శ్రీ త్రిశక్తి ఆలయం. ~ దైవదర్శనం

శ్రీ త్రిశక్తి ఆలయం.




 * శ్రీ త్రిశక్తి ఆలయం..

మహాకాళి, మహా సరస్వతి, మహా లక్ష్మీ అమ్మవార్లు ఈ ముగ్గురు అమ్మలు ఒకే పీఠంపై కొలువుదీరి ఉన్న క్షేత్రం పేరు విన్నారా...? ప్రపంచంలోనే ఎక్కడా లేని.. వినని.. అద్భుతమైన ఓ క్షేత్రం.. ముగ్గురు దేవతామూర్తులు ఒకే పీఠంపై కొలువుదీరిన ఆలయం.. హైదరాబాద్ కు అతి సమీపంలోనే... వలిగొండ పట్టణంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే ఆలయంలో కొలువైన ఇష్టకామేశ్వరస్వామి త్రిశక్తి ఆలయం ఉంది. 

ఈ ఆలయ సముదాయంలో 9 ఆలయాలు ఉన్నాయి. సంగెం వద్ద భీమలింగం, భారీ శివలింగం ఉంటుంది. 
దీనిని భీముడు ప్రతిష్టించడంతో భీమలింగంగా పేరొందిందని ప్రతీతి. అలాగే సుంకిశాలలో యాదాద్రి దత్తత ఆలయమైన శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయం ఉంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయు స్వామి కావడంతో స్వామి వారి దర్శనానంతరం భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు.

ఆ ప్రాంతం చేరుకున్న మరుక్షణం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పచ్చని బయళ్లు..ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారి రొటీన్ లైఫ్ నుంచి ఓ ప్రత్యేకమైన ప్రాంతంలోకి వెళ్లిపోతాము. ముగ్గురు అమ్మవార్లు ఒకే పీఠంపై కొలువుదీరడం ఈ క్షేత్రం ప్రత్యేకత అయితే నవగ్రహాలకు అధిపతులైన దేవదేవుళ్ల ఉపాలయాలు కూడా ఉన్నాయి...ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణాలోనే తొలి సూర్యదేవాలయం ఇక్కడే ఉంది

ఈ క్షేత్రంకు వరంగల్, విజయవాడ హైవేల మీదుగా వెళ్లొచ్చు...అమ్మవార్ల దర్శనం చేసుకోవచ్చు...అక్కడే ఉండేందుకు సౌకర్యవంతమైన గదులు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయంలో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. మీరు ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించండి...అమ్మవార్ల అనుగ్రహం పొందండి.

హైదరాబాద్, యాదాద్రి మధ్యలో ఉన్నదే వలిగొండ....సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఆ ప్రాంతం వలిగొండ ప్రధాన రహదారి మూసీ నది పక్కనే ఈ క్షేత్రం ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List