కాశీ ఖండం –22 ~ దైవదర్శనం

కాశీ ఖండం –22


వివిధ లోక స్తితి వర్ణన... శివ శర్మ బ్రహ్మ దేవుని ఏదో ప్రశ్నించాలను కొన్న విషయాన్ని బ్రహ్మ కనీ పెట్టి అతనికి మోక్ష కాంక్ష ఉన్నాదని గ్రహించాడు .బ్రహ్మ విష్ణు దూతలను సత్కరించి పంపాడు .విమానం లో వెడుతూ విష్ణు దూతల తొ తాను అడిగిన వాటి కన్నిటికి కి చక్కని వివరణలు ఇచ్చి నందుకు కృతజ్ఞత తెలిపాడు .వారికి భూత భవిష్యత్తు లన్నీ తెలుసు నని మెచ్చుకొన్నాడు .వారు అతనికి మరి కొన్ని విశేషాలను తెలియ జేశారు .భూమండలం అడవులు ,సముద్రాలు పర్వతాల తొ విస్తరించి ఉంది .ఆకాశం భూ మండలం అంతటా పైన వ్యాపించి ఉన్నది .భూమికి పది వేల ఆమడల దూరం లో సూర్య మండలం ,దానికి లక్ష యోజనాల దూరం లో చంద్ర మండలం ,దానికి లక్ష యోజనాల దూరం లో నక్షత్ర మండలం ,దానికి రెండు లక్షల యోజనాల దూరం లో బుధ లోకం ,దానికి రెండు లక్షల యోజనాలలో శుక్ర లోకం ,దానికి రెండు లక్షల ఆమడల దూరం లో కుజ లోకం ,దీనికి ఇంతే దూరం లో బృహస్పతి లోకం ,దానికి అంతే దూరం లో శని లోకం ,దానికి పది లక్షల ఆమడల దూరం లో సప్తర్షి మండలం ,దానికి నూరు వేల ఆమడల దూరం లో ధ్రువ మండలం ఉంది .

           భూమి పై పాదాల తొ నడి చేది ఏదైనా భూలోకమే .దీనిపై సముద్ర పర్వత అరణ్యాలుంటాయి భూలోకం నుండి సూర్య మండలం వరకు సువర్లోకము అంటారు .భూమికి కోటి యోజలాల లో మహర్లోకం ,రెండుకోట్ల ఆమడలలో జనోలోకం ,నాలుగు కోట్ల ఆమడలలో తపో లోకం ఉన్నాయి .భూమికి ఎనిమిది కోట్ల యోజనాల దూరం లో సత్య లోకం ఉంది .భూమికి పదహారు కోట్ల యోజన దూరం లో వైకుం ఠంఉంది.ఇక్కడ అందరికి అభయ మిచ్చే లక్ష్మీ పతి ఉంటాడు .దీనికి పడ హారు కోట్ల యోజనాలలో కైలాసం ఉంది .మహేశ్వరుడు పార్వతీ సమేతం గా ప్రమధ గణ పరి వేష్టితుడై ఉంటాడు .ఈయనను ‘’పరుడు ‘’అంటారు .జగత్తు అంతా ఆయన శాసనం తోనే నడుస్తోంది .అతి స్వతంత్రుడు .ఆయనే పరబ్రహ్మ అని వేదాలు ఘోషిస్తాయి .అతడు పరాత్పరుడు .అతడే ఆనందం .సంవిత్తు .స్వయం వేద్యుడు .పరం జ్యోతి స్వరూపుడు .యోగి రమ్యుడు .నామ రూప రహితుడు .సర్వత్రా వ్యాపించి ఉన్న వాడు .సర్వ కర్మ వివర్జితుడు .చంద్ర రేఖ నుశిరసు పై దాల్చిన వాడు .వామ భాగం లో పార్వతీ దేవిని కలిగి అర్ధ నారీశ్వరుడైన వాడు .ఆది శేషుని సదా ఆభరణం గా ధరించే వాడు .వృషభ వాహనుడు .గజ చర్మ దారి .మన్మధ భస్మాన్ని ఒళ్లంతా పూసుకొని ఉంటాడు రూపా తీతుడై ,రుద్ర రూపి గా ,సర్వ వ్యాపిగా ఉంటాడు .ఆయనే శివుడు .నిరాకారు డైన సాకారుడు .సమస్త జగత్తు ఆయనచే సృష్టింప బడి క్రీడింప బడుతున్నాయి .

                    మహా దేవుడు తన తొ సమాన మైన సింహా సనం పై విష్ణు మూర్తిని కూర్చో బెట్టి ,సర్వ రత్న మయ చత్రాన్ని  పట్టించాడు .ఓషధీ జలం తొ అభి షెకింప జేశాడు .స్వర్ణ కిరీటాన్ని ఆయన మస్తకం పై అలంకరించి అభి షెకించాడు .ఎవరికి ఇవ్వని భోగమంతా విష్ణువుకు ఇచ్చాడు .అప్పుడు శివుడు బ్రహ్మ తొ /’’..విష్ణువు నాకు నమస్కరింప దగిన వాడు .మీరందరూ నమస్కరించండి’’అని చెప్పి శివుడు తాను విష్ణు మూర్తికి నమస్కరించి, అందరి చేతా చేయించాడు .అప్పుడు శివుడు విష్ణువు తొ ‘’మహా విష్ణూ !నీవు కర్తవు .సర్వ భూతాలను రక్షిస్తావు .హరించే వాడివి ,పూజింప బడే వాడివి ఇచ్చా ,జ్ఞాన ,క్రియా శక్తులను నీకు ఇస్తున్నాను .గ్రహించు.నీ భక్తులకు నేను ఉత్తమ మైన మోక్షాన్ని స్తాను .ఈ మాయా శక్తిని కూడా గ్రహించు .నా ఎడమ చేతివి నువ్వు .నా కుడి చేయి పితా మహుడైన బ్రహ్మ దేవుడు .ఈ బ్రహ్మను కూడా నువ్వే సృష్టిస్తావు .’’అని చెప్పి వీడ్కోల్పాడు .’’అని విష్ణు దూతలు శివ శర్మ కు బోధించారు .ఈ విష్ణు చరిత్ర విన్న వాడు స్వర్గాన్ని పొందుతాడు .కాశీ లో మోక్షం పొందిన వాడవుతాడు .ఆరోగ్య భోగ భాగ్యాలన్ని సమ కూడుతాయి .బంధవిముక్తు డవుతాడు .ఈకద హరికి, హరునికి కూడా చాల ప్రియ మైనది .
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive