మంత్రశక్తి ప్రవాహం - వైజ్ఞానిక రహస్యం. ~ దైవదర్శనం

మంత్రశక్తి ప్రవాహం - వైజ్ఞానిక రహస్యం.

ప్రతి అక్షరం బీజాక్షరం, ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా ఆలోక్యమయ్యే అతీంద్రియ శక్తి మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా.ఉదాహరణకి ఈ "లక్ష్మి" మంత్రాన్ని చూడండి. ఎంతో అపురూపమైన ఈ మంత్రాన్ని ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు సిద్ధిని, లబ్దిని, దివ్యానుభూతిని పొందవచ్చు.

(లక్ష్మీ మంత్రము)

ఈ మంత్ర స్వరూపాన్ని కొంచెం వివరంగా అర్ధం చేసుకుందాం.మంత్రాలలో సర్వ సాధారణంగా వుండేది 'ఓం'. ఓంకారానికి అనేక అర్ధాలున్నాయి. అందులో ఒకటి, ఆధునిక పరిభాషలో చెప్పాలంటే Hello to Divine Plane. ఎప్పుడు కొత్త Software నేర్పినా మొదట "Hello World!" అనే programme తో మొదలవుతుంది. అలాగే మంత్రం కూడా ఓంకారంతో మొదలవుతుంది. "ఓం" అనగానే దేవతామండలానికి సంకేతం వెడుతుంది. "ఒక బీజాక్షరం" అనగానే అది లక్ష్మికి సంబంధించిన తలానికి చేరుతుంది. "మరో బీజాక్షరం" అనగానే జగత్తంతా సర్వవ్యాపకంగా వున్న ఆ పరాశక్తి, "భువనేశ్వరి" శక్తిని మన మంత్రం ప్రచోదనం చేస్తుంది. ఆ విధంగా మంత్రంలో వున్న అక్షరాలు ఒక IP Address లా, ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఫోన్ నంబర్ లా ఆయా తలాలలోకి ప్రయాణిస్తాయి. బీజాక్షర ప్రభావం మహాశక్తిని అనంత సృష్టిలోనూ, మనో శక్తిని అంతర్లీనంగా సాధకునిలోనూ ప్రేరేపించి మనిషిని , మనీషిగా తీర్చి దిద్దుతుంది.మంత్ర ఉపాసకుడైన వ్యక్తి ఆవిధంగా Internet తో connect అయిన computer లా విశ్వంతో అనుసంధానం కాగలడు. ఉపాసన సిద్ధించినపుడు దార్శనీకుడై, "నేను" అనే తన చిన్న పరిధిని దాటి మహావిశ్వరహస్యాలను, అర్ధం చేసుకోగలడు... ఏ క్రొత్త విషయాన్నైన వెంటనే గ్రహించగలడు. అట్టి యోగి అనంతప్రకృతి ప్రణాళికలో భాగం కనుక Google లో వెతికి కనుక్కున్నట్టు విశ్వ జ్ఞాన భాండారంలోంచి విషయాలని తెలుసుకోగలడు. ఒకటి Internet ఇంకోటి Innernet. లలితా సహస్రనామంలో అందుకే ఈ రహస్యాన్ని చెపుతారు - 'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా ' అని. మనిషిలో అంతర్లీనంగా వున్న ఆ అమ్మని గుర్తించి ఆరాధిస్తేనే ఆమె దొరుకుతుంది, మరే బాహ్య అట్టహాసాలకి ఆ జగజ్జనని పట్టుబడదు అని అర్ధం. ఇక్కడ ఒక్కసారి తిలక్ మాటలు గుర్తుకొస్తాయి 'కిటికీ కవితలోంచి, 'గదికి మది కూడా గవాక్షాలుంటాయి.....తెరచే కిటికినిబట్టి పరతెంచే పుష్పపరాగం వుంటుంది...' అని.

మంత్ర నిర్మాణంలో బీజాక్షరాల ఎంపిక,కలయిక, వరుస కూడా ప్రధానమైన విషయాలే. రైలు ముందు ఇంజనులా ఏ తత్వాన్ని మనం పిలుద్దామనుకున్నామో ఆ తత్వ బీజాక్షరం ముందు ప్రాముఖ్యతని పొందుతుంది. మన మామూలు ఆలోచన ప్రకారంగా చూస్తే లక్ష్మిని ధనంకోసం, సరస్వతిని చదువుకోసం, కాళిని నిశ్చయ సకల్పంకోసం, కార్తవీర్యార్జునిడిని పోయిన వస్తువులు దొరకడంకోసం అలా departments గా ఉపాసిస్తున్నా, మంత్రశాస్త్ర గ్రంధాలు బీజాక్షరాల ఎంపికతో ఒకే దేవతని ఏ సంకల్పంకోసమైనా ప్రార్ధించవచ్చు అని చెపుతున్నాయి.

ఉదాహరణకి ' మరో బీజాక్షరం' అన్న మంత్రం విద్యని, 'బీజాక్షరం ' అన్న మంత్రం లక్ష్మిని ఇస్తుంది(గత సంచికలలో లక్ష్మి అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదన్న విషయాన్ని పరిశీలించాం). ' బీజాక్షరం' ఏ సంకల్పాన్నైనా సిద్ధింపచేస్తుంది, ఉదాహరణకి సంతాన ప్రాప్తికి అది మంచి మంత్రం. 'బీజాక్షరం ' అనే దుర్గా మంత్రం దుర్గాదేవి మూలమంత్రంగా సిద్ధము, ప్రసిద్ధము కనుక ఆ మంత్రాన్ని దుర్గానుగ్రహాన్ని పొందడానికి తద్వారా పురుషార్ధాలని (పురుష=పురు+ష=dweller of hearts=omnipresent vital force that pervades life force ~ పరబ్రహ్మ, పరమేశ్వర, నారాయణ తత్వం), కామ్యాతీతమైన పరమార్ధాలని సాధించ వచ్చు. ఆవిధంగా నిరాకారనిత్య చైతన్యాన్ని ఒక ఆకృతిలోనో, ఒక్కో ఆకృతిలోనూ కూడా దర్శించవచ్చును. దేవతలకి వాళ్ళవాళ్ళ రూపాలున్నప్పటికి వాళ్ళుకూడా ఒక మూలతత్వ ప్రతిరూపాలే. పదార్ధం (Matter) అణువుల సముదాయం ఎలాగో, అణువులు పరమాణు నిర్మితం ఎలాగో అలాగే దేవతలు కూడా పరబ్రహ్మత్వంతో నిర్మితమై, నిర్దేశితమై ఉంటారు. అందుకే మన పెద్దవాళ్ళు ఏదైనా కష్టమైన పనిని "ఇదేమైనా బ్రహ్మ విద్యా?" అనడం పరిపాటి అయింది. ఆ బ్రహ్మవిద్య పట్టుబడితే అన్నిటిలో నారాయణున్ని, నారాయణునిలో అన్నిటిని దర్శించవచ్చు.

మళ్ళీ వొక్కసారి మనం పైన అనుకున్న లక్ష్మి మంత్రాన్ని చూస్తే,

"బీజ మంత్రం"

దీన్ని రెండుభాగాలుగా విభజిద్దాం. ముందు

"ఈ బీజ మంత్రాన్ని" చూస్తే అందులో స్పష్టంగా ఒక ఆకృతి,Symmetry కనిపిస్తాయి ఈ విధంగా:



"బీజ మంత్రం"



పైన చూపినట్లు "ఒక బీజం...మరో బీజం...."తో wrap చేయబడి వుంది.ఆ విధంగా చేయటంవల్ల మంత్రాక్షరాలు శక్తివంతంగా వివిధ శక్తుల మేళవంగా అవుతాయి. దీన్ని మంత్ర సంపుటీకరణ అనికూడా అంటారు. మొత్తం మంత్రభాగం 'ఓం' తో సంపుటీకరించబడివుంది.

ఈ మంత్ర నిర్మాణంలో ఇంకో ప్రత్యేకత వుంది.

బీజ మంత్రం --> 1st Part

బీజ మంత్రం --> 2nd Part

బీజాక్షరాలు Symmetrical గా కమలం (Lotus)లో రేకుల్లా (Petals) వున్నట్లు గమనించ వచ్చు - మొదటి భాగంలో. ఇక రెండోభాగం పద్మానికి కాడగా వుంటుంది. అయితే ఈ మంత్రం కమలంగా ఎందుకు వున్నట్లు? ఎందుకంటే ఇది లక్ష్మి మంత్రం కనుక, లక్ష్మీ దేవి 'కమలాసన ', 'పద్మప్రియ ' కనుక.

ప్రతి దేవతకి వారి వారి మూల బీజాక్షరాలని వాడడం ద్వారా మంత్రాన్ని మరింత శక్తివంతంగా చేయవచ్చు అని పైన చెప్పుకున్నాం. 'బీజం' దుర్గకు ప్రీతికరమని అనుకున్నాం. 'బీజం ' సూర్యబీజాక్షరం, 'బీజం' గణపతి బీజాక్షరం, 'బీజం' సరస్వతి బీజాక్షరం, అలా ఆయా దేవతల మంత్రాలలో బీజాక్షరాలు కనిపిస్తుంటాయి, సాధకులను అనుగ్రహిస్తుంటాయి.
మంత్రాణి పల్లవోపేతం బీజశక్తి సమన్వితం |

యధా తంత్రకృతం జప్త్యా సద్యస్సిద్ధి ప్రదంస్మృతం ||
 మంత్రములన్నీ ఆయాపనులకు సంబంధించిన పల్లవములతో కూడి బీజశక్తి సమన్వితములై సరియగు విధానముతో జపము చేయుట వలన వెనువెంటనే సిద్ధించగలవు అని అర్ధం. మంత్రములు ఫలించునపుడు స్వప్నములుగా దేవతలు సంకేతములు ఇవ్వడం జరుగుతుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List