శ్రీ మీనాక్షీ అగస్థ్యేశ్వర స్వామి ఆలయం. ~ దైవదర్శనం

శ్రీ మీనాక్షీ అగస్థ్యేశ్వర స్వామి ఆలయం.






 * శ్రీ మీనాక్షీ అగస్థ్యేశ్వర స్వామి ఆలయం..

* శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..


భారత దేశం ఆలయాల నిలయమన్న సంగతి తెలిసిందే. కొన్ని ఆలయాలు నదుల తీరం వెంబడి ఉంటే మరికొన్ని సముద్రపు ఒడ్డుకు ఆనుకొని ఉన్నాయి. అయితే చాలా తక్కువ ఆలయాలు మాత్రం సంగమ స్థలాలల్లో కొలువై ఉన్నాయి. అంటే నది సముద్రం కలిసే చోటు కాని, ఒక నది మరో నదిలో కలిసే ప్రదేశంలో కాని ఆలయాలు నిర్మించారు. ఇలా సంగమం ప్రాంతంలో నిర్మించిన ఆలయాల సందర్శనం వల్ల పంచ హత్య మహాపాతకాలు నశించిపోతాయని హిందూ భక్తులు నమ్ముతారు..అందువల్లే పుణ్యక్షేత్రాల సందర్శన పై నమ్మకం ఉన్న వారు తమ తీర్థయాత్రలో భాగంగా తప్పకుండా ఈ సంగమ క్షేత్రాలను సందర్శింస్తూ ఉంటారు. ఇటువంటి కోవకు చెందినదే శ్రీ అగస్త్యేశ్వస్వామి ఆలయం. 


ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే.. ఇక్కడ కొలువైన శివలింగంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగని నీరు తీయకుండా వదిలేస్తే పొంగిపొర్లవు. పూజారి నీళ్లు సేకరించి భక్తులపై చల్లినప్పుడు అదే పరిమాణంలో మళ్లీ నీళ్లు ఊరుతాయి.


🔅 స్థల పురాణం ;


ఒక రోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ శివలింగం వెనుకాల దాక్కొంది. శివుడు జాలిపడి ఆ పక్షిని రక్షించాలనుకొన్నాడు. అయితే బోయవాడు వచ్చి ఆ పక్షి తనదని దానిని తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.

దీంతో శివుడు తాను ఈ పక్షికి మాట ఇచ్చానని అయితే నీ కోరిక కూడా సమంజసంగా ఉందని చెబుతారు. నీ ఆకలి తీర్చుకోవడానికి వీలుగా నా తల నుంచి కొంత మాంస తీసుకోవాలని సూచిస్తాడు. ఆ బోయవాడు ఇందుకు అంగీకరించి తన వద్ద గొడ్డలితో శివుడి శిరస్సును కొంత మేర ఖండించి చేతి వేళ్లతో కొంత మాంసాన్ని తీసుకొంటాడు.


ఆ చేతివేళ్ల గుర్తులను మనం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఇక స్వామివారి గాయన్ని కడగడానికి నేరుగా గంగమ్మే ఇక్కడికి వచ్చిందని చెబుతారు. అందువల్లే ఈ శివలింగం పై గుంటలో నీరు ఎల్లప్పుడు ఉంటుందని చెబుతారు.


ఇదిలా ఉండగా క్రీస్తుశకం 1524లో శ్రీ శంకరాచార్యలు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ బిలం (గుంట) లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరిణికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు. ఎంత సమయమైనా ఆ తాడు అలా వోపలికి వెళుతూనే ఉంది. దీంతో ఆ తాడును పైకి లాగారు. ఆ ఉద్దరిణికి రక్త మాంసాలు అంటుకున్నాయి కాని ఆ బిలం లోతు తెలియలేదు. దీంతో శంకరాచార్యలు లయకారకుడైన నిన్ను పరీక్షించడానికి నేను ఎంతవాడినని పరి పరి విధాలుగా ప్రార్థించాడు. తర్వాత ఈ వివరాలను తెలుపుతూ అక్కడ  రాతి శాసనం కూడా వేయించాడు. సదరు శాసనాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. 


ఇది నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం కూడా చేస్తుంటారు. ఈ వాడపల్లి శ్రీ అగస్త్యేశ్వస్వామి సందర్శనం వల్ల భూత, ప్రేత పిశాచాల భయం ఉండదని స్థానిక భక్తుల నమ్మకం.


🔆శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..


నరసింహుడి ఉచ్ఛ్వాస.. నిశ్వాసలతో మహిమాన్వితంగా సంగమ తీరంలో కొలువై, పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది.


ఇది పంచ నారసింహ క్షేత్రాలో ఒకటి. స్వామి రూపం ఉగ్రత్వం నిండి ఉంటుంది.  గర్భాలయం నందు గల రెండు దీపాలలో ఒకటి నిరంతరం మిణుకు మిణుకుమని చలిస్తుంది.  ఈ దీపాం స్వామి వారి ముక్కుకు దగ్గరలో ఉండును.  స్వామి వారి ఉచ్చ్వాస-నిశ్వాసల వలన కదులుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆ దీపానికి కాస్త కిందగా వున్న మరో దీపం నిశ్చలంగా ఉంటుంది. స్వామి వారిని " దీపాలయ్య " గా పిలుస్తారు.  

     

🔅 స్థల పురాణం..


పూర్వం అగస్త్య మహాముని శివకేశవుల విగ్రహాలను కావడిలో ఉంచుకొని, ముల్లోకాలు తిరుగుతూ భూలోకం చేరుకున్నాడట. కాశీకి వెళ్లే క్రమంలో కృష్ణా, ముచుకుంద నదుల సంగమం దగ్గర మజిలీ చేశాడట. సంధ్యావందనం కోసం కావడిని గోవులు కాసే పిల్లవాడికి ఇచ్చి, స్నానం చేసి వచ్చేవరకు దానిని కింద పెట్టవద్దని చెప్పి వెళ్లాడట. 

సంధ్య వార్చుకొని తిరిగి వచ్చి చూడగా, పిల్లవాడు కావడిని కింద పెట్టి వెళ్లిపోయాడట. కావడిని తిరిగి ఎత్తుకునే సమయంలో ఆకాశవాణి ద్వారా ‘ఈ ప్రాంతం పవిత్రమైనది.. ఇక్కడే ఉంటాను. నన్ను ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠించాలి’ అని స్వామివారు తెలిపారట. దాంతో అగస్త్యుడు స్వామివారి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.


అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివకేశవుల విగ్రహాలు కాలక్రమేణా మట్టిలో కూరుకుపోయాయి. 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు కోట నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా స్వామివారి విగ్రహాలు బయటపడ్డాయట. వెంటనే అక్కడ ఆలయాలను నిర్మించారు.

                             

హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వెళ్లే బస్సులన్నీ ఈ వాడపల్లి మీదుగానే వెలుతాయి. 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List