కాశీ ఖండం -39 ~ దైవదర్శనం

కాశీ ఖండం -39

పంచ క్రోశ యాత్ర..  శాస్త్ర విధానం లో కాశీ యాత్ర చేసిన వారు ఇప్పటికి ముగ్గురు మాత్రమె ఉన్నారు వారు గణేశుడు ,భైరవుడు ,నందీశ్వరుడు ..ఈ ముగ్గురి తో కలిసి బ్రహ్మా విష్ణు మొదలైన దేవ గణమంతా కలిసి యాత్ర ప్రారంభించి ఇరవై ఏళ్ళు ప్రయాణం చేసి భీమ చండి కి చేరుకొన్నారు ..తమ విధులను వదిలి ఇంతకాలం బయట ఉన్నందుకు ఇబ్బంది పడ్డారు ..తిరిగి వారి లోకాలకు వెళ్లి పోయారు .దేవతలకే అసాధ్యమైతే సామాన్య మానవులమానవుల సంగతేమిటి ?

‘’కాశీ ప్రదక్షిణా యేన కృతా కృతా త్రైలోక్య పావనీ –సప్త ద్వీపా శాబ్ది శిలా క్రుతాతేన ప్రదక్షిణా ‘’అని నారదీయ సూక్తం లో ఉంది .కాశీ ప్రదక్షిణం చేస్తే సముద్రాలు ,పర్వతాలు కలిగిన ఏడు ద్వీపాల భూమండలాన్ని చుట్టి వచ్చిన ఫలితం కల్గుతుంది .

‘’యదా కధంచ్చిద్దేవేశి –పంచ క్రోశ ప్రదక్షిణం –కుర్యా దేవన మాసాది –చింత ఎద్ధర్మ కోవిదః

  స ఎవ శుభదః కాలో –యస్మిన్ శ్రద్ధో దయోభావేత్ ‘’అన్న దాని బట్టి ఒక రోజు నుండి అయిదు రోజులు లేక ఏడు రోజులు వరకు ఎవరి శక్తిని బట్టి కాశీ యాత్ర చేయ వచ్చును .

‘’దక్షిణే చోత్తరే చైవ హ్యయనే సర్వ దామయా –క్రియతే క్షేత్ర దాక్షిణ్యం –భైర వస్య భయాదపి ‘’అని పార్వతీ దేవితో పరమ శివుడన్నాడు .జనం భైరవుడికి భయ పడి కాశీ యాత్ర చేస్తున్నారు .మకర సంక్రాంతి నుండి ఆరు నెలలు ఉత్తరాయణం ,తర్వాతా ఆశాఢ మాస తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం తో కూడిన సంవత్సరం లో ఎప్పుడైనా పంచ క్రోశ యాత్ర చేయ.వచ్చు.కాని చాలా మంది మార్గశిర ,ఫాల్గుణ ,అధిక మాసాలలో చేస్తారు .శివుని మాట ప్రకారం ఎప్పుడైనా చేయ వచ్చు .

          బ్రహ్మ చర్యం,సత్య వాక్కు ,క్రోధ రాహిత్యం ,ఏక భుక్తం ,ప్రేమ భావం ,పరోపకారం అనే ఆరింటిని పాటిస్తూ చేసే పంచాక్రోశయాత్ర మాత్రమె సత్ఫలితాలనిస్తుంది .యాత్ర కు ముందు రోజున గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసి హవిష్యాన్న భోజనం చేయాలి .అన్నం చప్పటి పప్పు ,ఆవు నెయ్యి ,పెరుగు మాత్రమె తీసుకోవాలి .పచ్చి కొబ్బరి తిన వచ్చు .

            పంచాక్రోశయాత్ర లో మొదటి రోజు న స్నాన ,సంధ్యా చేసి జ్ఞాన వాపి దగ్గరకు వెళ్లి సంకల్పం చెప్పుకొని‘’విశ్వనాధ అన్నపూర్ణ విశాలాక్షీ డుంఢి   రాజ ,లక్ష్మీ నారాయణ యాభై ఆరు వినాయకులు ,ద్వాదశాదిత్యులు ,నృశింహ ,కేశవత్రయ ,రామ కృష్ణ ,కూర్మ మత్స్య మొదలైన పంచ క్రోశాత్మక పరి పూర్ణ కాశీ యాతరం కరిష్యే ‘’అని అక్షతలు ,నీరు వదిలి పెట్టాలి .తర్వాతా ‘’పంచ క్రోశాస్య యాత్రం వై –కరిష్యే విధి పూర్వకం –ప్రీత్యర్ధం తవ దేవేశ –సర్వా ఘౌఘ ప్రశాన్తాయే ‘’అని ప్రార్ధన చేయాలి తర్వాతా విశ్వేశ దర్శనం మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి సాష్టాంగ వందనం చేయాలి .మోదుడు మొదలైన పంచ వినాయకులను ,దండ పాణిని ,కాల భైత్రవుని యదా శక్తి గ పూజించాలి .ఇంత వరకు మౌనాన్ని పాటించాలి .స్నానం తర్వాతా మౌనం వదిలి పంచాక్రోశ యాత్ర ప్రారంభించాలి .మార్గ మధ్యమం లో వచ్చిన దేవతలన్దర్నీ పూజించాలి .దారిలో వచ్చే దేవతలు ,ఎక్కడ దర్శనమిస్తారో చూద్దాం

మణికర్ణికా ఘాట్ లో –మణి కర్నేశ్వరుడు ,సిద్ధి వినాయకుడు –లలితాఘాట్ లో గంగా కేశవుడు ,లలితా దేవి –మీర్ఘాట్ లో జరాసందేశ్వరుడు –మాన్ మందిర్ ఘాట్ లో –సోమనాధుడు దాలభ్య్ శ్వరుడు –దశాశ్వమేధ ఘాట్ లో శూల కం ఠేశ్వరుడు ,ఆది వరాహరేశ్వరుడు దశాశ్వ మేదేశ్వరుడు ( శీతలా దేవి మందిరం లో )-ప్రయాగేశ్వర మందిరం లో బందీ దేవి –పాండే ఘాట్ లో సర్వేశ్వరుడు –కేదార్ ఘాట్ లో కేదారేశ్వరుడు –హనుమాన్ ఘాట్ లో హనుమదీశ్వరుడు–అస్సీ సంగమం లో సంగమేశ్వరుడు –లోలార్కుడి వద్ద ఉన్న అర్క వినాయకుడు –బదినీ లో లోలార్కుడు –ప్రసిద్ధి లో దుర్గా కుండం –దుర్గా కుండం సమీపం లో దుర్గా వినాయకుడు –ప్రసిద్ధం లో ఉన్న దుర్గా దేవి

       పాయసం ,లడ్డు లను బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి నమస్కరించి –‘’జయ దుర్గే మహాదేవి –జయ కాశి నివాశిని–క్షేత్ర విఘ్న హరే దేవి పునర్దర్శన మస్తుతే ‘’అని ప్రార్ధించి నమస్కరించాలి .

కరమై తాపుర గ్రామం లో విష్వక్సేనుడు ,కందవా గ్రామం లో కర్నమేశ్వరుడు –లకు పండ్లు ,నువ్వులు సమర్పించాలి .కారడం తీర్ధం లో స్నానం చేయాలి కర్దమ కూపం నీటిలో ముఖం చూసుకోవాలి .కర్ణ మేశ్వర ప్రార్ధన చేయాలి కర్డ మేశమహాదేవ ,కాశీ వాస జనప్రియ త్వత్పూజనాత్ మహాదేవ పునర్దర్శన మస్తుతే ‘’అని ప్రార్ధించాలి

       కందవా గ్రామం లో సోమనాధుడు –కందవా లోనే ఉన్న విరూపాక్షుడు ,నీల కంఠేశ్వరుడు లను మొదటి రోజున దర్శించి మొదటి రోజు పంచాక్క్రోశ యాత్రను పూర్తీ చేయాలి కందవా గ్రామం లో రాత్రి నివాసం చేయాలి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List