రంగనాథ స్వామి దేవాలయం. ~ దైవదర్శనం

రంగనాథ స్వామి దేవాలయం.




* రంగనాథ స్వామి దేవాలయం..


మేడ్చల్ జిల్లా ఘటకేసర మండలం లో ఏదులాబాద్ గ్రామం లో వెలసిన్ గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం.  సికింద్రాబాద్ కి  సుమారు 30   కి మీ దూరం లో ఘటకేసర మండల కేంద్రానికి  5 కి మీ  దూరం లో వెలసిన  క్షేత్రం గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సుమారు 500 సంవత్సరాల  చరిత్ర గల దేవాలయం ఇది. అందమైన రాజ గోపురం ,గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ఆవరణం లో  పుష్కరిణి నమాచరించి భక్తులు స్వామి దర్శనం   చేసుకుంటారు. అద్బుతమైన కట్టడాలు ,చక్కని శిల్పకళా ఎంతో రమణీయంగా ఉంటుంది. వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. 


ఏదులాబాద్ కి పూర్వం రాయపురం అని పిలిచేవారు అట .అప్పన దేసిక చారి అనబడు బ్రాహ్మణోత్తముడు  ఈ క్షేత్రాన్ని లో ఉండేవాడట . ఒక మహర్షి మంత్రోపదేశం తో తో అతడు మదురై సమీపం లో  ఉన్న లిల్లి పొత్తుర్  లో గోదాదేవి ఆలయాన్ని దర్సిన్చుకున్నాడట ఆ సమయం లోనే గోదాదేవి అమ్మ వారు కలలో దర్శనం ఇచ్చి  తనను రాయపురం తీసుకోని వెళ్ళమని చెప్పిందట. అలా దొరికిన విగ్రహాన్ని తీసుకోని వచ్చి గ్రామస్తుల సహాయం తో ఈ దేవాలయాన్ని నిర్మించారు అని స్థల పురాణం. ఇప్పటికి ఈ దేవాలయం లో ఆ వంశస్తులు ఈ దేవాలయానికి పూజ కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంత చెట్లు ,గుట్టలు తో నిండి ఉండేది ఈ ప్రాంతం లో గరుడ పక్షుల సంచారం కూడా ఉండేది అట అందుకే దీనికి గరుడాద్రి అని కూడా పిలుస్తారు. 


ఇక్కడ ఉన్న గోదాదేవి అమ్మవారిని గాజుల అండాలమ్మ అని పిలుస్తారట . ఒకసారి అమ్మ వారు ఉత్సవాల సమయం లో ఒక గాజుల దుకాణానికి వెళ్లి గాజులు వేసుకొని డబ్బులు నాన్న గారు  ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయిందట. దుకాణం యజమాని ఆలయ అధికారిని అడగగా తనకు కుతర్లు లేరు అని చెప్పాడట ఆ తరువాత ఆలయం లోకి వెళ్లి చూడగా గాజులు అమ్మ వారి చేతికి ఉన్నాయి అట .అందుకీ అప్పట్నుంచి  ఇక్కడ ఉన్న అమ్మవార్ని గాజుల అండాలమ్మ అని కూడా పిలుస్తారు . అప్పట్నుంచి గ్రామస్థులు అమ్మవారిని ఇంటి అడపడుచుగా బావించి ఒడిబియ్యం పోస్తూ ఉండటం ఇక్కడ ఆచారం. ఆలయం లో అమ్మవారిని దర్శించి కోరికలు కోరుకుంటే  గోదాదేవి తప్పకుండ నెరవేరుస్తుంది అని భక్తుల భక్తుల ప్రాగడ విశ్వాసం. బ్రహ్మోత్సవాలు (శ్రవణ మాసం లో ఘనంగా జరుగుతాయి) మరియు గోదాదేవి కల్యాణం  ఘనంగా జరుగుతాయి .  ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించనీయమైన క్షేత్రం ఇది. 


(రంగనాథ స్వామి దేవాలయం- ఏదులాబాద్, ఘటకేసర మండలం)

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List