అహోబిలం క్షేత్రం. ~ దైవదర్శనం

అహోబిలం క్షేత్రం.





‘’ అహో వీర్యం అహో శౌర్యం అహోబాహు బిలం బిలం

నారాయణం పరం తేజం అహో బిలం అహో బిలం ‘’


నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలు అందరూ చూసి అహోబిలం ఏమి బలము స్వామిది అన్నారు. అందుకని ఆక్షేత్రమునకు ఆ పేరువచ్చింది. అక్కడ ఆవిర్భవించినది నరసింహస్వామి అవతారము. మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు. స్వాతి నక్షత్రమునకు నరసింహస్వామికి చాలా దగ్గర సంబంధము. స్వాతి నక్షత్రములో ప్రదోషవేళలో ఆవిర్భవించినది వైశాఖ మాస చతుర్దశి నాడు స్వాతీ నక్షత్రము ఉండగా శృంగగిరి పీఠాధిపతులు బ్రహ్మ ముహూర్తములో ఆసనము వేసుకుని కూర్చుని పూజ మొదలు పెడితే మళ్ళీ ప్రదోషవేళలో నరసింహస్వామి ఆవిర్భావము వరకు కాలు కదపరు. అలాగే కూర్చుని పూజ చేస్తారు. ఆవిర్భావసమయము అయిపోయాక పూజ పూర్తిచేసి నీరాజనము ఇచ్చిఅందరికీ పానకమును ప్రసాదముగా ఇచ్చి పూజా పీఠము మీదనుండి అప్పుడు లేస్తారు. అంత గొప్ప అవతారము. అహోబిల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు. నవ నారసింహులని చూడటానికి దారి తెలియదని స్వాతీ నక్షత్రము ఉండగా తీసుకుని వెళ్ళడానికి సహాయము చేయడానికి కొన్ని బృందములు ఉన్నాయి. దగ్గర ఉండి తీసుకుని వెళ్ళి దర్శనము చేయిస్తుంటారు.


1.జ్వాలానరసింహుడు:..

ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.


2.అహోబిల నరసింహస్వరూపము:..

హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.


3. మాలోల నరసింహుడు :..

లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.


4. కరంజ నరసింహుడు :..

అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.


5. పావన నరసింహుడు:..

ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.


6. యోగ నరసింహుడు :..

అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.


7. చత్రవట నరసింహస్వరుపము :..

పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.


8. భార్గవ నరసింహుడు :..

 పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము.


9. వరాహ నరసింహస్వరూపము:..

భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబిలక్షేత్రములో ఉంటాయి.


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List