వేములవాడ ~ దైవదర్శనం

వేములవాడ






 * వేములవాడ..


వందల సంవ్సతరాల చరిత్ర గల వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి పుణ్య క్షేత్రం కి ప్రసిద్ది ఇక్కడికి వచ్చే భక్తజనం తో ఎపుడు కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు మొదట ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకొని ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాడ నమ్మకం.

ఇక్కడ కుల మతాలకు అతీతంగా హిందూ,జైన,బౌద్ద మతాలతో పాటు ముస్లీం భక్తులు రావటం ఇక్కడి మరొక ప్రతేకత.


స్థలపురాణం :..

పూర్వం అర్జునుడి ముని మనమడు నరేంద్రుడు వేటకు వచ్చి అనుకోకుండా ఒక మునిని చంపుతాడు దాని వలన అతనికి బ్రహ్మ హత్య పాతుకం కలిగి శాప విమోచనం కోసం దేశాయటన చేస్తూ ఇక్కడ ఉన్న నీటి కొలను లో స్నానం చేసి జపం చేస్తుండగా ఒక లింగం దొరుకుతుంది. దానిని ప్రతిష్టించి గ శివుడు ప్రత్య క్షమై నరెంద్రునికి శాప విమోచనం

చేసి అక్కడే కొలువై ఉన్నాడు అదే ఇపుడు ఉన్న మూలవిరాట్టు అని చరిత్ర చెప్తోంది.


ఆలయ నిర్మాణం : 

క్రీ .శ . 8 వ శతాబ్దం లో అక్కడ పాలించే చొలక్య రాజు రాజ రాజ నరేంద్రుడు వేట కి వచ్చి తప్పిదం లో ఒక

బ్రహ్మణ కుమారుణ్ణి చంపి శాపగ్రస్తుడు అవుతాడు. కొన్ని రోజులకి ఆ రాజు కి చర్మానికి సంబంధించి న వ్యాధి తో బాధపడుతూ ఉంటాడు అతని తో పాటు అతని దగ్గర ఉన్న కుక్క కి కూడా సోకుతుంది.


అపుడు రాజ్యం వదిలి తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు రాత్రి వేములవాడ సమీపం లో ఆ ధర్మగుండం వద్ద బస చేసి తెల్లవాజమున లేవాగనే ఆ రాజు కుక్క ఆ ధర్మగుండం లో మునుగుతుంది దానితో ఆ కుక్క కి ఉన్న వ్యాది నయం

అవుతుంది. అది చూసి ఆ రాజు కూడా ధర్మగుండం లో మునిగి శాప విముక్తుడు అవుతాడు. ఆ తరువాత రాజు కలలో శివుడు కనిపించి ఆలయ నిర్మాణం గురుంచి చెప్పగా ఆలయం నిర్మించాడు.


అలా అక్కడ శివుడు రాజ రాజేశ్వరస్వామి గ ప్రసిద్ది చెంది భక్తుల కోరికలు తిరుస్తున్నాడు . 400 సంవ్సతరాల క్రితం ఒక ముసల్మాన్ శివ భక్తి తో గుడిలోనే ఉంటూ శివున్ని ఆరాదిస్తూ అక్కడే మరణిస్తాడు అతని గుర్తు గ మసీదు

ని ఆలయ ప్రాంగణం లో నిర్మించారు. అక్కడికి వచ్చే భక్త జనం ముందుగ మసీదు ను దర్శించి వెళతారు. ఇలా ఇక్కడ భీమేశ్వర ఆలయం,పోచమ్మ గుడి ఇంకా అనేక దేవాలయాల తో ఎపుడు భక్త జనం తో వేములవాడ కిటకిట లాడుతుంది.


ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రము, కరీంనగర్ జిల్లా వేములవాడలో ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List