మహాలక్ష్మి అమ్మవారి గజ పూజ.. ~ దైవదర్శనం

మహాలక్ష్మి అమ్మవారి గజ పూజ..



ఏనుగు మస్తకాన (నుదుట) మహాలక్ష్మి నివాసముంటుందని అంటారు. అందువలన నిత్యమూ శ్రీవైష్ణవాలయాలలో ప్రాతఃకాలంలో ఆలయ ముఖద్వారం తెరచిన వెంటనే గర్భగుడి ముందు ఆలయ గజమునకు పూజ చేసి సన్నిధి చుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. దీనికే ' గజ పూజ ' అని పేరు. ఏనుగు ఘ్రీంకార ధ్వని మహాలక్ష్మి కి ప్రీతిపాత్రమని శ్రీ సూక్తం"లో వివరించబడినది.
లక్ష్మీ దేవి అవతరించగానే భూభారం వహించే అష్ట దిక్కుల గజములు పవిత్ర జలాలతో లక్ష్మీ దేవిని అభిషేకించి పూజించాయి. ఈ దేవిని గజలక్ష్మిఅని పిలుస్తారు. గజలక్ష్మి శిల్పాలను ఆలయ ప్రవేద్వారములపైన, గృహ ముఖ ద్వారము పైన ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తున్నది. ఏనుగు యొక్క ఆశీర్వాదం లభించినవారికి
లక్ష్మీ కటాక్షం సిధ్ధిస్తుంది.
మృగాలలో అత్యంత బలమైనది ఏనుగు. మహిమాన్వితమైన అంశలు కలది. ఈ లోకంలో ఉండే జీవకోటిలో రెండు నాసికారంధ్రముల ద్వారా ఒకే సమయంలో శ్వాసించే శక్తి గజమునకు మాత్రమే వున్నది. మనుషులలో ప్రతీ 24
నిముషాలకి ఒకసారి శ్వాస ఒక నాసికా ద్వారము నుండి మరియొక నాసికా ద్వారానికి మారుతూనే వుంటుంది.
శ్వాసను కట్టుబాటు చేసే ప్రాణాయామం , వాసియోగం మొదలైనవి మన ఆధ్యాత్మిక చింతనను అభివృధ్ధి చేసే వ్యాయామాలు. వాసియోగం లేక ప్రాణాయామం లో ఒక స్ధితికి చేరుకున్న వారు సదా రెండు నాసికా ద్వారాల ద్వారా శ్వాసించే శక్తిని పొందగలరు. సహజంగానే ఈ ప్రాణాయామ శక్తి గల గజరాజు తన తొండమును మన తల మీద పెట్టి ఆశీర్వదిస్తే మనకి మహాలక్ష్మి దేవి కరుణాకటాక్షం లభిస్తుందని అంతరార్ధం.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List