శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి. ~ దైవదర్శనం

శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి.



ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంనకు సుమారు ఒక కీ.మీ దూరాన, సిగిలేరు వాగు ఓడ్డున ప్రాచీన శివాలయంను దర్శించగలం.  స్వామిని శ్రీ పాతాళ నాగేశ్వరుడుగా కొలుస్తారు. రాష్ట్రంలో 8 నాగేశ్వర ఆలయలున్నాయి.  వీటిలో శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి స్వామి స్వయంభూ లింగము. శివ లింగము దక్షిణాభి ముఖంగా ఉంటుంది.  


దక్షిణామూర్తి  గురు గ్రహాధి పతి. పూర్వం స్వామిని సిద్ధలు సేవించి,  సిద్ధలు పొందినారు. నాడు  ఆలయ ప్రాంతం సిద్ధలూరుగా పిలిచేవారు. నాటి సిద్ధలూరు ప్రాంతం నేటి గిద్దలూరు పట్టణంగా ఎదిగినది. శ్రీ పాతాళ నాగేశ్వర ఆలయం కేతు గ్రహరాదనకు శ్రేష్టం. కేతు గ్రహ పీడతలుకు శాంతులు, జపములు మొదలగునవి నిర్వహించుతారు.


     

ఆలయ ప్రవేశం తూర్పు & ఉత్తర ద్వారాలు నుంచి జరుగుతుంది.  ప్రాకార మండపం నందు పార్వతీ దేవి సన్నిధి తూర్పు అభిముఖంగా ఉన్నది. ఇచ్చట  సిద్ధి గణపతి, నందీశ్వరుడు, కాల భైరవుడు (లింగ రూపం) మొదలగునవి దర్శించగలం. ప్రాకార మండపంనకు కొంత పాతాళం నందు  భీమ లింగము ఉత్తర అభిముఖంగా దర్శనమిస్తుంది. భీమ లింగమునకు మరికొంత పాతాళం నందు  శ్రీ పాతాళ నాగేశ్వర లింగము దక్షిణ అభిముఖంగా ఉంటుంది.  ఇది స్వయంభూ మూర్తి.   


ఇక్కడి ఆలయమునందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి.  మహాశివరాత్రి సందర్భముగా కళ్యాణం, గ్రామోత్సోవం నిర్వహించుతారు. లింగోద్భవ కాలము నందు గర్భాలయం యొక్క ఉపరితలం నుండి జారిన నీటి దారలు, శ్రీ పాతాళ నాగేశ్వర లింగమును అభిషేకించుతాయి. దీనిని దేవతల అభిషేకంగా చెప్పుచుంటారు.


గుంటూరు - గుంతకల్ రైలు మార్గములో గిద్దలూరు ఉంది. గిద్దలూరు రైల్వే స్టేషన్ నుంచి ఆలయంకు ఆటోలు దొరుకుతాయి. ప్రకాశం జిల్లా లోని అన్ని ప్రాంతములు నుంచి  గిద్దలూరుకు బస్సులు ఉంటాయి. గిద్దలూరు RTC బస్ స్టాండ్ నుంచి ఆలయంకు ఆటోలు దొరుకుతాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List