కాశీ ఖండం –30 ~ దైవదర్శనం

కాశీ ఖండం –30

దండ పాణి ఆవిర్భావం..  పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు .పుణ్యాత్ముడు ,ధార్మికుడు .అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప గించి శాంభవ యోగం చేత మరణించాడు .కుమారుడు సర్వ భోగాలు అనుభ విస్తు పుత్రులు లేక పోవటం వల్ల కలత చెందాడు .భార్య తొ తాను ఉంటున్న ఈ ప్రాసాదాలు ఏమీ నచ్చటం లేదని మనస్శాంతి  లేకుండా పోయిందని ,పుత్రుని పొందితేనే జీవితం ధన్యమని చెప్పాడు .

             పూర్ణ భద్రుడు తన సంగీత విద్య చేత మహా శివుని మెప్పించాడు .శివానుగ్రహం వల్ల భార్య కనక కుండల గర్భం దాల్చింది .కుమారుడు జన్మించాడు .వాడికి హరి కేషుడు అని పేరు పెట్టారు .కొడుకు పుత్తి న సంతోషం తొ అనేక దాన ధర్మాలు చేశాడు ..ఎనిమి దో ఏటేహరి కేశునికి శివ భక్తీ అలవడింది .శివుడిని తప్ప వేరొకరి ధ్యాస లేదు .నాలుక మీద హర నామం మాత్రమె ఉండేది .దుమ్ముతో లింగాన్ని చేసి గరిక తొ పూజించే వాడు .తండ్రి పూర్ణ భద్రుడికి కొడుకు వింత ప్రకృతి అర్ధం కాలేదు .ఈ పూజలు ముసలి తనం లో చేసుకో వచ్చు ,ముందు వివాహం చేసుకొని సంతానాన్ని కని తమకు సంతోషం కలుగ జేయమని నచ్చే చెప్పే వాడు .ఒక్కోసారి తండ్రి గట్టిగా మందలించే వాడు .భయ పడి ఒక రోజున ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోయాడు .

                హరి కేషుడు అందరికి దారి చూపేది కాశీ నగరమే అని భావించి ఒక అరణ్యంలో  ప్రవేశించి .అక్కడ శివుడి కోసం ఉత్తమ తపస్సాచ రించాడు .శివుడు మెచ్చి పార్వతీ సమేతం గా ప్రత్యక్ష మై నాడు .అతని జుట్టు అంత జడలు కట్టింది .శరీరం అంతా పుట్టలు పట్టాయి .మాంసం లేని ఎముకల గూడు గా ఉన్నాడు .తెల్లని శరీరం తొ శంఖం లా మెరుస్తున్నాడు .మాంసాన్ని కీటకాలు పొడుచుకు తింటున్నాయి .అతని పింగళా దృష్టి దిగంతాల వరకు వ్యాపించి ,అతని తపోగ్ని అంతటా ప్రసరిస్తోంది .భక్తీ తప్ప ఇంకేమీ అతనికి తెలియదు సింహానికి భయ పడ్డ లేడి పిల్లలు అతన్ని రక్షిస్తున్నాయి .

            పరమేశ్వరుడు వృషభ వాహనం దిగి పుట్టలో  ఉన్న హరి కేషుని చేయి పట్టి బయటికి తెచ్చాడు .అతడు పరమేశ్వర సాక్షాత్కాసరం తొ పరవ షించి స్తుతించాడు .అప్పుడు శివుడు మెచ్చి ‘’నువ్వు దక్షిణ దిశలో నివ శిస్తు నా కను సన్న లలో మెలుగు తు ఉండు దుష్టులను దండిస్తు దండ పాణి అనే పేరప్రసిద్ధి చెండుతావు ‘’అని చెప్పి అదృశ్యమైనాడు .స్కందుడు అగస్త్య మహర్షితొ హరి కేషుడు అనే యక్షుడే కాశీ లో దండ నాయకుడనే పేరుతో ఉంటున్నాడు అని,దండ పాణి అనుగ్రహం లేనిదే కాశీ లో ఎవరు సుఖం అనుభ విన్చలేరని  చెప్పాడు .

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive