సఫల ఏకాదశి. ~ దైవదర్శనం

సఫల ఏకాదశి.


 * రేపు సఫల ఏకాదశి..


బ్రహ్మాండ పురాణంలోని శ్రీ కృష్ణ యుధిష్టర సంవాదము:

యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని   ఏకాదశి మహిమ గురించి అడిగెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పెను. దేవతలలో విష్ణుమూర్తి, నదులలో గంగ, మానవుల్లో బ్రాహ్మణులు, పక్షుల్లో గరుత్మంతుడు, యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞము, నాగులలో అనంతుడు ఎట్లు శ్రేష్ఠమైన వారో అట్లే ఏకాదశిలలో ఏకాదశి వ్రతము సర్వ శ్రేష్టమైనది. ప్రతి మాసంలో వచ్చే బహుళ ఏకాదశి వ్రతములు ఎవరూ పాటింతురో అట్టివారు నాకు ప్రీతి పాత్రులగుదురు. ఐదు వేల సంవత్సరములు తపస్సు ఆచరించి ఏ ఫలితములు పొందవచ్చునో కేవలం ఏకాదశి వ్రతము చేయుట వలన అట్టి ఫలితమును పొందవచ్చు.


పూర్వము చంపావతి నగరమున పాలించు మహీష్మతి అను రాజునకు నలుగురు కుమారులు కలరు. వారిలో జేష్ఠ పుత్రుడు లుంపకుడు. ప్రతి నిత్యము అతడు దేవ బ్రాహ్మణులను నిందించుచూ ద్యూత క్రీడ (చదరంగం) మద్యపానము మరియు పరనారీ సాంగత్యం చేసేవాడు. ఈ విధంగా దురాచార సంపన్నుడైన లుంపకుని మహీష్మతి రాజు తన పితృదేవతల నుండి సంక్రమించిన తన రాజ్యం నుండి బహిష్కరించి మన వనవాసమునకు వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించిరి. కానీ లుంపకుడు వనమున ఉండి, తండ్రి ఆజ్ఞను ధిక్కరించి రాత్రి సమయమున రాజ్యములో దొంగతనం చేయుచుండెను. ఒకనాడు భటులకు రాజపుత్రుడగు లుంపకుడు పట్టుబడినను ప్రభువుల మీద గౌరవంతో అతనిని విడిచి పెట్టినారు. కాలము ఇట్లు గడుచుచుండగా, వన్య పశువులను వధించి, పచ్చి మాంసము ఆరగించుచు, జీవించుచున్న లుంపకుడు ఒకదినము ఒకానొక అశ్వత్థ వృక్షమును (రావి చెట్టు) గాంచి ఆ చెట్టు కింద కొన్నికొన్ని రాత్రులు నివసించవలెనని సంకల్పించెను. ఆ కోరిక ప్రకారం అచ్చట నివసించుచూ పౌష్య మాసమున బహుళ దశమి నాటి రాత్రి ఆకలిదప్పులకు తాళలేక స్పృహ కోల్పోయి భూమిపై పడి ఉండెను. మర్నాడు ఏకాదశి తిథి. శరీరంలో సత్తువ లేక ఫల, కందమూలాలు, పశువు మాంసము తినక ఉపవాసముతో జాగరణ చేసెను. ఇట్లు తాను గుర్తింపకుండగనే ఏకాదశి వ్రతము ఆచరించుటచే అతనికి ఆ వ్రత ఫలితం దక్కి పునః ప్రజాపాలన చేయు భాగ్యము కలిగినది. కొంతకాలం రాజ్య రక్షణ చేసి, స్వర్గం నుండి వచ్చిన దివ్యరథం ఎక్కి తండ్రి శుభ ఆశీర్వాదము పొంది, రాజ్యపదమును పొందెను. ఈ విధంగా లుంపకుడు రాజ్యమును సర్వ సుభిక్షమగునట్లు పరిపాలించి దారాపుత్రులతో ఇహలోకమున యశస్సు మరియు దేహత్యాగానంతరము (అంత్య కాలమున) దేవ పదమును పొంది సుఖశాంతులతో నుండెను.


దయచేసి గమనించండి..


సఫల ఏకాదశి వ్రతము చేయదలసిన వారు..

ఉపవాసము ప్రారంభము :- 19-12-2022 సోమవారం మొదలుపెట్టవలెను.


ద్వాదశ పారణము :- 20-12-2022 మంగళవారం ఉదయం 8.08 నుండి 10.09 మధ్యలో ఉపవాసము విడువవలెను.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List