తిరుప్పావై అంటే ఏమిటీ..? వీటి ప్రాశస్త్యం ఏమిటి..? ~ దైవదర్శనం

తిరుప్పావై అంటే ఏమిటీ..? వీటి ప్రాశస్త్యం ఏమిటి..?

ఏమిటీ తిరుప్పావై..? ఏముంది అందులో..? కేవలం ముప్పై పాటలే కదా అని అనుకోకూడదు. చూడటానికి పైపైకి ఒక కృష్ణ-గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు.


తరుప్పావై ఏమిటో తెలిసింది, మరి అందరూ చెయ్యవచ్చా? 


శ్రీకృష్ణుడి కోసం చేసేది "నీవే తల్లివి తండ్రివి" అని అందరం చిన్నపుడు చదివిందే కదా, అందరూ చెయ్యవచ్చు ఈ వ్రతం.


మరి ఎప్పుడు ఆచరించాలి? 


ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా, అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెలతెలవారే సమయంలో లేచి చదివుతాడు ఒక విద్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. సూర్యుడు ధనుఃరాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మానం ప్రకారం డిసెంబరు 17 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం.


వ్రతం చేసే సమయం తెలిసింది, వ్రతం చేయటం కష్టం కాదా? 


కాదు, ఇది అతి సులభమైనది. తెలతెల వారే సమయంలో స్నానం చేయ్యటం, ఆరోజు పాశురం చదివి, ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం. ఇక ఆయా పాశురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List