శ్రీరంగం దివ్య క్షేత్రంలోని 'వెళ్ళై గోపురం' ~ దైవదర్శనం

శ్రీరంగం దివ్య క్షేత్రంలోని 'వెళ్ళై గోపురం'



 * శ్రీరంగం దివ్య క్షేత్రంలోని 'వెళ్ళై గోపురం'..  


వెళ్ళై అమ్మ అనే ఆలయ నర్తకీమణి జ్ఞాపాకార్థం ఈ గోపురానికి 'వెళ్ళై గోపురం' అని సార్థక నామం ఏర్పడింది. 1323 సంవత్సరం డిల్లీ సుల్తాను సేనాని శ్రీరంగం ఆలయం కొల్లగొట్టడానికి వచ్చాడు. ఎంతో ఆభరణాలను, బంగారుని ఎద్దు బండ్లలో తరలించాడు.  


ఇంకా దొంగలించాలని అతడు చూసినప్పుడు ఆలయ నర్తకి వెళ్ళై అమ్మ చాకచక్యంగా అతనితో మరింత బొక్కసాన్ని చూపిస్తానని గొపురం పైకి తీసికెళ్ళి అమాంతం కింద పడదోసేసింది. తర్వాత ఆమె సైతం గోపురం నుండి కింద పడిపోయి ప్రాణత్యాగం చేసుకొంది.కొన్నేళ్ళ పిదప విజయ నగర సామ్రాజ్య సేనాని కెంపణ్ణ తన సైన్యంతో వచ్చి ముస్లిములని తరిమికొట్టాడు.


వెళ్ళై అమ్మ జ్ఞాపకార్థం ఆమె తన ప్రాణాన్ని బలి ఇచ్చిన ఆ గోపురనికి తెలుపు వర్ణం పూయించి 'వెళ్ళై గోపురం' అని పేరు పెట్టాడు. ఇలా ఎంతో చారిత్రక అంశాలు తనలో ఇముడ్చుకొన్న దివ్య దేశం శ్రీరంగ క్షేత్రం.ఇప్పటికీ ఆ గోపురం వెళ్ళై గోపురంగా తాయర్ల సన్నిధి సమీపంలో కనిపిస్తున్నది.  


శ్రీరంగం కోవెలలోని ఉన్న ప్రతి ఱాయీ ఒక చరిత్రను చెప్ప గలదు. వెళ్ళండి భూలోకవైకుంఠం శ్రీరంగధామానికి, శ్రీరంగని దర్శనం చేసుకుని ముక్తి పొందే అవకాశం ఉంటుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List