శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ~ దైవదర్శనం

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం



* శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం..


కృష్ణా  తీరంలో ఐదు ప్రముఖ నరసింహ క్షేత్రాలు వున్నాయి.  వాటిని పంచ నారసింహ క్షేత్రాలు అంటారు.  అవి మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, వేదాద్రి, కేతవరం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణలో కోకొల్లలు. వాటిలో ప్రముఖ క్షేత్రం కృష్ణా నది ఒడ్డున కొలువుదీరిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వామి ఆలయం.


నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ తాలూకా లో విలసిల్లిన ఈ క్షేత్రంలో నరసింహస్వామి స్వయంభువుడు.  

సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో వున్న ఈ స్వామిని చాలా కాలం సేవించారు. 

ఆయనే కాదు, ఇంకా ఎందరో మునీంద్రులు ఈ స్వామిని సేవించారు.  

ఇప్పటికీ, రాత్రి సమయంలో ఋషి పుంగవులు ఈ స్వామిని సేవించటానికి వస్తారని నమ్మకంగా చెబుతారు. 


🔆 ఆలయ చరిత్ర.. 


పూర్వం బరాధ్వజది మహర్షులు శ్రీ నృశింహోపసన చేసిన తపోభుమి మట్టపల్లి క్షేత్రం.11 వందల సంవత్సరాల క్రితం  మట్టపల్లికి ఎదురుగా తంగెడ అనే గ్రామం వుండేది. ఆ ఊరిలో మాచిరెడ్డి అనే మోతుబరి రైతు  వుండేవాడు. ఆయన, ఆయన కుటుంబీకులందరూ చాలా ఉదార స్వభావం కలవారు.

 

మాచిరెడ్డి కృష్ణానదికి కొంచెం దూరంలో తంగెడ అనే ఊరు నిర్మించి దాని చుట్టూ మహా దుర్గము, 101 దేవాలయాలు నిర్మించి తాను ప్రభువుగా పాలించాడు. ఆ ఊరిలో ప్రజల సౌకర్యార్ధము ఒక దిగుడుబావి తవ్వించాలని ప్రయత్నించగా,  ఎంత లోతు తవ్వినా జలము పడలేదు.  ఒక రోజు మాచిరెడ్డి స్వప్నంలో గంగాభవాని దర్శనమిచ్చి నీ కోడలు భవనాశనీదేవి బావిలోకి దిగి నన్ను పూజిస్తే నేను ఉప్పొంగి పొంగుతాను. అయితే నీ కోడలు నాలో ఐక్యమవుతుంది. మీరు దీనికి అంగీకరిస్తే మీకు గంగ తప్పక లభిస్తుంది అని చెప్పింది. కోడలు భవనాశనీదేవి కుటుంబంలో వారిని ఒప్పించి బావిలో దిగి గంగమ్మను పూజించింది.  గంగ ఉప్పొంగగా, ఆమె అందులో ఐక్యమయింది. 

  

ఒక రోజు స్వప్నంలో మాచిరెడ్డికి ప్రసన్న వదనుడైన శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చి, స్వయంభువు అయి తన మూర్తి కృష్ణకి అవతల ఒడ్డున వున్న అరణ్యంలో ఒక గుహలో వున్నదనీ, ఈ విషయాన్ని లోకానికి తెలియపరచమని ఆదేశించాడు. మరునాడు మాచిరెడ్డి అరణ్యంలో ఎంత వెతికినా స్వామిని కనుక్కోలేకపోయారు.  స్వామి ఆదేశాన్ని పాటించలేకపోయాననే చింతతో మాచిరెడ్డి స్వామినే తలుచుకుంటూ అలసటతో ఒక చెట్టుకింద సొమ్మసిల్లిపోయాడు.  

ఆ సమయంలో స్వామి తిరిగి సాక్షాత్కరించి దిగులు చెందవద్దనీ, మాచిరెడ్డికి కనిపించే దూరంలో వున్న ఆరె చెట్టుమీద ఒక గద్ద వున్నదనీ, ఆ చెట్టకు సూటిగా వున్న గుట్టమీద గుహలోనే తానున్నాననీ, గుహ ద్వారం లతలు  పొదలతో మూసుకుపోయి వున్నదనీ, వాటిని తొలిగిస్తే తన దర్శనమవుతుందనీ సెలవిచ్చాడు.


స్వామి ఆదేశానుసారం ఆరె చెట్టు, దానిమీద గద్ద, దానికెదురుగా గుట్ట, గుహ, గుహలోని స్వామినీ కనుగొని అమితానందభరితుడైనాడు. స్వామి శంఖ చక్రములు, గద, అభయముద్రలతో చతుర్భుజుడై, శేషుడు గొడుగు పట్టగా మహర్షులు అభిషేకించే దక్షిణావర్త శంఖముతో,  తులసీదళమాలతో, భక్త ప్రహ్లాదునితో, దివ్య దర్శనమిచ్చాడు.  

ఆ ప్రదేశమంతా దేవతలు మునులు పూజించిన పుష్పాల సుగంధాలు వ్యాపించాయిట. 


ఆలయ ప్రదక్షిణం ! సర్వ పాప హరణం !!

ఆలయంలో నిత్యం నిర్వహించే ప్రధక్షణాలతోనే సర్వపాపాలు పోతాయనే నమ్మకం భక్తుల్లో బలీయంగా ఉంది.తొలుత కృష్ణానదిలో స్నానమాచరించి తడి బట్టలతోనే ఆలయం లో ప్రతిష్టతమై ఉన్న నాగదేవత,ఆంజనేయ స్వామిల చుట్టూ భక్తులు ప్రధక్షిణాలు చేస్తుంటారు. 11రోజులపాటు ఉండి ముడుపూటల 32సార్లు ప్రధక్షిణాలు చేస్తూ శ్రీ మట్టపల్లి మగళాష్టాన్ని ప్రధక్షిణాల సమయం లో పటించాల్సి ఉంటుంది. అలాగే శుభపలితాలకై  శ్రీ మట్టపల్లి నాధం ప్రణతోస్మి నిత్యం నమ: అనునామాన్ని 32వేల సార్లు వ్రాసిన వారికి సర్వకోర్కెలు తీరుతాయనేది భక్తుల నమ్మకం .


ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట.  అందుకే ఈ  క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు. సధారణంగా విష్ణుమూర్తికి తులసీ దళములు ప్రీతికరమైనా, ఇక్కడ స్వామి పూజకి ఈ ఆరె పత్రినే ఎక్కువగా ఉపయోగిస్తారు.  ఎందుకంటే ఆ చెట్టు వల్లనేకదా స్వామి ఉనికి తెలిసింది. ఇక్కడ అనేక సత్రాలున్నాయి.  ఈ సత్రాలలో భోజన వసతి వున్నది.  ఈ క్షేత్రంలో అన్నదానం ఎంత జరుగుతుందో, స్వామి అంత సంతోషిస్తారు అని నానుడి. అందుకే ఇక్కడి స్వామివారికి అన్నాలయ్య అనే పేరు కలదు.


స్నానఘట్టాలు :

ఇక్కడి స్నాన ఘట్టాలను ప్రహ్లాద స్నాన ఘట్టం, మార్కండేయ స్నాన ఘట్టం, బాలాజీ స్నాన ఘట్టం అని వ్యవహారిస్తారు. స్వామి వారిని దర్శించుకోవడానికి మెట్ల ద్వార వెళ్ళే భక్తులు..మెట్ల పూజ చేస్తారు. పసుపు కుంకుమలు అద్దుతూ అధిరోహణ చేస్తారు.


ప్రత్యేక కార్యక్రామాలు : 

వైకుంఠ ఏకాదశి కి ,నరసింహ జయంతి కి  విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడును . 


మట్టపల్లి క్షేత్రం నల్గొండ (Nalgonda) జిల్లా హుజూర్ నగర్ కి 25 కి.మి దూరంలో కలదు.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List