శ్రీ ఎరకేశ్వరాలయం. ~ దైవదర్శనం

శ్రీ ఎరకేశ్వరాలయం.






 * శ్రీ ఎరకేశ్వరాలయం..


సూర్యాపేట..ఆ ఊరు పేరు వినగానే పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడు. భక్త జనానికి ఆరాద్య దైవంగా వెలుగొందుతున్నారు. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కళామతల్లికి నిలయమై, ఎన్నో శివాలయాలకు వేదికైంది. "వాణి  నా రాణి" అని చెప్పి మెప్పించిన పిల్లలమర్రి పిన వీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ పిల్లలమర్రి.


సూర్యాపేట (తెలంగాణ రాష్ట్రం) లోని పిల్లలమర్రి దేవాలయం దాదాపు 1000 సంవత్సరాల నాటిది మరియు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. 


కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు. అనంతరం తన రాజధానిని పిల్లలమర్రికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. 


ఈ గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప వటవృక్షం (మర్రిచెట్టు) ఉండేది. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు క్రింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది.


కాకతీయులకు సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన బాతిరెడ్డి అర్ధాంగి ఎఱకసాని ఆధ్వర్యంలో ఇది నిర్మితమైంది. అందుకే ఈ స్వామిని ఎఱకేశ్వరుడని పిలుస్తారు.  గుడి నిర్మాణంలో ఉపయోగించిన రాయి వల్ల ప్రత్యేక ధ్వని వస్తుంది. ఆకట్టుకునే స్తంభాలు, వాటిమీదున్న బొమ్మలు అబ్బురపరుస్తాయి. 


🔆 స్థల పురాణo..


ఇక్కడ ఏడెకరాలకు పైగా విస్తరించిన పిల్లలమర్రి చెట్టు ఉండేది. ఒకరోజు 'పెద్ద భూకంపం రాబోతోందనీ, చెట్టు నేలకొరుగుతుందనీ, ఆ చెట్టు కింద ఘనమైన ఖనిజ సంపద ఉందనీ... చెట్టు మీది పక్షులు పలుకుతుండగా... ఒక గిరిజనుడు విన్నాడు. ఆ సంగతి ఆ ప్రాంత పాలనాధికారి బేతిరెడ్డికి చెప్పాడు. కొద్దిసేపటికే ఆ జోస్యం నిజమైంది. చెట్టు నేలకొరుగగా, దాని కింద అపార ఖనిజ సంపద లభ్యమైంది. అదంతా స్వాధీనం చేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికంగా చెప్పుకుంటారు. 


ఇక్కడ అపూర్వమైన శిల్పకళతో భాసిల్లుతున్న చెన్నకేశవస్వామి దేవాలయం, నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయాలు ఉన్నాయి. పిల్లలమర్రిలోని నాలుగు దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటికి తప్పుగా పేరు పెట్టబడ్డాయని ఒక అధ్యయనంలో తేలింది.


🔅 సమేశ్వర గుడి (ఇప్పుడు ఎఱకేశ్వర దేవాలయం)

🔅నరసింహదేవ దేవాలయం (ఇప్పుడు నామేశ్వర దేవాలయం)

🔅ముకండేశ్వర దేవాలయం (ఇప్పుడు త్రికూటేశ్వర దేవాలయం)

🔅రమేశ్వర దేవాలయం (ఇప్పుడు చెన్నకేశవ దేవాలయం) అని ఒక అధ్యయనం లో తేలింది.


ఈ దేవాలయంకి తూర్పు, ఉత్తర, దక్షిణాలలో మూడు వరండాలు, పశ్చిమాన గర్భాలయం ఉన్నాయి.ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి ఆసక్తికరమైన ధ్వని లక్షణాలను కలిగి ఉందని చెప్పబడింది. గుడి రాయిని నాణెంతో తట్టినప్పుడు, అది లోహంలా శబ్ధాన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది.


ఆలయ ప్రధాన గర్భగుడిలో ప్రధాన దేవత చెన్నకేశవస్వామి విగ్రహం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుండి మార్చి నెలల్లో జరిగే వార్షిక ఉత్సవాల సమయంలో ఈ విగ్రహం అలంకారాలలో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో, ఆలయ ప్రాంగణం సుదూర ప్రాంతాల నుండి వచ్చి స్వామికి ప్రార్థనలు చేసి, ఆయన ఆశీస్సులు పొందేందుకు వచ్చే భక్తులతో నిండిపోయింది.


చరిత్రక మరియు సౌందర్య విలువతో పాటు, ఇది సాంస్కృతికంగా కూడా ముఖ్యమైన ప్రాంతం. ఇది ప్రముఖ తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం. కాకతీయ రుద్రదేవుని మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. రేచర్ల నామిరెడ్డి నిర్మించిన త్రికూటాలయంలో మూడు శివాలయాలున్నాయి. నామిరెడ్డి తన తండ్రిపేరు మీద కామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, 

తన పేరు మీద నామేశ్వర లింగాలను ప్రతిష్టించాడు.


నమేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్త స్వరాలు వినిపించడం ప్రత్యేకత.  దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు,వాయిద్యకారుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేవాలయాలు శివరాత్రి శోభకు ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.  ఈ ప్రాంతంలోని దేవాలయాలలో అనేక శివలింగాలు ఒక వైపుకు వంగి ఉంటాయి. అవి సాధారణంగా వరంగల్‌ వేయి స్తంభాల గుడిలో ఉన్న శివుని శైలికి అనుగుణంగా చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. 


🔅ఎలా చేరుకోవాలి : ..

నల్గొండ జిల్లా, సూర్యాపేట నుండి పిల్లలమర్రి 6 కి.మీ దూరంలో ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List