దుర్గతి నాశిని శ్రీ దుర్గా స్తోత్రం. ~ దైవదర్శనం

దుర్గతి నాశిని శ్రీ దుర్గా స్తోత్రం.

దుర్గా దుర్గతి నాశిని అని అమ్మను స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం . దుర్గం అంటే శరీరం . ఈశరీరంలో ఉండే శక్తే దుర్గ . అదే ప్రాణశక్తి . ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం వలన మాత్రమే విశ్వమంతా నిలచి ఉంది.

దుర్గాదేవి దశభుజాలు ,పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం .దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది ..అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక .క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం .ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకు చేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే . మనలో అట్టి దుర్గాతత్వాన్ని పెంపొందించుకోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.

ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆశక్తిఉండాలి కానీ దివాంధం గుడ్లగూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు .దాని సూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరో పక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక .అది అత్యవసరం .అసత్ జ్ఞానం వీడి సత్ జ్ఞానంతో ఉండాలనే దానికి సంకేతం ఆవిడ వాహనం హంస. అది నీటిని వీడి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది . ఇంకో పక్కనుండే కుమారస్వామి దేవసేనాని ,ఆయనవీరత్వానికి ప్రతీక. అట్టివీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి . నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు .అట్టి బ్రహ్మచర్యమందుండుటచే నెమలికన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ది గణపతి స్థానం.

అకారణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది . సిధ్ధికి భంగం కలుగకుండా ఉండాలంటే  ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి . ఆన్నింటికీ అధిష్టాతగా ఉన్న శివుడు త్యాగమునకు,అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిసూలం సత్వరజస్తమోగుణాలకు గుర్తు, వృషభము అంటే ధర్మం .అదే ఆయన వాహనమైన నంది. అది నాలుగు కాళ్లపై ఉంటుంది .ఇలా పరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని సూచిస్తుంది. అది విని శ్రీ రామకృష్ణుడుబాధ పడి కాళీ మాతనే అడుగుతాడు. అప్పుడుమాత ఆయనతో "వాడి మాటలు పట్టించుకోకునాయనా. వాడొక మూర్ఖుడు. వాడికేమి తెలుసు? అని ఓదారుస్తూ తామసిక, రాజసిక, సాత్వికగుణములూ తానేనని, అలాగే గుణాతీత నిరాకారనిశ్చల పరబ్రహ్మమూ తానె అన్న అనుభవాన్నిదర్శనాన్ని ఆయనకు కలిగిస్తుంది.

శ్రీ రామకృష్ణ పరమహంస కాళీ మాతగురించిఇలా చెప్పారు.

బ్రహ్మము నిశ్చలము. త్రిగుణాతీతము. శక్తి చలనశీలము మరియు త్రిగుణాత్మిక. బ్రహ్మము శక్తీఒకటే. ఒక కోణమున అదే బ్రహ్మము. ఇంకొకదృష్టిలో అదే శక్తి.

దీనికి ఆయన మూడు ఉదాహరణలు ఇచ్చారు.
మొదటి ఉదాహరణ: నిశ్చల సముద్రము. కల్లోలమైన అలలతో ఘోషిస్తున్న సముద్రము. మొదటిది బ్రహ్మము. రెండవది శక్తి.
రెండవ ఉదాహరణ: అగ్ని మరియు దాని కాల్చేశక్తి. అగ్ని బ్రహ్మము. దాని కాల్చే స్వభావముశక్తి.
మూడవ ఉదాహరణ: చుట్టగా చుట్టుకొని పడుకొనిఉన్న సర్పము. మరియు చర చరాకదులుతున్న సర్పము. మొదటిది బ్రహ్మము. రెండవది శక్తి.

వేదములు దేనిని బ్రహ్మము అంటున్నవో, తంత్రము దేనిని పరమశివుడు అంటున్నదో, పురాణము దేనిని భగవంతుడు అంటున్నదోదానినే ఆయన కాళి అని పిలిచారు. త్రిగుణములను ఆధారముగా చేసుకొనిలోకములను సృష్టి స్థితి లయములు చేస్తున్నదికనుక శక్తి అని పిలువబడుతున్నది. అదే శక్తి ఈపనులు చేయకుండా గుణములకు అతీత స్థితిలోనిశ్చల స్థితిలో ఉన్నపుడు పరబ్రహ్మము అనిఅంటున్నాము.

ఇంకొక విధముగా శక్తి మరియు శివుడు అనితంత్రము వీనినే పిలిచింది. అందుకనే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని స్తుతించటంజరిగింది. పార్వతీ పరమేశ్వరులు జగత్తుకు తల్లితండ్రులు అన్న అద్భుత భావనకు ఇది వివరణ. నిజమునకు కాళి, శివుని కంటే వేరు కాదు. స్థితిలోనే భేదము. తత్వ భేదము లేదు. (సశేషం)
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List