మంత్రపుష్పం ఎందుకు చదువుతారంటే..!! ~ దైవదర్శనం

మంత్రపుష్పం ఎందుకు చదువుతారంటే..!!

దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు కదా..
ఆ పరమాత్మ సర్వత్రా వున్నాడని చెప్పటమే
ఆ మంత్రపుష్పం ఉద్దేశ్యం.
మన లోపల, బయట కూడా వ్యాపించి వున్న
ఆ దేవదేవుడు మన శరీరంలో ఏ రూపంలో వున్నాడో చెబుతుంది మంత్రపుష్పం.

‘మన శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో
నాభి పైభాగంలో హృదయ కమలం వుంది.
దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడని వర్ణించబడింది’

చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత, ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందిట.

మనలోనే వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి
నేను..పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని ఈసారి విన్నప్పుడు కళ్ళు మూసుకుని మీలోని ఆ పరమాత్మని దర్శనం చేసుకోండి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List