పెద్దింట్లమ్మ ఆలయం, కొల్లేటికోట. ~ దైవదర్శనం

పెద్దింట్లమ్మ ఆలయం, కొల్లేటికోట.

కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. కొల్లేటికోట గ్రామం కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపంపై ఉన్నది.
చరిత్ర
స్థానిక కథనాల ప్రకారం కొల్లేటి కోట వద్ద గజపతుల కోట ఉండేది. కొల్లేటి కోటలోని ప్రాచీన దుర్గాన్ని సూర్యవంశం వడియ రాజు లాంగుల్య గజపతి రాజు(1237 - 1282) కట్టించాడని చెప్పబడుతున్నది. ప్రస్తుతం ఆ స్థానంలో ఒక మట్టి దిబ్బ తప్ప కోట అవశేషాలు ఏవీ లేవు. ఇక్కడి జలదుర్గాలయం పర్యాటక ప్రాముఖ్యత కలిగి ఉన్నది. కొల్లేటికోట గ్రామాన్ని, 15వ శతాబ్దపు చివరి భాగంలో ఒడిషాను పాలించిన అంబదేవరాయ (1462-82) జయించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దుర్గాన్ని జయించిన తర్వాత అంబదేవరాయ జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు కథనం. గజపతులపై దండెత్తి వచ్చిన శత్రువులు కొల్లేటి ఒడ్డున చిగురుకోట వద్ద డేరా వేసి గజపతుల సైన్యాన్ని చేరే మార్గం లేక ఉప్పుటేరు అనే కాలువ త్రవ్వి సరస్సు యొక్క జలాలను సముద్రంలోకి మళ్లించి, నీటి మట్టం తగ్గిపోగానే గజపతుల సైన్యంపై దాడిచేసి కొల్లేటికోటను వశం చేసుకున్నారని ప్రతీతి. ఆ దాడి సఫలం కావటానికి సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతుర్ను బలి ఇచ్చాడని. అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాళ్ళ కనమ అని పేరు నిలిచిపోయిందని కథనం. అలా గజపతి కాలంలో ఒడిషాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సూర్యవంశం వడియ రాజులు కొల్లేటి కోట పరిసర ప్రాంతాలలో స్థిరపడ్డారు.

కొల్లేటి కోట 11వ శతాబ్దం నాటి అమ్మవారి దేవాలయంలో జలదుర్గ అమ్మవారి విగ్రహం ఉంది. ఒడిషా పాలకుడు అంబదేవరాయ ఈ దుర్గాన్ని జయించి జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఇది 9 అడుగుల ఎత్తు కలిగి, విశాల నేత్రాలతో, వీరాసన భంగిమలో ఉంటుంది.కొల్లేర
ు లంక గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఇక్కడ నివాసం ఉంటున్న వడ్డెర కులస్తులు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మొదలుపెడతారు. ప్రతి యేడాది ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున అమ్మవారి జాతర (ఉత్సవాల)ను నెలరోజులపాటు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కొల్లేరులో పడవ ప్రయాణం, కర్రల వంతెన (పెద్దింట్లమ్మ వారధి) పై ప్రయాణం ఉంటుంది. 135 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల కొల్లేరు సరస్సులో 145 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 105 గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలోని 7 మండలాల్లో ఉండగా, మిగిలిన 40 గ్రామాలు కృష్ణాజిల్లాలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో ఉన్నాయి. అగస్త్యుడు సముద్రజలాన్ని ఇంకించినట్టు, కొల్లేరు నీరు ఇంకించి, తోడించి, వంతెన వేయించి, కొల్లేరు మధ్యలో దుర్గాన్ని నిర్మించాడట.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive