కాశీ ఖండం –36 ~ దైవదర్శనం

కాశీ ఖండం –36


పంచ గంగా (పంచ నదీ )తీర్ధం...పూర్వం వేద శిరుడు అనే బ్రాహ్మనుడుండే వాడు .పేరు కు తగ్గట్టే వేదం లో దిట్ట ప్రతి క్షణం దైవ ధ్యానం లో గడిపే వాడు .తపస్సమాధీ లో చాలా కాలం గడిపాడు .దేవేంద్రుడు తపో భంగానికి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ‘’శుచి ‘’అనే అప్సరస ను ఆయన దగ్గరకు పంపాడు .ఆమె తన రూప యవ్వన  లావణ్యాభినయాల తొ ఆయన మనస్సు దోచింది ఆమెను చూడగానే రేతస్ఖలనం జరిగింది .ఇది తెలిసిన అప్సరస తన తప్పేమీ లేదని ఇంద్రుడు పంపగా వచ్చానని శపించ వద్దని ప్రాధేయ పడింది .వేద శిరుడు ఆమె కు భయం అక్కర లేదని చెప్ప్పి తన వీర్యాన్ని గ్రహించ మనికోరాడు .ఆమె స్వీకరించింది .

శుచికి సుందర రూపి అయిన కుమార్తె పుట్టగా ,పిల్లను ఆయన వద్ద వదిలి స్వర్గానికి వెళ్లి పోతుంది .ఆమె కు ‘’దూత పాపా ‘’అనే పేరు పెట్టి పెంచుతాడు .అంటే ఆమె పేరు ఉచ్చ రించ గానే పాపాలన్నీ ధ్వంసమై పోతాయని పేరులో ఉన్న అర్ధం .ఆమెకు యుక్త వయసు వచ్చింది .తండ్రి పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడు .ఈ విషయం తెలిసిన కూతురు ‘’నాకు అతి పవిత్రుడు ,అందరి చే నమస్కరింప బడే వాడు ,అందరి మనోరదాలను తీర్చే వాడు ,పేరు తలచి నంత మాత్రం చేత బాధోపశమనం చేసే వాడు అయిన వరుడిని వెతికి వివాహం చెయ్యండి ‘’అని తండ్రికి చెప్పింది .ఆమె మనో భీష్ఠం సఫల మవుతుందని తండ్రి అభయ మిచ్చాడు .

దూత పాపా తీవ్ర తపస్సు చేసింది .బ్రహ్మ ప్రత్యక్ష మై వరం కోరుకో మంటే ‘’ప్రపంచం లో పవిత్రులలో నన్ను ఉత్తమ పవిత్రు రాలిని చేయండి ‘’అని అడిగింది బ్రహ్మ తధాస్తు అంటూ మూడున్నర కోట్ల తీర్ధాలు దేవ ,మానవు లందర్నీ పవిత్రం చేస్తున్నాయని ఆరోజు నుండి వాటన్నిటి పవిత్రత ఆమె శరీరం లో అణువు అణువు లోను నిండి ఉంటుందని ఆమె అతి పవిత్రు రాలవుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు .ఆమె తండ్రి వేద శిర మహామునీ తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొందాడు . ,తండ్రీ ,కూతురు ఆనందం గా ఉన్నారు .ఒక రోజు తండ్రి వూరిలో లేని సమయం లో ధర్ముడు అనే వాడు ఆకాశ మార్గం లో సంచరిస్తూ ఈమెను చూసి ఆశ్చర్య పడ్డాడు .ఆమె ఎదుట నిలిచాడు .ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది .ఆమె ను గాంధర్వ వివాహం చేసుకొంటానన్నాడు ఆమె భయ పడుతుంది దూర్తుదేమో నని శంకిస్తుంది కోపం వచ్చి అతన్ని జలధార గా మారిపొమ్మని శపిస్తుంది .అతడు నిర్ఘాంత పోయి తనను అర్ధం చేసుకో కుండా తొందర పడి శపించి నందుకు కలత చెంది ,స్త్రీ అయి ఉండి కూడా కఠినం గా ప్రవర్తించావు కనుక కఠిన పాషాణం గా మారి పొమ్మని ప్రతి శాపం ఇస్తాడు .ఇంతలో తండ్రి తిరిగి వచ్చి విషయం తెలిసి బాధ పడతాడు .ఇద్దరు తొందర పడ్డారని చెపుతాడు .ఇదంతా శివాజ్న అని శిరసా వహిస్తారు అవి ముక్త క్షేత్రం అయిన కాశి లో  విశ్వ నాధుని చరణ సేవలో ‘’ధర్మ నదమై ‘’ప్రఖ్యాతి చెండుతావని ధర్మునికి, ,నిర్ధూత దూత పాప చంద్ర కాంత శిల గా ఎప్పుడు అతన్ని అంటి ఉంటుందని ఆమె కు తెలియ జేశాడు .వారిద్దరూ దంపతులై లోక కళ్యాణ కారకు లౌతారని దీవిస్తాడు .

సూర్య దేవుడు లింగ ప్రతిష్ట చేసి చాలా కాలం తపస్సు చేశాడు . ఆతని చెమట ద్రవం గా వెలువడి కొలను గా మారి ‘’కిరణ తీర్ధం ‘’అనే పేరు తెచ్చు కొంది .ఆ జలం సర్వ పాప ద్వంసీ .దూత పాప మిశ్రిత ధర్మ నదం లో కలుస్తుంది .అలాగే భాగీరధీ గంగా తీర్ధం ,యమునా  తీర్ధం సరస్వతీ తీర్ధం వాటిలో కలిసి పోతాయి ఆమెను ఆశ్రయించిన కిరణ ,ధర్మా ,గంగా ,యమునా ,సరస్వతులు పంచ నదీ తీర్ధం గా వర్ధిల్లు తుందని చెప్పాడు కలి యుగం లో చంద్ర కాంతా శిల రూపం లో ఈ అయిదు నదులకు మాత్రమె దూత పాప కని పిస్తుందని తెలిపాడు అందర్ని ఆకర్షించి పుణ్యాన్ని నిస్తుందని వరమిచ్చాడు కూతురికి .పంచ నదీ స్నానం సర్వ తీర్ధ ఫలదం .పంచ నదీ స్నానం చేస్తూ ఒక ఏడాది మంగళ గౌరీ పూజ చేస్తే గుణ వంతు లైన పుత్రులు జన్మిస్తారు .కృత యుగం లో ధర్మ నద తీర్ధం గా ,త్రేతా యుగం లో దూత పాప తీర్ధం గా ,ద్వాపరం లో బిందు తీర్ధం గ ,కలి యుగం లో పంచనద తీర్ధం గా ప్రఖ్యాతి చెందింది .

పంచ నదీ తీర్ధం లో స్నానం చేసి నపుడు ఈ కింది శ్లోకాన్ని పఠించాలీ

‘’కిరానా దూత పాపేచ ,పుణ్య తోయా సరస్వతీ –గంగాచ యమునా చైవ ,పంచ నద్యోత్ర కీర్తితాః

అతః పంచనదం నామ తీర్ధం త్రైలోక్య విశ్రుతం –దేవ నద్యార్ధ భాగాచ్చ –పంచ గంగేశ్వారా వధి

కిరణ శ్రోతాస స్తద్వాత్ –దూతా పాపెశ్వరా వధి ‘’
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...