శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం. ~ దైవదర్శనం

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం.


 * శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం..


శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది. రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, గాలిగోపురం  95 అడుగుల పొడవున్న ఈ గాలిగోపురంపై ఉన్న 7 కలశములు 10 అడుగుల పొడవుతో బంగారు తొడుగును కలిగి ఉంటాయి.


స్థలపురాణం..

మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలోనుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ప్రధానాలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయం నకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవాహించు చున్నది. దీనిని పినాకినీ నది అని కూడ పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచారించి దైవ దర్శనముకు బయులు దేరుతారు.ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది.


ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శేషుతల్పం పై శయనముద్రలో శీ రంగనాథడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి - భూదేవిని దర్శించవచ్చును. గర్భాలయం చుటూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖ మండపం నిర్మించారు. ప్రదక్షిణ మండపం నందు ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సుమారు 100 సంత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారం తాపడం చేసిన గరుడ వాహనాన్ని, అద్దాలమండపాన్ని బహూకరించారు. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.






Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List