సూర్యభగవానుని శిష్యుడు ~ దైవదర్శనం

సూర్యభగవానుని శిష్యుడు



 * సూర్యభగవానుని శిష్యుడు..


గొప్ప జ్ఞానిగా పేరుపొందిన సకలుని పుత్రుడు వైశంపాయనుడు. ఈయన వేదవ్యాసుని శిష్యుడు. సకల

వేదవేదాంగాలలో  నిష్ణాతుడు. ఒకనాడు వైశంపాయనుడు తన శిష్యులతో " ఈనాడు మనం అందరం భయం లేకుండా  యజ్ఞయాగాదులు ప్రశాంతంగా చేసుకోగలగడానికి కారణం  మిధిలా నగరాన్ని  పాలిస్తున్న జనక మహారాజు. కనుక మీరు  రోజుకు ఒకరు చొప్పున ఆ మహారాజు భవనానికి వెళ్ళి మంత్రాక్షింతలతో మహారాజును వారిని ఆశీర్వదించి రావాలి"  అని ఆదేశించాడు. గురువుగారి ఆనతి ప్రకారం  శిష్యులు అందరూ ఒక్కొక్క రోజు  మహారాజుని ఆశీర్వదించి రాసాగారు.


వైశంపాయనుని శిష్యులలో ఒక శిష్యుడు మహాజ్ఞాని. అతను మహావిష్ణువు ఆనుగ్రహంతో జన్మించినవాడని పురాణ గ్రంధాలు కీర్తిస్తున్నాయి.  ఈయన జనకుని ఆశీర్వదించే రోజు వచ్చినది. అతను జనక మహర్షి భవనానికి వెళ్ళాడు.

కాని  ఆ సమయాన మహారాజు  అక్కడ  లేకపోవడంతో మంత్రాక్షింతలను అక్కడి  మండపంలో  వేసి వెళ్ళిపోయాడు. జనకమహారాజు తిరిగి వచ్చి చూసేసరికి  ఆశ్చర్యకరంగా ఆ మండపమంతా విరిసిన పరిమళ పుష్పాలతో కళకళలాడుతూ కనిపించింది. ఆ శిష్యుని అక్షితల ప్రభావం వలన పుష్పవనంగా మారిన ఆ ప్రాంతం మహారాజు మనసుని ఉత్సాహభరితం చేసింది. అక్షంతలు జల్లి  వెళ్ళిపోయిన ఆ జ్ఞానిపై జనకమహారాజు కి ప్రత్యేకమైన అభిమానం కలిగింది.


ఇంక మీదట  "నిత్యము జ్ఞానసిధ్ధి పొందిన ఆ శిష్యుడే వచ్చి మంత్రాక్షింతలతో  ఆశీర్వదించేలా ఏర్పాట్లు చేయమని

జనకమహారాజు వైశంపాయనుని కోరాడు. కాని  జ్ఞానియైన ఆ శిష్యుడు  గురువుగారు మొదట ఏర్పాటు చేసిన 

పధ్ధతి ప్రకారం నిత్యం ఒక్కొక్క శిష్యుడుగా వెళ్ళి ఆశీర్వదించడమే సముచితమని చెప్పాడు. ఈ విధంగా నడచుకోవడం  మహారాజు  మాటను అతిక్రమించి నట్లు కాదని వినయంగా తెలిపి  తోటి శిష్యులకు సమంగా అవకాశాలు కలిగించాడు.


తర్వాతి కాలంలో  ఈ శిష్యుడే జనక మహారాజుకు బ్రహ్మవిద్యను ఉపదేశించినట్లు  పురాణ గ్రంధాలు తెలుపుతున్నవి. ఆవిధంగా ఆయన బోధించిన కాలంలో జనకపురి ఆశ్రమాన్ని  కణ్వమహర్షి. ఈయన ఆ  జ్ఞాన శిష్యుని ప్రధమ శిష్యుడు. ఆయనే శ్రీ మన్నారాయణుని అంశయైన యజ్ఞవల్కుడు. భూలోకంలో  ఈయన అవతరించడమే ఒక అద్భుతం. 


భరతఖండంలో ఉత్తర భాగాన వర్ధమానపురం వున్నది. ఇక్కడే సకలుడు అనే ఋషి నివసించేవాడు. ఆయనకి సునంద అనే పుత్రిక, వైశంపాయనుడనే పుత్రుడు వున్నారు. సరస్వతీ దేవి అంశ  అయిన సునందని బ్రహ్మరధుడు

వివాహం చేసుకున్నాడు. చాలాకాలం దాకా వీరికి సంతానం కలుగలేదు. ఆయన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ

తపస్సు చేశాడు. బ్రహ్మరధుని తపస్సు కి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మరధుడు 'సద్గుణవంతుడు ,  సకలశాస్త్రపారంగతుడైన,  ఒక పుత్రుని ప్రసాదించమని నారాయణుని వరం కోరాడు. నారాయణుడు అనుగ్రహించాడు.

 కాలక్రమంలో సునందా దేవి గర్భవతి అయినది.కాని ప్రసవం కాలేదు. నెలలు నిండాయి. సంవత్సరాలు గడిచాయి.  అయినా ప్రసవం మాత్రం జరుగలేదు. గర్భంలోని శిశువుని కారణమడుగగా, శ్రీ మన్నారాయణుని అనుగ్రహం నాకు లభిస్తేనే జన్మిస్తాను" అనే మాటలు వినపడ్డాయి. బ్రహ్మరధుడు తిరిగి తపస్సు చేశాడు. ఐదు సంవత్సరాల గర్భవాసానికి తరువాత మహావిష్ణువు అనుగ్రహంతో బిడ్డ క్షేమంగా జన్మించాడు. శతభిషా నక్షత్రం, ధనుర్లగ్నం  కూడిన శుభదినమున శ్రీ మన్నారయణుడే అవతరించాడు. ఇదే యజ్ఞవల్క్యుని అవతార దినం.


పెద్దలు ఆ పిల్లవానికి పెట్టిన పేరు "సానందరుడు'' మహర్షులు పరమానందంతో యజ్ఞవల్క్యుడని పిలుస్తారు.

దేవగురువైన బృహస్పతి   నాలుగు వేదాలు, సకల విద్యలు , సకల కళలు యీయనకు నేర్పి ఉపనయనం చేశాడు.

పిదప వేద వ్యాసుని వద్ద వేదాధ్యయనం చేశాడు యజ్ఞవల్క్యుడు. ఋగ్వేదమును యజుర్వేదమును,  59 భాగాలు అభ్యసించాడు. తన తల్లి సోదరుడైన వైశంపాయన మహర్షి వద్ద జ్ఞానయోగమును అభ్యసించాడు. వైశంపాయనుని వద్ద శిష్యునిగా వున్న సమయంలో  జనకుని అనుగ్రహించిన సంఘటనలు జరిగాయి.


వేదాలలో ప్రధాన భాగాలు అభ్యసించిన పిదప 15 భాగాలు మిగిలి వున్నవి. ఆ భాగాలు సూర్యభగవానునికి మాత్రమే తెలుసు . యజ్ఞ వల్క్యుడు గాయత్రీ దేవిని ఉపాసించి తపస్సు చేశాడు. గాయత్రీ దేవి సూర్యభగవానుని ద్వారా మిగిలిన భాగాలు నేర్చుకునేటేందుకు సహాయం చేసినది. అనేక కఠోర పరీక్షల  తరువాత సూర్యదేవుడు యజ్ఞవల్క్యుని తన శిష్యునిగా చేసుకొన్నాడు. తనకి తప్ప మరి ఎవరికి తెలియని యజుర్వేద రహస్యాలను

నేర్పేడు.


యజ్ఞవల్క్యుడు  గృహంలో నివసిస్తూనే తన శిష్యులకు  శుక్ల యజుర్వదమును, వేదాలను నేర్పేరు. " యజ్ఞ వల్క్య స్మృతి'  అనే గ్రంధాన్ని వ్రాశారు. ఈనాటి చట్ట ప్రమాణాలు, మొదలైన విజ్ఞానమును తెలిపే ఆది గ్రంధంగా వున్నది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List