కార్తిగై బ్రహ్మోత్సవం - అరుణాచలంలో కార్తీక దీపం 🔥 ~ దైవదర్శనం

కార్తిగై బ్రహ్మోత్సవం - అరుణాచలంలో కార్తీక దీపం 🔥


శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది.

ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో (నవంబరు నుండి డిసెంబరు ) 10 రోజులపాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది!!...

పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు, అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది, (తమిళ టి.వి. ఛానల్స్ లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.)


ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, అయిదు అడుగుల చుట్టు కొలతగల పెద్ద లోహ పాత్రలో వేయి కిలోల స్వఛ్ఛమైన నేతిని పోసి, 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు.

ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగసి, ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కి.మీ.ల వరకూ కనబడుతుంది,

అరుణాచల ఆలయ ప్రస్తావనలో చెప్పుకోదగిన విశిష్టత కలిగినది, ఈ కార్తీక దీపాన్ని పది రోజుల పండుగగా జరుపుకుంటారు మరియు దీనిని కార్తిగై బ్రహ్మోత్సవం అని పిలుస్తారు.


తిరువణ్ణామలైలో కార్తిగై దీపం పండుగ సందర్భంగా ఇది చాలా ముఖ్యమైన వేడుక. అరుణాచలేశ్వరుడు కొండపైన అగ్ని రూపంలో కనిపిస్తాడని చెబుతారు. ఈ మహిమాన్వితమైన మరియు పవిత్రమైన ఘట్టాన్ని చూసేందుకు ఆ రోజున అరుణాచలేశ్వర ఆలయంలో చాలా కనులు పండుగలగా కోనసాగుతుంది..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List