కాశీ ఖండం -23 ~ దైవదర్శనం

కాశీ ఖండం -23


విశ్వ కర్మ నిర్వాణ ప్రయాణం..   విష్ణు దూతలైన సుశీల ,బహు శీలలు శివ శర్మ తొ ‘’నువ్వు ఈ విష్ణు లోకం లో భోగాలను అనుభ వించు .నువ్వు పుణ్య తీర్ధ మైన హరిద్వారం లో మరణించటం వల్ల నంది వర్ధన నగరం లో మహా రాజు వై జన్మిస్తావు .నీ రాజ్యం లో విద్యా విహీనులు ఉండ రాదు .స్త్రీలు తమ ధర్మాలను నిర్వర్తించాలి .ఎవరికీ దుఖం ఉండ కూడదు .వేద అనేది రత్నాలకు మాత్రమె .శూలం దేవతా మూర్తుల చేతి లోనే .కంపం అనేది సాత్విక భావోద్వేగం లోనే ,జ్వరం భయం వల్లనే దరిద్రం వల్ల కాదు ,ప్రమత్తఅనేది ఏనుగు ల యందు మాత్రమె .కంటకత్వం చెట్ల లోనే ,విహారాలు జనం లోనే ,దండం సన్యాసం లోనే ,గుణ వంత మైన పాలన నీ రాజ్యం లో ఉంటుంది. రాజ్య ధర్మజ్నుడవు అని పేరు పొందుతావు . .శ్రీ హరి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకో .అజ్ఞానం లేని దివ్య జ్ఞానాన్ని కాశీ విశ్వేశ్వరుడు నీకు ప్రసాదిస్తాడు ‘’


           మోక్ష కారక మైన శివ లింగాన్నికాశీ లో  స్తాపించి దేవాలయం కట్టి నిత్య ము అభిషేక పూజాదులతో శివుడిని ప్రసన్నం చేసుకో .ఒక రోజు నీ దగ్గరకు వ్రతోప వాసాల తొ క్షీణించిన ఒక తపోధనుడు వస్తాడు .అతడు బాగా బక్క చిక్కి ఉంటాడు .నీ దగ్గర కూర్చుంది నీయోగా క్షేమాలను అడుగుతాడు .అతడు నిన్ను ‘’నువ్వెవరివి /ఎక్కడి నుండి వచ్చావు ?రెండవ ఆమె లాగా ఉన్న ఆమె ఎవరు ?ఈ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారు ?అదంతా నేకు తెలుసా /దాని వల్ల ఏ ప్రయోజనం నీకు కలుగు తుంది ?’’అని ప్రశ్నిస్తాడు .దానికి నువ్వు నేను చెప్పి నట్లు సమాధానాలు చెప్పు ‘’నేను వృద్ధ కాలుడను .అనే మహా రాజును .దక్షిణ దేశం వాడిని .నా భార్య తొ ఇక్కడికి వచ్చాను .ఈ లింగాన్ని ప్రార్ధించటం తప్ప నాకేం తెలీదు .శివుడే ఈ ఆలయాన్ని నిర్మించుకొన్నాడు .దీని పేరు ,దాని విశేషం నాకేమీ తెలీదు .’’అని చెప్పమని చెప్పాడు .

               అప్పుడు ఆ వృద్ధుడు నీతో ‘’ఈ లింగము పేరు నీకు తెలియదు .లింగం వంక తదేక దృష్టి తొ చూడు .ఈ గుడి ఎవరు కట్టిందీ విన బడుతుంది .అది విన్న తరువాత నాకు చెప్పు ‘’అన్నాడు అప్పుడు ‘’నీవు కర్తవు ,కారయితావు .సాక్షాత్తు స్వయం భువుడవు .నేను అబద్ధం ఎందుకు చెబుతాను ?’’అను. వృద్ధ తపస్వి ‘’నాకు దాహం గా ఉంది నీళ్ళు తీసుకొని రా’’అని చెప్తాడు ..అప్పుడు వెంటనే బావి నుండి నీరు తోడి అతనికివ్వు .అతడు త్రాగుతాడు .అప్పుడు వెంటనే అతడు దేవతా స్వరూపం పొందుతాడు .యవ్వన ,రూప వంతుడు అవుతాడు .కుబుసం విడిచిన త్రాచు పాములా మెరుస్తాడు .అప్పుడు నువ్వు ‘’స్వామీ !ఏ ప్రభావం వల్ల మీరు ఈ వృద్ధ రూపం పొందారు ?మళ్ళీ ఈసుందర రూపం ఎలా వచ్చింది ?అని అడుగు .అప్పుడా తాపసి ఇలా చెప్తాడు ‘’వృద్ధ కాల మహా రాజా !నువ్వు బుద్ధి మంతుడివి .నీ భార్య అనుకూల వతి .ఈమె తుర్వసుడు అనే బ్రాహ్మణుని కూతురు .తండ్రి ఈమె ను నైద్రుతుడు అనే మహాత్ముని కిచ్చి వివాహం చేశాడు .భర్త చని పోయాడు .ఆమె పుణ్య వ్రతాల వల్ల పాండ్య రాజు కుమార్తె గా జన్మించింది .నిన్ను వివాహం చేసుకొని సుఖాలను భావిస్తోంది .

               ‘’పూర్వ జన్మ లో నువ్వు శివ శర్మ వు .వైకుంఠాన్ని పొంది పుణ్య వశం చేత నంది వర్ధన పురం లో వృద్ధ కాలుడు అనే రాజుగా పుట్టావు .ఈ మోక్ష క్షేత్రం లో నీ వు శివ పూజా దురంధరుడివై మోక్షాన్ని పొందుతున్నావు .నువ్వు చెప్పిన కర్తా ,కారయితా శంభుడే వేరేవరుకాదు.ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించుకొన్నాడు .నీ పుణ్యాన్ని జాగ్రత్త గా కాపాడుకో .ఈ లింగం వృద్ధ కాల లింగం అని పిలువబడుతుంది .దీన్ని అర్చిస్తే కోరికలు తీరుతాయి ఈ వృద్ధ కాళేశ్వర లింగాన్ని పూజిస్తే సంవత్సరం లోపే సిద్ధి పొందుతారు .ఈ బావి నీరు త్రాగితే అంటువ్యాధులు రావు ..’’అని పలికి తన తొ ఉన్న అనంగ లేఖ చేయి పట్టుకొని వృద్ధ కాళేశ్వర లింగం లో అంతర్హితుడయాడు తాపసి .’’మహా కాలళా !మహా కాళా!  అని ఎవరు స్మరిస్తారో వారు విష్ణు దర్శనం పొంది మోక్షానికి పోతారు .

     ఈ విషయాలన్నీ భార్య లోపా ముద్రా దేవికి ముని అగస్త్యుడు వివరించాడు .శివ శర్మ వైకుంఠ వాసం చేసి తిరిగి భూమి పై నంది వర్ధన పట్టణం లో జన్మించి ఇహ లోక భోగాలు అనుభ వించాడు వారసులకు రాజ్యం అప్పగించి కాశీ చేరి విశ్వేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాడు .ఈ శివ శర్మ కధ విన్న వారికి ఉత్తమ జ్ఞానం కలుగు తుంది అని మహర్షి ఫల శ్రుతి చెప్పారు.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive