అనారోగ్యము - వైద్యము ~ దైవదర్శనం

అనారోగ్యము - వైద్యము

ఒకరోజు పరమాచార్య స్వామి వారి పాదాలు బాగా వాచిపోయాయి చూడానికి బోదకాలు వచ్చిందేమో అనేలాగున్నాయి. ఒక పెద్ద ముత్తైదువ స్వామి వారికి హారతి ఇచ్చింది. వారి పాదాలను చూసి చాలా ఖేదపడింది.

ఆవిడ అక్కడున్నవారితో “తన దగ్గరకు వచ్చిన భక్తుల బాగోగులు చూసే మహాస్వామి వారిని పట్టించుకునే వారే లేరా?” అని అడిగింది. చాలా బాధపడుతూ, కళ్ళనీళ్ళు కారుస్తూ పరమాచార్య స్వామి వారిని వేడుకుంది. “పెరియవ తమ ఆరోగ్యం గురించి కూడా కొంత పట్టించుకుంటే బావుంటుంది. ఎవరైనా మంచి వైద్యుణ్ణి సంప్రదించి మందులు వేసుకొనవలసింది” అని.

మహాస్వామి వారు నవ్వారు. ఆ పెద్దావిడ తమ పాదముల గురించే దిగులు పడుతోందని వారికి తెలుసు. “అరగంట తరువాత వచ్చి నా పాదములను చూడు” అని మహాస్వామి వారు ఆవిడతో అన్నారు. ఆ పెద్దావిడ వెళ్ళిపోయిన తరువాత మహాస్వామి వారు పదిహేను నిముషాలు పద్మాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళారు.

కొద్దిసేపటి తరువాత ఆ పెద్దావిడ మళ్ళా వచ్చింది. పరమాచార్య స్వామి వారి పాదాలు మామూలు స్థితికి వచ్చి వాపు తగ్గిపోయింది. ఏ వైద్యమూ లేక, ఏ మందులూ వాడక స్వామి వారి పదాలు ఎలా బాగయ్యాయో ఆవిడకు అర్థం కాలేదు.

వారి దేహానికి అనారోగ్యం తెచ్చుకుని వారే దాన్ని నయం చేసుకోవడం స్వామి వారికి ఒక లీల. భక్తుల బాధలను తాను భరించి శాస్త్ర బద్ధంగా వారి కర్మలను తుడిచివేయడమే వారి లీల. కాని పరమాచార్య స్వామి వారి విషయంలో ఏటువంటి తర్కానికి తావు లేదు. ఆయన ఆది వైద్యుడు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List