శ్రీ పొలిమేర వీరాంజనేయస్వామి దేవాలయం ~ దైవదర్శనం

శ్రీ పొలిమేర వీరాంజనేయస్వామి దేవాలయం

సీతారాములు ఎక్కడ వుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. హనుమంతుడు ఎక్కడ వుంటే అభయం ... అనుగ్రహం అక్కడ వుంటాయి. పావులూరులో వెలసిన హనుమంతుడు ఇదే విషయాన్ని మరో మారు స్పష్టం చేస్తున్నాడు. వీరాంజనేయ క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయం  ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో 

పావులూరు గ్రామంలో దర్శనమిస్తుంది. పూర్వం ఈ ఆలయం పొలిమేరలో వుండటం వలన ఇక్కడి స్వామిని పొలిమేర వీరాంజనేయుడిగా పిలుస్తుంటారు. ఇక్కడి ఆలయానికి గర్భాలయం లేకపోవటం ఒక విశేషం.. ఇక్కడ స్వామివారు ప్రత్యేకమైన గర్భాలయంలో కొలువుదీరి ఉండకపోవడం విశేషం.. ఆలయ మధ్య భాగంలో మందిరం వంటి ప్రదేశంలో స్వామి దర్శనమిస్తుంటాడు. ఆ పక్కనే సీతారాముల ఆలయం కూడా కనిపిస్తుంటుంది. వారిని కనిపెట్టుకుంటూనే ఆయన భక్తులను అనుగ్రహిస్తుంటాడు. 


స్వామి మూల విరాట్ పై మంచి భవనం కట్ట్టాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా విఫలమవటం మరో ప్రత్యేకత .

అందుకని పైకప్పు లేకుండానే ఇక్కడి ఆలయంలో మండపం నిర్మించాల్సి వచ్చింది. సింధూర వర్ణంతో కాకుండా స్వామి ఇక్కడ వివిధ వర్ణాలతో వింతగా శోభించటం చిత్రాతి చిత్రం.


ఆలయ గోడలపై రామాయణ చిత్రాలు చూడ ముచ్చటగా ఉండటం మరో వింత. మహాద్వారం పై భరత, లక్ష్మణ శత్రుఘ్న సమేత శ్రీ సీతా రాముల విగ్రహాలు ఉన్నాయి, వీటికి కుడివైపున శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ,ఎడమ వైపు అభయాంజనేయ స్వామి ఉన్నారు. ప్రధాన ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువై ఉంటాడు. 


వైఖానస ఆగమ విధానంలో పూజాదికాలు జరుగుతాయి. సువర్చలాంజనేయ ఉత్సవ విగ్రహాలకు నిత్యం అభిషేక పూజలు నిర్వహిస్తారు. సంవత్సరంలో మూడు సార్లు సువర్చలాంజనేయ స్వామివారి కళ్యాణం చేయటం మరొక ప్రత్యేకత. హనుమజ్జయంతి  శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుపుతారు.


ఈ ఆలయం వెనక శ్రీ భవనం అంజిరెడ్డి గారి సాయం తో నిర్మించిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో కూడిన దేవాలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో గంగా,అన్నపూర్ణా  సమేత శ్రీ కాశీవిశ్వనాధ సన్నిధి ఉంటుంది .

ఈ శివలింగాన్ని కాశీ నుండి తెప్పించి ప్రతిస్టించటం విశేషాలలో విశేషం.


ఇక్కడి ఆలయంలో నిత్యం ఏకాదశ రుద్రం తో అభిషేకాలు జరుగుతాయి. విశ్వేశ్వరాలయానికి ఎడమ వైపు అన్నపూర్ణాలయం ఉంది. అమ్మవారు సర్వాలంకార శోభితంగా దర్శన మిస్తుంది. కుడివైపు గంగా దేవి మందిరం ఉన్నది.


శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రతినిత్యం పూజాభిషేకాలు... ఆకుపూజలు నిర్వహిస్తుంటారు. మంగళవారం రోజున ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది.


గ్రహ పీడల వలన ... దుష్ట శక్తుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన బయటపడిపోతారని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.


(శ్రీ పొలిమేర వీరాంజనేయస్వామి దేవాలయం,  ప్రకాశం జిల్లా, పావులూరు..)


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List