శ్రీ ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి. ~ దైవదర్శనం

శ్రీ ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి.




 * శ్రీ ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి..


ఆంధ్రరాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా లోని నర్సాపూర్ నందు గల ఈ ఆలయము  చాల విశేషమైనది. ఇది శ్రీపెరుంబదూరు సమీపము నందు గల భూతపురి లోని ఆలయమునకు ఇది నకలుగావున ఆధునిక భూతపురి అందురు. ఇందు ప్రధాన ఆలయమందు ఆదికేశవస్వామీ శ్రీదేవీ భూదేవీ సమేతంగా వేంచేసియుండ కుడివైపున భగవద్రామానుజుల దివ్య సన్నిధి ఎంబెరుమన్నార్ గా నుండ ఎడమవైపున భక్తుని పేరున యతిరాజనాథవల్లి పేరుతో వరప్రసాది గా లక్ష్మీ దేవి యుండును.


ఆంగ్లేయుల వద్ద లేఖకుడు ఉప్పాల రామప్పనాయుడు శ్రీ ఉన్నిరామానుజస్వామి వారి రామాయణ ప్రవచనములకు ముగ్ధుడవగా, గురుదక్షిణగా స్వామివారి ఆదేశానుసారం శ్రీపెరంబుదూరు వెళ్ళి ఆ ఆలయ నమూనా గుర్తించి అందు ముందుగా మరొక తిరుమేని అను పీఠము గద్దెను ఏర్పరచి రెంటికి పూజలు జరిపించి ఆలయము పూర్తయిన పిదప ఇచ్చటకు తెచ్చి ప్రతిష్ఠించెను. స్వామికి భేద, అభేద, ఘటిక అను మూడు శాఖలపై గల ఆధిపత్యము చిహ్నముగా దీనిని త్రివేది, భద్రవేది అనికూడ పిలుస్తారు. ఈ ఆలయమున జరుగు ధనుర్మాస భోగికల్యాణము, బ్రహ్మోత్సవాలు రామానుజుల 12 రోజుల ఉత్సవాలకు దూర ప్రాంతముల నుండి కూడ వేలాది భక్తులువచ్చి సేవిస్తారు.


(శ్రీ ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి -నర్సాపురం)

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List