సాధన - దివ్యానుభూతులు ~ దైవదర్శనం

సాధన - దివ్యానుభూతులు


క్రియాయోగము:

దైనందిన కార్యక్రమములకు దాదాపు 40,000 ప్రోటీన్స్ అవసరము. ఈ ప్రోటీన్స్ ను వృద్ధిచేసికొని తద్వారా వ్యాధి, ముసలితనము త్వరగా దరి రానీయక కాపాడుతుంది క్రియాయోగము. జీవకణములకు, వాటి సంబంధిత కాలేయము, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండములలాంటి అవయవములకు సమన్వయత లోపించడమే రోగములకు కారణము. ఈ సమన్వయత కలగ జేయటము క్రియాయోగముద్వారా సుసాధ్యము.

హైడ్రోజన్బాంబ్ అనేది ఫ్యూజన్ అనే పద్ధతిమీద ఆధారపడి చేసినది. బాహ్యకుంభకము ఫ్యూజన్ లాంటిది.  రోగగ్రస్త జీవకణములను బాహ్యకుంభకముద్వారా ఆరోగ్యవంతము చేసికొనవచ్చు. ఫ్యూజన్ లో అనగా జీవకణములను బయటనేవదలి శక్తి పుట్టించబడుతుంది.   ఆటమ్బామ్బ్ అనేది ఫిజన్ అనే పద్ధతిమీద ఆధారపడి చేసినది. అంతఃకుంభకము ఫిజన్ లాంటిది. రోగగ్రస్త జీవకణములను అంతః కుంభకముద్వారా ఆరోగ్యవంతము చేసికొనవచ్చు. ఫిజన్ లో అనగా అంతఃకుంభకములో  జీవకణములను కూటస్థములోని  ఆజ్ఞాచక్ర ములో కుదించి   శక్తిపుట్టించబడుతుంది.

ఇడానాడి గంగ, పింగళనాడి యమున, సుషుమ్నానాడి సరస్వతి. ఈ మూడుసూక్ష్మనాడులు  కూటస్థములో కలవటమే త్రివేణీసంగమము. మూలాధారమునుండి కుండలినీశక్తి సుషుమ్నానాడి ద్వారా కూటస్థ ము వరకు అటుపిమ్మట సహస్రారము వరకు చేరుకోవటమే సమాధిస్థితి.

క్రియాయోగము ఒక భౌతిక మానసిక విధానము. ఈయోగములో సాధకుని శరీరములోని రక్తము కర్బనము కోల్పోయి ప్రాణవాయువు తో శక్తివంతమగును. బుర్రలోని జీవకణములు ధనధృవముగాను, మిగిలినశరీరమంతయు ఋణధృవముగాను అవుతుంది. సాధకుడు కూటస్థములోని ఆజ్ఞాచక్రమువరకు శ్వాసపూరకముచేసి, తిరిగి ఆ శ్వాసను మూలాధారముద్వారా పూర్తిగా రేచకముచేసి వదలి విద్యుదయస్కాంతశక్తి పుట్టిస్తాడు. జీవకణనాశనము తగ్గును. హృదయమున కు,  బుర్రలోని నరములకు విశ్రాంతి మరియు శక్తి చేకూరుతుంది.

మూలాధారమునుండి కూటస్థములోని ఆజ్ఞాచక్రమువరకు ఆరు చక్రములున్నవి. ఈ చక్రములలో ప్రతిచక్రమునకు రెండేసి రాశుల చొప్పున పన్నెండురాశులున్నవి.  క్రియాయోగి తనప్రాణశక్తిని మూలా ధారమునుండి కూటస్థములోని ఆజ్ఞాచక్రము వరకు, ఆజ్ఞాచక్రము నుండి మూలాధారమువరకు త్రిప్పుతూ ఒకక్రియచేస్తాడు. అట్లా క్రియాయోగి తనప్రాణశక్తినిత్రిప్పుతూ, ఆత్మసూర్యుని ఈఆరుచక్ర ములలోని పన్నెండురాశులలో దర్శిస్తూ, ప్రతిక్రియకూ ఒక సంవత్సరం చొప్పున తనకర్మనుదగ్ధముచేసికుంటాడు.

ఒక్కొక్కరాశికి ఒక్కొక్కమాసముచొప్పున సూర్యుడు పన్నెండురాశుల లో చుట్టిరావటమునకు, ఒక సంవత్సరముపట్టును. మనకు ఒక సంవత్సరముగడచినది అనగా ఒకసంవత్సరము ప్రారబ్ధకర్మము గడచినట్లులెక్క. మన సంచితకర్మము దగ్ధముచేసికొనుటకు పదిలక్షల సంవత్సరముల ఆరోగ్యకరమైన జీవితము అవసరము. పట్టుదల గల క్రియాయోగి రోజుకు 1000క్రియలచొప్పున మూడు సంవత్సరము లలో పదిలక్షలక్రియలుచేసి తన సంచితకర్మను దగ్ధము చేసికొని పదిలక్షల సంవత్సరముల ప్రగతి సాధించగలడు. సాధారణముగా, ఒక పధ్ధతి ప్రకారము ఈ క్రియలు చేస్తూఉంటే  6, 12, 18, 24, 30, 36, 42, 48 సంవత్సరములలోపదిలక్షల సంవత్సరముల ప్రగతి సాధించవచ్చు. ఒకవేళ సంపూర్ణమైనప్రగతి సాధించకుండా మరణిస్తే,   క్రియాయోగి తనతోపాటేక్రియాయోగసాధనా ఫలితాన్ని తీసికెల్తాడు.

క్రియాయోగిజీవతం అతని సంచితకర్మలతో ప్రభావితముకాదు. అది పూర్తిగా ఆత్మచూపే మార్గదర్శకత్వంలోనే కొనసాగుతుంది. క్రియాయోగము మితభోజనముతోను, పూర్తిగా ఏకాంతములోను చేయవలయును.

క్రియాయోగములో హఠయోగము(శక్తిపూరక అభ్యాసములు), లయయోగము( సోహం మరియు ఓం ప్రక్రియలు), కర్మయోగము (సేవ), మంత్రయోగము( చక్రములలో బీజాక్షరములధ్యానము), రాజయోగము( ప్రాణాయామ పద్ధతులు) ఉండును.

కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము ధనధృవము. మూలాధారచక్రము ఋణ ధృవము.  ఈ ఋణధృవము నుండి ధనధృవము వరకు తిరిగి ధనధృవము నుండి ఋణధృవము వరకు ప్రాణశక్తిని త్రిప్పుటవలన మేరుదండము శక్తివంతమైన ఐస్కాంతమగును.  తద్వారా గుదము వద్దయున్న మూలాధారమునుండి కంఠములోని విశుద్ధచక్ర ము వరకు ఉన్న విద్యుత్తులన్నీకూడా మేరుదండముద్వారా తలలోని బ్రహ్మరంధ్రమును ఆనుకొనియున్న సహస్రారచక్రములోనికి చేర్చ బడి సాధకుడు అనంతమైన ఆనందాన్నిపొందుతాడు. దీనికితోడు న్నిముద్రలతోబాటుగా క్రియాయోగముచేయుట వలన మేరుదండ ము మరింతశక్తివంతమగును.

శక్తి మరియు జాగృతి రెండూఉన్నది ప్రాణశక్తి. ప్రాణవాయువులో ఒక్క శక్తిమాత్రమే ఉన్నది. శుష్కంచిపోయేదిశరీరము. దహించిపోయే ది దేహము. కుళ్ళిపోయేది కళేబరము. క్రియాయోగమువలన శరీరము శుష్కంచదు, దేహము దహించిపోదు, కళేబరము కుళ్ళిపోదు. శరీరము ఆరోగ్యముగా ఉండును.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List