గోమాత ఉపయోగాలు - 2 ~ దైవదర్శనం

గోమాత ఉపయోగాలు - 2

అంతకు ముందు పోస్టులో మీకు ఆవుపాలు యొక్క గొప్పతనం మీకు వివరించాను. ఇప్పుడు మీకు మరికొన్ని విషయాలు కూడా తెలియచేస్తాను.

 * ఆవుపాలు పొయ్యి మీద ఉంచి పాతిక భాగం ఇంకేంతవరకు మరిగించి తాగుట చాలా మంచిది .

 * ఆవుపాలు పితికిన పన్నెండు గంటలలోపు తాగవలెను. ఆ తరువాత సేవించిన వీర్యం చెడును.

 * ఆవుపాలను కాచు సమయంలో వీలైనంతవరకు మూతపెట్టి కాచుట మంచిది .

 * ఆవుపాలు పితికిన వెంటనే నురుగుతోటి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగవలెను. దేహంలోని అతివేడి , ప్రమేహం నశించును. వాతప్రకోపం తగ్గించును . కృశించిన శరీరం కలవారికి మంచి బలం కలుగచేయును. పాండు , కామెర్ల రోగాన్ని వెంటనే నశింపచేయును .

 * పిండినవెంటనే ధారోష్ణంగా ఉండు పాలు సేవించుట వలన రక్తదోషము , అతివేడి , దేహంలో స్థిరపడి ఉండు పురాణ వ్యాధులు , కష్టసాధ్య రోగాలు వంటివి ప్రతినిత్యం ఉదయాన్నే పరగడుపున పిండినవెంటనే ఆవుపాలు తాగిన నశించును. లవంగపట్ట కలిపి సేవించిన ఇంకా అత్యంత ప్రభావంగా ఉండును.

 * పంచదారతో పాలు సేవించిన కఫాన్ని కలుగచేయును . వాతాన్ని హరించును . పాలలో కలకండ చేర్చి సేవించిన యెడల శుక్రం వృద్ది చెందును. త్రిదోషములను హరించును .

 * ఆవుపాలలో బెల్లం కలిపి తాగిన యెడల మూత్రకోశంలో రాయి , సుద్ద , వ్రణములు నశించును.

 * ఆవుపాలతో తేనె కలిపి త్రాగిన యెడల సర్వదోషాలు హరించును .

 * ప్రతి నిత్యం ఉదయాన్నే క్షీరపానం వలన అగ్నిదీప్తి కలిగించును. మధ్యాహ్న సమయం నందు క్షీరపానం అశ్మరీ వ్యాధిని నయం చేయును . రాత్రి సమయం నందు క్షీరపానం సర్వదోషాలను నివారించును.

 * ఆవుపాలు ప్రతినిత్యం తీసుకోవడం వలన బాలురకు అత్యంత బలకారం . వృద్ధులకు రేతస్సు వృద్దిచేయును.క్షయరోగులకు అత్యంత హితకరంగా ఉండును.

      ఇప్పుడు మీకు ఆవుపాలల్లోని రకాల గురించి వివరిస్తాను.

 * నల్లావుపాలు శరీరంలోని పైత్యమును పోగొట్టును .

 * ఎర్రావుపాలు శరీరంలోని కఫాన్ని హరించును .

 * చారలు కలిగిన ఆవుపాలు శరీరంలోని వాతమును , పైత్యాన్ని పొగొట్టును. వీర్యవృద్ధి , కఫమును పెంచును. ఉదర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి హితము చేయును . చలువ చేయును . త్రిదోషాలను పొగొట్టును.

 * నిడుపుకొమ్ము ఆవుపాలు వృద్దులకు , ధాతు క్షీణత కలిగినవారికి అనుకూలంగా ఉండును.హృదయమునకు బలాన్ని ఇచ్చును.

 * బోడి ఆవుపాలు పీనస రోగాన్ని కలుగ చేయును . పీనస అనగా ముక్కువెంట ఆగకుండా నీరుకారు రోగం . వాతాన్ని మరియు పైత్యాన్ని హరించును . వీర్యపుష్టి , బలాన్ని కలిగించును.

 * తొలిసారిగా ఈనిన ఆవు పాలు బలమును చేయును . పైత్యాన్ని పొగొట్టును.

 * రెండొవసారి ఈనిన ఆవు పాలు వాతమును పోగొట్టును .

 * మూడొవసారి ఈనిన ఆవు పాలు శ్లేష్మవాతాలను అణుచును.

 * నాలుగోవసారి ఈనిన ఆవు పాలు త్రిదోషములను హరించును .

 * నాలుగు కంటే ఎక్కువసార్లు ఈనిన ఆవు పాలు త్రిదోషములను కలుగచేయును .

 * లేగటి ఆవుపాలు శీతలము , వాతమును చేయును .

 * తరిపి ఆవుపాలు శరీరముకు వేడిచేసి వాతమును హరించును .

  మేతను బట్టి ఆవుపాల గుణము  -

 * తెలకపిండి తినిన ఆవు యొక్క పాలు శరీరముకు కీడుచేయును . పథ్యముకు పనికిరావు. కఫమును ప్రకోపింపచేయును . కడుపునొప్పి కలిగించును.

 * పత్తిగింజలు తినిన ఆవు యొక్క పాలు వాతం పెంచును.

 * ఎండుగడ్డి తినిన ఆవు యొక్క పాలు త్రిదోషములను శమింపచేయును .

 * కుడితి తాగిన ఆవు యొక్క పాలు జబ్బులు పుట్టించును . కుడితి అనగా మిగిలిపోయిన మరియు పులిసిపోయిన పదార్థాలు కలిపినవి.

 * పచ్చిగడ్డి తినిన ఆవు యొక్క పాలు చాలా మంచివి. పథ్యమునకు పనికి వచ్చును.

  పాలు తీసుకోకూడనివారు  -

 * ఆమవాతం , జ్వరం, వ్రణము , కుష్టు , కఫము ఉన్నవారు , మేహ సంబంధ సమస్య ఉన్నవారు , భగంధరం ఉన్నవారు , అతిసార రోగులు , కలరా , గ్రహణి అనగా బంక విరేచనాలు కలవారు , అజీర్ణరోగులు , రక్తవిరేచనాలు కలవారు , నీళ్ల విరేచనాలు కలవారు , గొంతురోగాలు కలవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు సేవించరాదు .

  పాలు తీసుకోవలసిన వారు -

 * వ్యాది వలన నీరసం పొందినవారు , ఔషధ సేవన చేయువారు , గర్భిణీ స్త్రీలకు , సాధనపు పనులు అనగా వృత్తిపనులు చేయువారు , శరీరం శుష్కించి పోతున్నవారికి , బాలురకు , వృద్దులకు , నల్లమందు వాడువారు పాలు తీసుకోవడం వలన అమితబలం కలుగును. 
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive