ప్రమిదదీపమునకు నవగ్రహాలకు వున్న సంబంధం. ~ దైవదర్శనం

ప్రమిదదీపమునకు నవగ్రహాలకు వున్న సంబంధం.


ప్రమిదలో  దీపం వెలిగించడంలో వున్న నిగూఢ అర్థము.
ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచి ఆయా గ్రహప్రభావ దోషాలను తొలగిస్తుంద.

ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు!
ప్రమిద, అందులోని నూనె, వత్తులు, కాంతికి, నవగ్రహాలకు సంబంధం వుంది.

ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని
శాస్త్ర వచనం.

*1. ప్రమిద దీపం ...సూర్యుడు*

*2. నెయ్యి , నూనె- ద్రవపదార్థం.. చంద్రుడు.*

*3. వత్తులు.. బుధుడు..*

*4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల..  అంగారకుడు.*

*5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన  రాహువును సూచిస్తుంది.*

*6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు.*

*7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం*

*8. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం.. కేతువుకు సంకేతం*

*9.ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి  శుక్రుడు సంకేతం.*

శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

*తమసోమా జ్యోతిర్గమయా!*

ఆశలతో మానవజన్మ సార్థకం కాదని, తద్వారా మోక్షం లభించడం కష్టమని, తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతూ, విషయవాసనల చక్రంలో బందీ అవుతాడు.

*కనుక కర్మలన్నియు భగవదర్పిదంగా చేయవలెనని "గీత"  బోధిస్తుంది*

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List