అడవి జంతువుల అరుపులు, పచ్చని ప్రకృతి సోయగం, అబ్బురపరిచే జలపాతాలు. తప్పక చూడవలసిన ప్రదేశం. పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి రమణీయకతతో కనిపించే గరుడాద్రి క్షేత్రం ప్రకృతి అందాలతో కళకళలాడుతుంటుంది.
.
కడప జిల్లా, కాశిరెడ్డినాయన మండలంలోని నల్లమల అభయారణ్యంలో శ్రీ కాశీరెడ్డి నాయన ఆలయం కలదు. ఇక్కడ నుండి నల్లమల అభయారణ్య ప్రాంతంలో వేలసిన గరుడాద్రికి కాలి నడకన సుమారు 6 కిలోమీటర్ల వెళ్ళవలసివుంటుంది. ఇక్కడ పురాతమైన గరుడాద్రి క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయాన్ని జనమేజయుడు ప్రతిష్ఠించినట్లు శాసనాలు కలవు. అంతేకాకుండా జ్యోతిలోని నరసింహస్వామిదేవాలయాన్ని కూడా జనమేజయుడు ప్రతిష్ఠించినాడు. శిధిలావస్థలో ఉన్న గరుడాద్రి క్షేత్రాన్ని అవధూత శ్రీ కాశి నాయన పునరుద్ధరించినారు.
.
గరుడాద్రి పర్వతం నండి పావన నరసింహ ఆలయం దర్శించుకొని అడవి గుండా ఎగువ అహోబిలం చేరుకోవడం ఒక గొప్ప అనుభూతిగా , ఒక జీవితకాల అనుభూతి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
.
ఆంధ్రరాష్ట్రంలోని గరుడాద్రి పర్వత ప్రాంతంలోని దట్టమైన అరణ్యప్రదేశం వేలసిన గరుడాద్రి క్షేత్రాన్ని విక్రమాదిత్య మహరాజు, పశ్చిమ తీరపు రాజులు, చాళక్యులు, కాకతీయులు, విజయనగరాదీసులు, రెడ్డిరాజులు ఈ మూల విగ్రహం ను దర్శించినట్లు ఆధారాలు కలవు. కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాప రుద్రుడు, ఈ క్షేత్రానికి వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లు శాసనాలు కలవు.
.
ఇక్కడే ఉచితన్నదాన కార్యక్రమ ప్రారంభ స్ఫూర్తి ప్రదాత అవధూత శ్రీ కాశి నాయన సమాధి చెందారు. కామధేను గోవు సమాధి, శివ, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఇతర ఆలయాలు ఇక్కడ నిర్మించారు. ప్రస్తుతం కాశి నాయన సమాధి మీద ఎందరో అవధుతలు, మహా పురుషుల, యోగుల, మహారుషుల ,దేవతల శిల్పాల తో కూడిన ఒక మహా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చుట్టూ కొండలు, నల్లమల అడవులతో నిండిన చక్కని ప్రకృతి లో మసుకు ప్రశాంతి ని ప్రసాదించే పరిసరాల తో ఆహ్లాదకరంగా ఉండే జ్యోతి లో ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది.
....
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి.










No comments:
Post a Comment