హనుమంతుని శక్తి. ~ దైవదర్శనం

హనుమంతుని శక్తి.





* హనుమంతుని శక్తి..


భూలోకంలో రామావతార విశేషాలను స్వయంగా తిలకించే సంకల్పంతో పరమేశ్వరుడు తన అంశయైన  హనుమంతుని అంజనీపుత్రునిగా అవతరింపజేసినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. సౌందర్య

తేజోమూర్తియైన తన పుత్రునికి సుందరుడు అని నామకరణం చేసింది.


ఆంజనేయుడు తన మూడు సంవత్సరాల వయసులో ఆకాశంలో రంగుల రంగుల  సూర్యభగవానుని  యేదో పండుగా భావించి దానిని  తినాలనే కోరికతో ఆకాశానికి ఎగిరాడు. ఆ చిన్న బాలుడు తన  తీవ్ర ఉష్ణోగ్రతకు మాడి పోకూడదని సూర్యభగవానుడు తన గదాయుధంతో  ఆ బాలుని నెట్టివేశాడు. ఆ తాకిడికి ఆంజనేయుడు బలంగా నేలమీదకు వచ్చిపడ్డాడు. ఆ తాకిడికి ఆంజనేయుని దవడలు విరిగిపోయాయి.  


చిన్నతనం నుండి సూర్యభగవానుని పై ఏర్పడిన ప్రీతియే మాత్రం తగ్గ లేదు. విద్యాభ్యాసం చేసే వయసు రాగానే  వేద శాస్త్రాలు అభ్యసించాలని సూర్యదేవుని వద్దకు వెళ్ళాడు. ఈసారి హనుమంతుని భక్తి శ్రధ్ధలకి  మెచ్చిన సూర్యభగవానుడు  ఒక నిబంధనతో విద్య నేర్పడానికి అంగీకారాన్ని తెలిపాడు.


 " తనతో సమానమైన వేగంతో అనుసరించగలిగితే విద్య నేర్పిస్తాను" అని అన్నాడు. హనుమ ఎంతో సాహసంతో సూర్యుని నిబంధనకి లోబడి అతని వెనకాల నడుస్తూ సకల వేదాలు శాస్త్రాలు నేర్చుకుని నిష్ణాతుడైనాడు

మారుతి.


 ఆంజనేయుడుచిన్న వయస్సులో చాలా అల్లరి చేసేవాడు. దానివలన మునులు , ఋషుల యాగాలకు  భగ్నం కలిగేది. దానితో కోపం వచ్చిన ఋషులు, " నీవు అతి బలవంతుడవనే కారణంతో ఇన్ని ఆగడాలు చేస్తున్నావు. అందువలన నీ శక్తిని  నీవు మరిచిపోదువుగాక పోతావు. అని శాపమిచ్చారు.


తన శక్తి సామర్ధ్యాలు మరచిన హనుమంతుడు కాలక్రమంలో సుగ్రీవునికి మంత్రి అయినాడు.  పిదప శ్రీ రాముని పరిచయం జరిగిన తరువాత సీతాదేవిని  వెతకడానికి దక్షిణ దిశగా వెడుతున్న వానర సమూహంలోని జాంబవంతునికి సహాయంగా హనుమంతుడు కూడా వెళ్ళాడు.   సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళిన సంగతి జటాయువు ద్వారా తెలుసుకొని జాంబవంతునితో సముద్రతీరానికి వెళ్ళాడు. కానీ సముద్రాన్ని  దాటే మార్గం తెలియక చింతనలో మునిగాడు హనుమంతుడు.


అప్పుడు వయసులో , అనుభవంలోను పెద్దవాడైన జాంబవంతుడు హనునుమంతునికి శక్తి యుక్తులను , పరాక్రమాన్ని గుర్తుకి తెచ్చాడు. శ్రీ రామునికి సహాయం చేయాలని తన బలాన్నంతా ఉపయోగించి,  ఆకాశమార్గాన ఎగిరి లంకకు చేరుకున్న తరువాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిన కధే. బలం, తెలివితేటలు రెండూ కలవడం అపూర్వం.  ఎంత , ధనబలం, మందిమార్బలం వున్నా , భగవంతుని యందు భక్తి, వినయవిధేయతలు కలిగివుండడమే నిజమైన ధర్మం అని లోకానికి తెలియచేసినవాడు హనుమ. దేవాలయాలన్నింటిలో శ్రీరాముని సన్నిధిలో ముకుళిత హస్తాలతో దాస భక్తునిగా ఆంజనేయుడు దర్శనమిస్తాడు. మానవులు తమ సిరిసంపదలు , సర్వశక్తులు సత్కార్యాలకే  వినియోగించాలని బోధించినవాడు హనుమ.


అత్యంత దయాగుణం కలిగినవాడు కేసరి నందనుడైన  హనుమంతుడు. మన కష్టాలు సమస్యలు, మనో వేదనలని

హనుమకి తెలిపి శరణు వేడుకుంటే వెంటనే పరిష్కరించే దైవం హనుమ. భక్తులందరికి మనోబలాన్ని , చైతన్యశక్తిని  అనుగ్రహించే దైవం  భక్త దాసుడైన హనుమంతుడు అని పురాణాలు వివరిస్తున్నాయి.


హనుమంతుని పటం గృహంలో పెట్టి పూజించేవారు, తమ కష్టాలు తొలగాలని వేడుకుని,  ప్రతి గురువారం ఉపవాసం చేసి ఆంజనేయస్వామి వాలమునకు పసుపు కుంకుమలతో ఒక బొట్టు పెట్టి పూజించాలి. హనుమంతుని వాలమునకు పూర్తిగా బొట్లు పెట్టడం ముగియగానే మన కష్టాలు  తొలగిపోతాయి. ఒకరోజుకి ఒక బొట్టు పెట్టాలి.


పెరుగు అన్నం, మినప వడలు, వెన్నహనుమకి ప్రీతికరమైనవి. ఆశించిన కార్యాలు జయప్రదంగా నెరవేరగానే

వడమాలగాని, తమలపాకుల మాలగాని సమర్పించి అలంకరిస్తామని మ్రొక్కుకుంటే జయప్రదమవుతుందని 

ఐహీకం. శని భగవానుని ఒక ఆట ఆడించిన శక్తిమంతుడు ఆంజనేయస్వామి.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List