శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. ~ దైవదర్శనం

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం.






 * శ్రీ ఛాయా సోమేశ్వరాలయం..


నల్లగొండ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది తెలంగాణా సాయుధపోరాటం, గుట్టలు, బంజరు భూమి. కానీ ఈ జిల్లాలోనే పానగల్లు లాంటి అద్భుత దేవాలయాలున్నాయన్న సంగతి అందరికీ తెలియకపోవచ్చు. ఇక్కడ అతి పురాతన కాలంలో నిర్మించిన పచ్చల సోమేశ్వరాలయం ఉన్నది.  తరువాత 11,12 శతాబ్ది కాలంలో మరో సోమేశ్వరాలయాన్ని నిర్మించినారట. ఆ ఆలయాన్ని ఛాయా సోమేశ్వరాలయమని పిలుస్తారు. సోమేశ్వరాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలలోని ఘట్టాలను శిల్పరూపాలుగా చెక్కినారు. అలనాటి శిల్పుల పనితనంలోని చాకచక్యం ఆ శిల్పాల కారణంగా తెలుసుకోవచ్చు. అక్కడి అద్భుతం ఏమనగా ఛాయా సోమేశ్వరాలయంలోని శివలింగంపై పగటి సమయంలో ఛయకనిపిస్తుంది. ఆ ఛాయ ఏ విధంగా ఎటువైపు నుండి పడుతుందో ఎవ్వరికీ అంతుపట్టనిది. 


ఈ దేవాలయం మండపంలోని నాలుగు స్థంబాలపై వివిధ రకాల శిల్ప ఖండాలు వినూత్న రీతిలో తీర్చిద్దిద్దారు. ఈ నాలుగు స్తంభాలపై సముద్ర మథనం, మధ్యమోహిని అమృతాన్ని పంచడం, గజాసుర సంహారం, నరసింహస్వామి హిరణ్య కశిపుణ్ణి వధించడం, రావణసురుడు కైలాస శిఖిరాన్ని కదిలించడం, రామాయణ మహాభారత గాథలను అద్భుతంగా చిత్రించారు. గర్భగుడిలోపలి భాగంలోని గోడలపై పలు భంగిమలతో విఘ్నేశ్వరుడు, నటరాజు, అష్టదిక్పాలకులు, లక్ష్మీనారాయణుడు, లింగోద్భవ మూర్తి, అర్ధనారీశ్వరుడు, మహిషాసుర మర్ధిని శిల్పాలున్నాయి. 

ఈ ఆలయంలో ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయి. 

 

💠 ఛాయా సోమేశ్వర ఆలయం : 

ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతం. చాయ సోమేశ్వర ఆలయం చూపరులను ఆలోచింపచేస్తుంది. గర్భగుడిలోని శివలింగంపై 24 గంటలు రాత్రి పగలు తేడా లేకుండా స్తంభాల నీడ పడుతుంది. ఈ నీడ ఎలా పడుతుంది అనేది అంతుచిక్కని విషయం. ఇది ఎలా సాధ్యం అనేది చరిత్రకారులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. 


త్రికూట ఆలయంగా మూడు గృహాలతో నిర్మించబడి తూర్పు ముఖంగా వున్న గర్భగృహం వెన్నెలకాంతిలో కనపడుతుంది. ఉత్తర భాగంలో వున్న గర్భగుడిలో ఒక మనిషి నీడ ఏడుగురి నీడల్లా కనిపిస్తుంది.ఇది ఈ దేవాలయ ప్రత్యేకత. శివలింగంపై అనునిత్యం నీడ వుండడంతో ఈ గుడికి ఛాయ సోమేశ్వరాలయంగా పేరుపొందింది.


ఈ ఆలయ వాస్తుశిలపాచార్యులు లైట్స్ డిఫ్రాక్షన్ సూత్రాన్ని ఉపయోగించి ఒక రహస్యమైన నీడను సృష్టించాడు. వాస్తుశిల్పి ఆలయం వెలుపల నాలుగు స్తంభాలను నిర్మించాడు, వాటి నాలుగు నీడలు శివలింగంపై ఆలయం లోపల ఒకే ఒక్క నీడను కలిగి ఉండేలా కలుస్తాయి.

 

గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? 


ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు..ఆ నీడ ఒకే స్తంభానిది కాదు.. నాలుగు స్తంభాలది. కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది. నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివ లింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు. 


ఆలయానికి రాళ్ళతో కూడిన పునాదిని ఎంచుకోవడం ద్వారా శిల్పి భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాస్తవానికి పూర్వం గ్రామాలలో, పట్టణాలలో వివిధ కార్యాలకు అంటే వివాహాలకు, కచేరి, పండుగలు, మతకృత్యాలు మొదలైన వాటికి ఆలయాలే కేంద్రంగా ఉండేవి. కాబట్టి రాజులు వాటికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి నిర్మించేవారు. ఆలయాలకు భక్తులను రప్పించడానికి శిల్పులు ఏదో ఒక ప్రత్యేకతతో ఆలయాలను నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి నిశ్చలఛాయను అనుసంధానించారు. అది శిల్ప చాతుర్యమైనా, నిర్మాణ అద్భుతమైనా కూడా దైవత్వమే. ప్రజలకు దైవభక్తి, మతాచారాల పట్ల ఉండే విశ్వాసాలను ఆసరాగా తీసుకుని  శాస్త్రమనే కాషాయపు గుళికను సాంప్రదాయము అనే చెక్కరలో అద్ది మానవాళికి అందించడం జరిగింది.  శాస్త్రము, ఆధ్యాత్మికత రెండు కూడా రైలుపట్టాల లాంటివి ఎందుకంటే అవి ఎప్పుడూ కలవవు కాని ఒకటి లేకుండా మరొకదానికి ప్రాధాన్యత లేదు. ఆత్మే పరమాత్మ ... దేవుని నమ్మని వారు తమని తాము నమ్మలేరు. శాస్త్రీయ దృక్పథానికి ఆధ్యాత్మికతను అద్ది భారతీయ సంప్రదాయాలను, సంస్కృతులను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం మనందరిమీద ఉంది.


ఇలా చేరుకోవాలి?:

హైదరాబాదుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండలోని పానగల్‌లో ఈ ఆలయం ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List