శ్రీముఖ లింగాలయం ~ దైవదర్శనం

శ్రీముఖ లింగాలయం


 * శ్రీముఖలింగాలయం...

 

ఈ ఆలయంలో శ్రీ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది.


ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో  'మధుకం' అంటారని..


అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి.


ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.


భమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు.


ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది.


ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే, మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.


ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు. ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.


మహా శివరాత్రికి ఇక్కడ గొప్పగా ఉత్సవం జరుగుతుంది.


ఆలయ చరిత్ర..


శరీముఖలింగేశ్వర ఆలయంలోని శిల్పకళ ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది.


తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి, తన రాజధానిని క్రీ.శ.1135 లో ఒరిస్సా లోని కటక్ నగరమునకు మార్చిన పిదప ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది.


ఆనాటి వైభవమునకు తార్కాణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములు ఉన్నవి.


మధ్యయుగ కాలములో పాశుపత శైవమతము గుజరాత్, రాజస్థాన్, రాష్త్రములనుండి మధ్య్ర పదేశ్, అస్సాం, బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడు, మైసూరు ప్రాంతములకు వ్యాపించి జనాదరణ పొందెను.


ముఖలింగం లోని దేవాలయములు శ.పు.9వ శతాబ్దమునుండి 11వ శతాబ్దపు మధ్య కాలములో కట్టబడినవి. వాటిలో చివరిదైన సోమేశ్వరాలయము శ. పు 11వ శతాబ్దము నాటిది.


అత్యంత అరుదైన దర్శనం లింగంలో దర్శనమిచ్చే మహాదేవుడు శ్రీ ముఖలింగేశ్వర స్వామి స్థలపురాణం పూర్తిగా చదవండి.


శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి దర్శనం..


ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది.


ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.


ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి.


విటిని బట్టి ముఖలింగాలయాన్ని పు.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అయిన యంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది.


విరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది.


శ్రీముఖలింగేశ్వర ఆలయంలోని శిల్పకళ ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది. ఆనాటి వైభవుమునకు తార్కాణముగా ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నవి.


తప్పక సందర్శించవలసిన ఈ ప్రఖ్యాత శైవ క్షేత్రం.. జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళానికి 42 కి.మీ. దూరంలో జలుమూరు మండలంలో ఉంది..







Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List