గోమాత ఉపయోగాలు - 3 ~ దైవదర్శనం

గోమాత ఉపయోగాలు - 3

 ఆవు వెన్న ఉపయోగాలు  -

 * ఆవు వెన్న తెల్లగా కొద్ది పసుపు రంగుగా ఉండును. ఆయువు వృద్ది చేయును .

 * వీర్యవృద్ధిని చేయును . ధాతుపుష్టిని ఇచ్చును.

 * శరీరానికి చలవ చేయును .

 * శరీరంలోని త్రిదోషములను పోగొట్టును .

 * నేత్రరోగములు కలవారికి చాలా అద్భుతంగా పనిచేయును .

 * బాలురకు , వృద్దులకు అనుకూలంగా ఉండును.

 * క్షయ రోగులకు, గ్రహణి రోగులకు , వేడి వలన కలుగు దగ్గు ని పోగొట్టును .

 * జఠరశక్తిని పెంచును.

 * శరీరానికి కాంతిని ఇచ్చును.

 * పెద్ద నిమ్మకాయ అంత ఆవు వెన్నని ఒక లీటరున్నర మరిగే నీటిలో వేసి తాగించిన మాత్రబద్ధం మానును .

 * శరీరంలోని వాతపైత్యములను పోగొట్టును . కొంచం శ్లేష్మమును కలిగించును.

 * మూలశంఖ వ్యాధిని తగ్గించుటలో సహాయకారిగా ఉండును.

 * జిగటవిరేచనాలు తగ్గించును .

 * నోటివెంట పడు రక్తంని కట్టును.

  ఆవు మజ్జిగ ఉపయోగాలు  -

 * ఆవుమజ్జిగ త్రిదోషములను పోగొట్టును .

 * వగరు, పులుపు రుచులు కలిగి ఉండును.

 * శరీరంలోని ధాతువులకు చాలా మంచి చేయును .

 * శరీరంలో జఠరశక్తిని అమితంగా పెంచును.

 * కఫవాతాన్ని పోగొట్టును .

 * శరీరం ఉబ్బురోగం , ఉదరవ్యాధులు , మూలశంక , జిగటవిరేచనాలు , మూత్రబద్ధం , నోటికి రుచి లేకుండా ఉండటం వంటి సమస్యలకు మజ్జిగ పరమ ఔషధం .

 * ప్లీహ,గుల్మ వ్యాధులను తగ్గించును .

 * నెయ్యి ఎక్కువ తాగుట వలన కలుగు సమస్యలను ఆవుమజ్జిగ తాగుట వలన తగ్గును.

 * శరీరంలోకి వెళ్లిన కృత్రిమ విషముల నుంచి శరీరాన్ని కాపాడును.

 * పాండురోగం కలవారికి ఆవుమజ్జిగ అత్యంతశ్రేష్ఠమైనది.

 * రెండునెలల పాటు వదలకుండా మజ్జిగని వదలకుండా సేవించిన మూలవ్యాధులు హరించును .

 * కామెర్ల సమస్య ఉన్నవారు , ఎప్పటి నుంచో జ్వరంతో ఇబ్బంది పడుతున్నవారు ఆవు మజ్జిగ వాడుచున్న మంచి ఫలితాల పొందగలరు.

  ఆవునెయ్యి ఉపయోగాలు -

 * త్రిదోషాలను హరించును .

 * రక్తపుష్టి , ధాతుపుష్టి , వీర్యవృద్ధి కలిగించును.

 * శరీరంలోని వాతపైత్యాన్ని హరించును .

 * శరీరంలోని పైత్యాన్ని హరించుటకు మంచి ఔషధంగా పనిచేయును .

 * విరేచనం చేయును .

 * ఉన్మాదం,పాండు రోగం , విషము , నొప్పి, సర్పి , చిత్త భ్రమ వంటి సమస్యలకు ఆవునెయ్యి అద్భుతంగా పనిచేయును .

 * ఆయుష్షును పెంచును.

 * అప్పుడే కాచిన ఆవునెయ్యి మనోహరముగా ఉండును. సర్వదోషములను పోగొట్టును .

 * ఆవునెయ్యి తలకు రాసుకొని కొంచంసేపు ఉంచుకుని ఆ తరువాత తలంటుకొన్న శిరస్సులోని వేడి తీసివేయును . కళ్ళకు చలవ చేయును .

 * గోరువెచ్చని ఆవునెయ్యి నాలుగు చుక్కలు ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం రెండు ముక్కులలో వేయుచుండిన యెడల పార్శ్వపునొప్పి ఏడురోజుల్లో తగ్గును.

 * ఆవునెయ్యి అరికాళ్లకు, అరచేతులకు మర్దన చేయుచున్న  యెడల అరికాళ్ళ మరియు అరచేతుల మంటలు తగ్గును.

 * రెండు తులముల ఆవునెయ్యి , రెండు తులముల పటికబెల్లం పొడి కలిపి తినిపించుచున్న యెడల సారా తాగుట వలన కలిగిన మత్తు తగ్గును.

 * ఆవునెయ్యి , ఆవుపాలు కలిపి తాగించుచున్న యెడల అతిదాహం తగ్గును.

 * ఆవునెయ్యిని తినుచున్న యెడల ఎక్కిళ్లు కట్టును .

 * పాము కరిచినవానికి వెంటనే 200 గ్రాములు లేక 400 గ్రాములు ఆవునెయ్యిని తాగించవలెను. ఒక పావుగంట ఆగిన తరువాత వేడినీరు తాగించవలెను . దీనివలన వాంతులు మరియు విరేచనాలు అయ్యి విషం హరించును . అవసరం అయితే మరికొంత సమయం తరువాత మరలా మరొక్కసారి ఇవ్వవలెను.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List