శ్రీ కైలాసం నుండి పరమేశ్వరుడు మొట్టమొదటగా భూలోకంలో తన పవిత్ర పాదాలను మోపిన స్థలమే అరుణాచలం.. ~ దైవదర్శనం

శ్రీ కైలాసం నుండి పరమేశ్వరుడు మొట్టమొదటగా భూలోకంలో తన పవిత్ర పాదాలను మోపిన స్థలమే అరుణాచలం..

చిదంబరం క్షేత్ర దర్శనం, తిరువళ్ళూర్‌ నందు జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి.. 


మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో, అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం, అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి పరమశివుడు ఈ పవిత్ర పుణ్య అరుణాచల క్షేత్రంలోనే మహా తేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.


అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం దర్శనం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక కృత్తికా నక్షత్రం రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది జనం తరిలివస్తారంటే అతిశయోక్తి కాదు. అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అపితాకుచలాంబిక.


చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించలేరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. అరుణాచలం క్షేత్ర దర్శనం కోసం పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి. అరుణాచలేశ్వరుని అనుగ్రహం కోసం ప్రతినిత్యం అరుణాచలాన్ని స్మరించుకోవాలి..


గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ " అరుణాచలం " అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది. ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన  వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, సంచిత పాప కర్మలు సైతం పటా పంచలవుతాయనీ, ఎవరైనా మరణించి నరకానికి వస్తే, వారి జీవితంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట. ఒకవేళ వారి పుణ్యం కొలదీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినట్లయితే, వారి జీవితాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచల గిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి, గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాశులను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉంది..


అరుణాచల శివ అరుణాచల శివ 

అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List