ఇంగ్లీష్ లో పుణ్యం అనే పదం లేదా.!! ~ దైవదర్శనం

ఇంగ్లీష్ లో పుణ్యం అనే పదం లేదా.!!

*పాపం పుణ్యం అనే పదాలు మన అందరికి తెలిసినవే..*

*మరి వాటిని ఇంగ్లీష్ లో ఏ మని అంటారు?? పాపాన్ని sin అని అంటాం!  మరి పుణ్యాన్ని??*

*ఇంగ్లీష్ లో పుణ్యం అనే పదం లేదు.. నిజం!!*

మీరు నమ్మరా?? పాపం ఉంది కదా! మరి దానికి వ్యతిరేక పదం పుణ్యం కూడా ఉండాలిగా??

*ఎందుకు ఇంగ్లీష్ లో పుణ్యం అనే పదం లేదు?*

పాపం, పుణ్యం అనే రెండు కూడా కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటాయి.

మిగతా మతాల్లో (క్రైస్తవం, ఇస్లాం)లో పుణ్యం అనే ప్రస్తావన లేదు..

*హిందూధర్మం ప్రకారం*

ఒక మనిషి చేసిన పని బట్టి (కర్మ) అతనికి ఫలితం వస్తుంది.. మంచి పని చేస్తే పుణ్యం, చెడ్డ పని చేస్తే పాపం. సింపుల్ గా, ఆ వచ్చిన పాప పుణ్య ఫలితాలను బట్టి అతనికి స్వర్గం, నరకం, మోక్షము, వేరే జన్మ ఎత్తి చేసిన పాపాలు, పుణ్యాలు అనుభవించడం జరుగుతుంది.. కాబట్టి మనిషి చేసిన మంచి పని ఫలితంగా పుణ్యాన్ని  అతని ఖాతాలో వేస్తారు.. దేవుణ్ణి నమ్మినా నమ్మక పోయినా పర్వాలేదు, నువ్వు చేసే పనులే నీకు స్వర్గ, నరక, మోక్షాన్ని ఇస్తాయి..

*మిగతా మతాలు (క్రైస్తవం, ఇస్లాం) ప్రకారం..*

వీళ్ళ గ్రంధాల్లో మనిషి చేసిన పాప పుణ్యాలను బట్టి స్వర్గం నరకం అనే ప్రస్తావన ఉండదు.. ఆ మతంలో ఆ దేవుడిని నమ్ముకుంటేనే స్వర్గం, లేదంటే నరకం. మళ్ళీ వేరే జన్మ అన్న ప్రస్తావన ఉండదు.. మనిషికి ఒకటే జన్మ, ఈ జన్మలో తప్పు చేస్తే శాశ్వత నరకంలో ఉండిపోవడమే!!

హిందూధర్మం ప్రకారం మనిషి చేసుకున్న మంచి పనులు అతనికి పుణ్యాన్ని ఇస్తాయి, మిగతా మతాల్లో మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకునే అవకాశం లేదు, చేసుకున్న పుణ్యంతో స్వర్గంకు వెళ్లే దారి కూడలేదు. దేవుణ్ణి నమ్మితేనే స్వర్గం అని చెప్తారు.. 

అందువల్ల అన్ని ప్రాంతీయ భారతీయ భాషలు (హిందూధర్మం నుండి అయినా సంస్కృతం నుండి వచ్చిన) పుణ్యం అనే పదాన్ని కలిగి ఉంటాయి..

తెలుగు : పుణ్యం
తమిళ్  : పుణ్యం
కన్నడ : పుణ్య
మలయాళం: పుణ్యం
హిందీ: పుణ్య్
ఒరియా: పుణ్య్

అలాగే విదేశీ భాషలు, విదేశీ మతాలు పుణ్యం అనే పదాన్ని కలిగి ఉండవు

*ఇంగ్లీష్ లో పుణ్యం గురించి వికీపీడియా:-*

https://en.m.wikipedia.org/wiki/Punya_(Hinduism)

Punya (Sanskrit: पुण्य) is a difficult word to translate; *there is no equivalent English word to convey its exact intended meaning.* It is generally taken to mean 'saintly', virtue, 'holy', 'sacred', 'pure', 'good', 'meritorious', 'virtuous', 'righteous', 'just', 'auspicious', 'lucky', 'favourable', 'agreeable', 'pleasing', 'lovely', 'beautiful', 'sweet', 'fragrant', 'solemn' or 'festive', according to the context it is used.

*పుణ్యం అంటే ఏంటో వాళ్లకి తెలీదు*

కాబట్టి పుణ్యం అనే తెలుగు పదానికి  ఇంగ్లీష్ లో అదే అర్ధం ఇచ్చే పదం వెతకటం అంటే ??

పెంట కుప్పల్లో వజ్రాల కోసం వెతకటం లాంటిది..
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...