నెరజాముల తండా శ్రీ మంత్రుస్వామి వారి ఆలయం. ~ దైవదర్శనం

నెరజాముల తండా శ్రీ మంత్రుస్వామి వారి ఆలయం.


నల్లమల్ల అటవీ ప్రాంతంలో అద్బుతాల మంత్రుస్వామి వారి ఆలయం...శ్రీశైలం వెళ్ళే దారిలో ప్రకాశం జిల్లా నరజాముల తండా గ్రామ శివారు లో వెలసిన ఆలయం.. మంత్రు స్వామి(ఆంజనేయ స్వామి వారే ఈ రూపంలో )వెలసారని భక్తుల నమ్మకం


చాలా సంవత్సరాల క్రితం దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో మంత్రు స్వామి వారి విగ్రహం కొందరు గిరిజనులు అటవి ఉత్పత్తులు సేకరణకు వెళ్లినప్పుడు దట్టమైన అడవిలో కనిపించగా,అప్పటి నుండి ఆ స్వామి కి పూజలు చేస్తు ఉన్నారట.


ఈ స్వామిని కొలిచిన వారికి శుభ ఫలితాలు కల్గుతుండటంతో అడవిలోకి ఎక్కువ మంది వెళ్లి దర్శించుకుని పూజచేస్తున్నారు,కాని ఆ ప్రాంతం దాకా వెళ్లలేని వారి కోసం మహిమాన్విత స్వామి వారు అందరికి దర్శనం ఇవ్వాలని,అందరూ పూజించాలని భావించి మంత్రుస్వామివారిని అందరికి అందుబాటులో ఉండేలా నెరజాముల తండా లో రోడ్డు పక్కనే ఆలయం నిర్మించారట.


ఇక్కడ స్వామి వారి అతి మహిమాన్వితుడని, ఈ స్వామి వారిని భక్తితో పూజిస్తే మనం కలలో కూడా ఊహించని అద్బుతాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయని,తప్పక కోరికలు తీర్చే దైవమని అందుకే అద్బుతాల మంత్రుస్వామి గా తాము పిలుస్తామని ఆంద్ర,తెలంగాణా రాష్ట్రాల వారే కర్ణాటక,ఒరిస్సా లాంటి దూరప్రాంతాల వారు దేశం నలుమూలల నుండి వచ్చి స్వామి వారిని దర్శిస్తారని ఆలయానికి వచ్చిన భక్తులు తెలిపారు.


ఈ స్వామిని భక్తితో కొలిస్తే కోరిన కోర్కెలు ఈడేరతాయని అందుకే రాజకీయ నాయకులు,బడా వ్యాపారస్తులు మరియు ఐ.ఏ.యస్,ఐ.పి.యస్. క్యాడర్ లో ఉన్నను ఈ ఆలయానికి సామాన్య భక్తులవలె వచ్చి స్వామి వారిని ఆరాధించే వారు చాలా మంది ఉన్నారని భక్తులు చెపుతున్నారు..


ఈ స్వామి వారిని నల్లమల్ల అటవీ ప్రాంత గిరిజనులు మరియు భారత దేశవ్యాప్తంగా ఉన్న సుగాలీ సోదరులు తమ ఆరాధ్య దైవం కొలుస్తారుఈ ఆలయ ప్రాంతం అంతా చుట్టు కొండలు,పచ్చని అటవీ వృక్షాలతో ఆహ్లాదంగా ఉంటుంది


ప్రయాణ మార్గం:


మాచర్ల నుండి శ్రీశైలం(165 కిలోమీటర్లు) వెళ్లేదారి లో ప్రకాశం జిల్లా లోకి ప్రవేశించగానే నెరజాముల తండా శ్రీశైలానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో రోడ్డుపక్కనే ఈ ఆలయం ఉంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంకు అతి దగ్గరలో ఈ ఆలయం ఉంటుంది..ఆ ప్రాంతంలో ఎవరూ అడిగినా చెపుతారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List