శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వరాలయం.. ~ దైవదర్శనం

శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వరాలయం..


* శనిదేవుడు ఈశ్వరునిలో మమేకమైన అత్యంత అరుదైన ఆలయం..


ఇక్కడ క్షేత్రంలో నాగశిల ప్రతిష్ఠిస్తే.. అభిష్టాలు నెరవేరతాయి.  నర్సింగోలు శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వరాలయం కాల సర్ప, నాగదోషాల నివారణకు విశిష్టమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలో రోజూ వందలాది మంది భక్తులు ఈ ప్రాంగణంలో కాలసర్ప దోష నివారణ పూజలు జరిపించుకుంటారు. అలాగే నాగదోషాల నివారణకు కూడా ఈ క్షేత్రం ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. 


అగస్త్య మహర్షి వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించి ప్రజల బాధలకు విముక్తి కల్గించాడు .

ఈ రాక్షస సంహార  దోష నివారణకోసం పాలేటి నదీ తీరాన తపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై శివలింగం ప్రతిస్తించమని ఆదేశిస్తే ‘’శ్రీ రామ లింగేశ్వర  లింగం ‘’ప్రతిష్టించి పూజించాడు. ఆ తర్వాత సర్వ పాప ప్రక్షాళన కోసం జీవుల ,ఆయుర్దాయం పెరగటం కోసం శ్రీ శనైశ్చర స్వామిని నరసింగోలు గ్రామం లో ప్రతిస్టించాడని పురాణ కధనం .


కాలక్రమం లో ఆలయం జీర్ణమైతే 1991లో జీర్ణోద్ధరణ చేశారు .ఉన్నతమైన ధ్వజ స్థంభం కుమార స్వామి మొదలైన విగ్రహ ప్రతిష్ట చేశారు. శనివారం తైలాభిషేకం ఉంటుంది. రామలింగేశ్వరాలయంలో అమ్మవారు పార్వతీ దేవి .అమ్మవారిని నిమ్మకాయలతో పూజించటం ఇక్కడ ప్రత్యేకత. అమ్మవారి ముందు శ్రీ చక్రం ఉంది. దీనికి నిత్యం కుంకుమ పూజ చేస్తారు నవరాత్రులలో ప్రత్యెక అలంకరణలు పూజలు ఉత్సవాలు జరుపుతారు. ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న  ‘’అశ్వత్ధ నారాయణ వృక్షం ‘’ఏంతో ప్రాదాన్యతను పొందింది. వీటికింద నాగుల జంట ప్రతిష్టితమై ఉన్నాయి.


ఈ క్షేత్రంలో నాగ శిలా ప్రతిష్ట చేయిస్తే వెంటనే ఫలసిద్ది జరిగి అభీష్టాలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆ కారణంగా రోజూ వందలాది మంది భక్తులు ఈ ప్రాంగణంలో వివాహం, సంతాన సౌభాగ్యం కోసం ఈ క్షేత్రంలో నాగశిలను ప్రతిష్టిస్తారు. ఆలయ నిర్వాహకులు జంధ్యాల చంద్ర భాస్కర శాస్త్రి నేత్రుత్వంలో ఆయా పూజా కార్యక్రమాలన్నీ అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయం సర్వ దోషాల నివారించే పవిత్ర క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. సినిమా టెక్నీషియన్లు తరచుగా సందర్శించే ఈ ఆలయం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.


ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రికి అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. రామలింగేశ్వర స్వామికి, పార్వతి మాతకు ప్రత్యేక అభిషేకాలతో పాటు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు జరిగే స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. అంతేకాదు.. అర్ధరాత్రికి లింగోద్భవ కాల అభిషేకంతో పాటు.. ముక్కోటి ఏకాదశికి, కనుమ పండుగకు తెప్పోత్సవాన్ని నిర్వహిప్తారు. 


ఇక కార్తీక పౌర్ణమి రోజున స్వామి వారికి జ్వాలాతోరణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు కుంకుమపూజలు, శ్రీచక్ర పూజలు నిర్వహిస్తారు. ప్రతి పాల్గుణ పౌర్ణమి నుంచి అమావస్య వరకు సూర్య కిరణాలు నేరుగా స్వామి వారి పై పడతాయి. ఇది ఈ ఆలయ వాస్తు విశేషంగా చెబుతారు. 


శనీశ్వర ఆలయం :.. 


ఈ గ్రామంలోని ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం, మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. ఒంగోలు నుండి 25 కి.మీ. దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో శనీశ్వరుడు లింగరూపంలో కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. శనిదేవుడు ఈశ్వరునిలో మమేకమైన అత్యంత అరుదైన ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు. శని, శివుడు, ఇరుదేవతలు జంటగా కొలువుదీరిన ఆలయమిది. అగస్త్యమహర్షిచే ప్రతిష్ఠితమైన ఈ ధామం, అత్యంత పురాతనమైనదిగా పేరు గాంచింది. వివిధ ఉపాలయాలతో అలరారుతున్న ఆలయమిది.


ఈ ఆలయంలో శనివారంనాడు, శనిత్రయోదశి సందర్భంగా, ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. శనీశ్వరునికి తైలాభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ శ్రీ రామలింగేశ్వరస్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, పిమ్మట భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List