరమతస్తుల దాడులను తట్టుకొని భారతీయ శిల్పకళా వైభవాన్ని,నాటి నిర్మాణ శైలిని ప్రపంచానికి చాటి చెబుతూ కాల పరీక్షకు ఎదురొడ్డి నిలిచి తమ ఉనికిని నిలబెట్టుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుణ్యభూమిలో .అలాంటి ఆలయమే ఇప్పుడు మనం చూడబోయే ఆలయం .

భారతదేశంలోని మూడు ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి మాత్రమె మనకు తెలుసుఅవే  కోణార్క్ ఆలయం , మార్తాండ్ ఆలయం,  అరసవెల్లిఆలయం .చరిత్ర మరుగున పడిపోయిన నాల్గవ ప్రాచీన సూర్యదేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం.భారత నిర్మాణ సైలినే కాదు ఒక రహస్యాన్ని కూడా తనలో దాచుకొని చరిత్రకారులకు అందించిన ఈ ఆలయమే మోడేరా సూర్య దేవాలయం.క్రీస్తుపూర్వం సోలంకి చక్రవర్తులు పునర్నిర్మించినట్టు చెబుతున్న ఈ ఆలయం గుజరాత్ లో ఉంది .అహ్మదాబాద్ కి వంద కిలోమీటర్ల దూరంలో పుష్పవతి నది వడ్డున ఉన్న ఈ ఆలయ ప్రస్తావన బ్రహ్మ ,స్కాంద పురాణాలలో ఉంది.

ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందన్నది తెలీదు కానీ క్రీ.పూ. 1022, 1063లో సోలంకి చక్రవర్తి భీమ్ దేవ్ సోలంకి ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.స్కాందపు, బ్రహ్మ పురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుపక్కల వున్న ప్రాంతాలను ధర్మరన్య అని పిలిచేవారని తెలుస్తోంది.త్రేతా యుగంలో  శ్రీరాముడు రావణున్ని సంహరించిన తరువాత బ్రహ్మహత్యా పాపం నుంచి బయటపడేందుకు తగిన మార్గం శూచించమని కులగురువైన వశిష్టుడ్ని అడిగాడని అప్పుడు  వశిష్ట మహర్షి ధర్మరన్య వెళ్ళమని శ్రీరామచంద్రుడికి సలహా ఇచ్చాడని .రాముడు విడిది చేసి తమ కులదైవం సూర్యుడికి పూజ చేసి ఇక్కడొక ఆలయం నిర్మించాడని ఆ ధర్మారణ్య ప్రాంతమే ఇప్పుడు మోఢేరా అనే పేరుతో పిలవబడుతోందని చెబుతారు. అహిల్‌వాడ్ పాటణ్ ని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని సోలంకి చక్రవర్తులు పరిపాలిస్తుండే వారు సూర్య వంశస్తులైన సోలంకీలు మోడేరాలో ఉన్న సూర్యదేవాలయాన్ని ఎంతో పవిత్రంగా చూసుకునేవారు .తమ కులదేవతగా సూర్యుణ్ణి ఆరాధిస్తూ నిత్య పూజాదికాలు నిర్వహించేవారు . క్రీ.పూ. 1025, 1026 ప్రాంతంలో సోమనాథ్ తో పాటు చుట్టుపక్కల వున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమ్మద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్టు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఒక గోడపై లిఖించబడి వుంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు కూడా తమ పూర్వవైభవాన్ని కోల్పోయారు.

సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్‌వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది.తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాజ కుటుంబం మరియువర్తకులు  ఓ జట్టుగా ఏర్పడి ఈ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు అందమైన ఈ  సూర్య దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది .భారతదేశంలోని కోణార్క్ ఆలయం , మార్తాండ్ ఆలయం,  అరసవెల్లి అనే మూడు ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి మాత్రమె మనకు తెలుసు .చరిత్ర మరుగున పడిపోయిన నాల్గవ ప్రాచీన సూర్యదేవాలయమే  ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాలో ఉన్న సూర్య దేవాలయం శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రత్యేకత ఒకటుంది. అదేమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం ఉపయోగించకపోవటం .

ఇరానీ శిల్పకళా శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు.ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా, రెండవది సభామండపం,గర్భగుడి మందిర లోపల పొడవు 51అడుగుల 9అంగుళాలు.అలాగే వెడల్పు 25అడుగుల 8అంగుళాలుగా నిర్మించారు.మందిరంలోని సభామండపంలో మొత్తం 52స్తంభాలు వున్నాయి. ఈ స్థంభాలపై అత్యధ్బుతమైన కళాఖండాలు,పలు దేవతల చిత్రాలను చెక్కారు.రామాయణం, మహాభారతంలోని ప్రధాన ఘట్టాలను ఇక్కడ మలిచారు.స్తంభాల కింది భాగం అష్ట కోణాకారంలోను, పైభాగం గుండ్రంగా మలచబడి ఉన్నాయి .సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు.సభామంటపానికి ఎదురుగా విశాలమైన కొలను వుంది. దీన్ని  సూర్యమడుగు లేదా రామ మడుగు అని పిలుస్తారు.అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేసమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం సాడు.మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేసాడు.ప్రస్తుతం భారతీయ పురావస్తుశాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.అహ్మదాబాద్‌ నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది. అహ్మదాబాద్‌ వరకు రైలు మార్గం గుండా వెళ్లవచ్చు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List