శ్రీ గుంటి గంగాభవానీ ఆలయం. ~ దైవదర్శనం

శ్రీ గుంటి గంగాభవానీ ఆలయం.




ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గుంటి గంగాభవానీ అమ్మవారి ఆలయం కృతిసోయగం.. పచ్చదనం... కనువిందు చేసే  పంచకొండలైన గంగకొండ, దొడ్డికొండ, నల్లకొండ, పంజాపులికొండ, పల్లకొండల నడుమ  తాళ్లూరు మండలంలోని గుంటిగంగలో కొలువై ఉంది ఈ  గంగాభవానీ అమ్మవారి ఆలయం కరిక కోర్కెలు తీర్చే కల్పవల్లిగా గంగమ్మతల్లిని కొలుస్తారు.  ప్రతి ఏడాది చైత్ర మాసం బహుళ విధియ నాడు వైభవంగా తిరునాళ్ల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ తిరునాళ్లలో విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొండ కోనల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతకు ఆనవాళ్లు.


🔅 స్థల పురాణం..


గంగా భవానీ ఆలయం 12వ శతాబ్దం నాటిదని, కాటంరాజు కాలంలో నిర్మించిన గంగమ్మ తల్లి దేవాలయాల్లో ఇది ఒక్కటిగా స్థానికులు చెబుతుంటారు. ఈ గుడికి దక్షిణం వైపు కొండపాదు వద్ద ఉన్న పెద్ద రాతిగుండు కిందిగా నీరు ప్రవహిస్తుండటం వలన దీనిని గుండు గంగగా పిలిచేవారు. ఏడాది పొడవుగా ప్రవహించే జల ఆధారంగా చుట్టు పక్కల గ్రామాల రైతులు పంటలు పండించే వారు. ఈ జల గంగమ్మ తల్లి వర ప్రసాదంగా భావించి ప్రతి ఏడాది తిరునాళ్లు జరపడం ఆనవాయితీగా వస్తుంది. 


జలాధారపై ఉన్న గుండును తొలగిస్తే ఇంకా జలధార పెద్దదిగా వస్తుందని భావించిన రైతులు దానిని పక్కకు తొలగించారు. దీంతో అక్కడ గుంత ఏర్పడింది కాని నీరు మాత్రం పెరగలేదు. అప్పటి నుండి గుంట గంగగా పిలుస్తూ కాల క్రమంలో దానిని గుంటి గంగగా మార్పు జరిగింది. ఇక్కడ నీటిప్రవాహం కాశీలోని గంగాప్రవాహంలా గంగవాగు దక్షిణం నుంచి ఉత్తరంకు ప్రవహిస్తూ దక్షిణకాశిగా ఖ్యాతి గడించింది. 


పూర్వం మునులు తపస్సు చేసుకుంటూ గుంటి గంగలో స్నానం ఆచరించి శివాలయంలో పూజలు చేసేవారని చెబుతారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ మునులు జపిస్తున్న మంత్రాలు వినిపించేవని, అందువలన ఈ ప్రాంతాన్ని స్వాముల వారి ధ్వని అని పిలిచేవారని పెద్దలు చెబుతుంటారు. కండ పైభాగం నుండి ప్రవహించే నీరుదిగువ గంగవాగుకు పూట ద్వారా చేరుతున్నదని తెలుస్తోంది. అక్కడ ఉన్న గుంటిగంగ(కోనేరు)చుట్టూ దారంవెంకటరెడ్డి కట్టడం చేయించి భక్తులు స్నానాలు చేసే ఏర్పాట్లు చేశారు.


దశాబ్దం క్రితం గంగమ్మ, శివాలయాలను పునరుద్ధరించారు. గుంటిగంగ సన్నిధిలో గంగాభవానీ ఆలయంతో పాటు సుబ్రమణ్యస్వామి, వీరాంజనేయుడు,కాశీవిశ్వేశ్వరుడు, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలు,కాశి నాయన ఆశ్రమం, నాగ దేవత పుట్టలు కూడా ఉన్నాయి.  అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న శ్రీకృష్ణ మందిరంలో భక్తులు పూజలు చేస్తుంటారు. 


పూర్వం ఈ ఆలయం కొండ కోనల మధ్య అడవిలో ఉండటంతో తిరునాళ్లను పగలు చేసే వారు. క్రమేపి అడవి అంతరించిపోవడంతో తిరునాళ్ల మహోత్సవాన్ని రాత్రి సమయాల్లో నిర్వహిస్తున్నారు. ఏటా తిరునాళ్లకు లక్షలాధి మంది భక్తులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల నుండి వచ్చి గంగమ్మను దర్శించుకుంటారు.


1970 నుంచి జాతర ప్రాచూర్యం పెరిగి లక్షల మంది గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత ప్రాచూర్యం పొందింది. తిరునాళ్ల సందర్భంగా నిర్వాహకులు, ఔత్సాహికులు ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.


తరునాళ్ల సమయంలోనే కాకుండా శుక్ర, ఆదివారాల్లో భక్తులు వందల సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారికి పొంగళ్లు నైవేధ్యంగా సమర్పిస్తారు. అలాగే వివిధ కులాల సత్రాలు ఉన్నాయి. శ్రీశైలం తరువాత అన్నీవర్గాలకు చెందిన కుల సత్రాలు అధికంగా ఉన్నది ఇక్కడే. ఈ సత్రాల వద్ద తిరునాళ్ల రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతారు.


( ప్రకాశం జిల్లా, గుంటిగంగ శ్రీ గుంటి గంగాభవానీ ఆలయం)

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List